Link copied!
Sign in / Sign up
32
Shares

ప్రగ్నన్సీ సమయంలో మీ కడుపు గట్టిగా ఉంటే దాని అర్థం ఇదే..!

గర్భ సమయం మహిళలకు చాలా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో గర్భిణీ మహిళల శరీరంలో కలిగే మార్పులు, వాటిని తట్టుకోవడం వారికి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. సాధారణంగా ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు అలసట, చేతులు కాళ్ళ వాపులు, వికారం, అప్పుడప్పుడు వాంతులు కావడం,  నీరసంగా ఉండటం సాధారణమే. అలాగే కడుపు ముందుకు రావడం కూడా, కానీ ప్రగ్నన్సీ సమయంలో కడుపు గట్టిగా ఉండటం వెనుక అసలు కారణం  ఏంటో తెలుసుకుందాం…

కడుపు గట్టిగా ఎందుకు ఉంటుంది..?

ప్రగ్నన్సీ సమయంలో కడుపు గట్టిగా ఉండటం అనేది సాధారణమేమీ కాదు, కడుపు కండరాలు గట్టిగా ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనినే వైద్య భాషలో ‘బ్రాక్స్టన్ హిక్స్’ అని అంటారు. శరీరంలో జరిగే కొన్ని మార్పుల కారణంగా గర్భాశయ కండరాలు బిగుతుగా మారి, గర్భంతో ఉన్న మహిళను చాలా ఇబ్బంది పెడతాయి. రెండో త్రైమాసికంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ మరియు బిడ్డ పుట్టబోతున్నాడని అనే సూచిక కూడా.

ప్రగ్నన్సీ మహిళకు ఇలా ఐతే ప్రమాదమా..!
ప్రగ్నన్సీ సమయంలో కడుపు ఇలా గట్టిగా మారటం ఏమైనా ప్రమాదమా ఉందా అని చాలామందికి ఉన్న అనుమానం. ప్రమాదం ఐతే ఏమీ ఉండదు కానీ, కడుపు కండరాలు గట్టిగా ఉండటం వలన గర్భాశయంపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. అలాగే గర్భాశయ కండరాలు గట్టిగా మారటం వలన మీరు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఇలా గట్టిగా కడుపు ఉండటం వెనుక ఎక్కువ శ్రమ, సెక్స్, రక్తస్రావం, డీ హైడ్రేషన్ (నీరు తక్కువగా తీసుకోవడం) కారణాలుగా చెప్పుకోవచ్చు.
కడుపు గట్టిగా ఉన్నప్పుడు ఉపశమనం ఎలా పొందాలి..?
డీహైడ్రేషన్ : 

ఇంతకుముందే చెప్పుకున్నట్లు ప్రగ్నన్సీ మహిళ తప్పకుండా మంచినీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. నీరు ఈ సమయంలో తక్కువ ఐతే శరీరం వేడిగా ఉండటం, కాళ్ళు, చేతులు వాపులుగా ఉండటం జరుగుతుంది. అందుకని మంచి నీటిని ఎక్కువగా తీసుకోమని గర్భిణీ మహిళలకు చెప్పండి.

వెచ్చగా ఉండే పానీయాలు : 

వెచ్చగా ఉండే పానీయాలు పాలు, గ్రీన్ టీ వంటి పోషక విలువలు బాగా ఉన్నటువంటి ద్రవాలను తీసుకోవడం వలన కొంచెం ఉపశనంగా ఉండి, కండరాలపై ఒత్తిడి ఉండదు.

వేడినీటితో స్నానం : 

గర్భంతో ఉన్నప్పుడు గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం వలన కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే కడుపు కండరాలపై కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఒకే చోట ఉండకుండా కదలాలి : 

ఎప్పుడు ఒకేచోట కూర్చోవడం, ఒకే పొజిషన్ లో ఎక్కువ గంటలు పడుకోవడం, చాలా ఎక్కువ సమయం నిలబడటం కూడా కడుపు కండరాలు గట్టిగా మారటానికి కారణం. మీ శరీరానికి ఈ సమయంలో రక్త ప్రసరణ బాగా జరగటం చాలా అవసరం కాబట్టి కాస్త నడవటం, తిరగటం చేయాలి. కడుపు కండరాలు మరీ ఎక్కువగా ఉండి, నొప్పిగా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ వెళ్లి చెకప్ చేయించండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon