Link copied!
Sign in / Sign up
24
Shares

ప్రగ్నన్సీ సమయంలో జీడిపప్పు తినడం వలన కడుపులో బిడ్డకు ప్రమాదమా..? అసలు నిజం ఇదే..

గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలనేది ప్రతి తల్లిలో ఉండే అనుమానం. ఎందుకంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని సురక్షితంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటుంది కాబట్టి. ఐతే కొంతమంది మహిళలు  ప్రగ్నన్సీ సమయంలో జీడిపప్పు తీసుకోవచ్చా? అని అడిగారు. అందుకే సమాధానమే ఈ ఆర్టికల్. తప్పకుండా అందరికీ SHARE చేయండి…

జీడిపప్పు ఉపయోగాలు

ప్రగ్నన్సీ సమయంలో కాకుండా సాధారణంగా ఉన్నప్పుడు జీడిపప్పు (కాజూ) తీసుకోవడం వలన బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి,  రక్త సరఫరా బాగా జరిగేందుకు, తెల్లజుట్టుతో బాధపడేవారికి మంచి ఉపశమనంగా, కండరాలు బలంగా ఉండటానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిందే. ఐతే ప్రగ్నన్సీ సమయంలో జీడిపప్పు వలన కలిగే ప్రయోజనాల గురించి, బిడ్డకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..

బిడ్డ పెరుగుదలకు

గర్భంతో ఉన్నప్పుడు శిశువు పెరుగుదల సక్రమంగా జరగడానికి కావలసిన విటమిన్లు మొత్తం జీడిపప్పులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా జీడిపప్పు తీసుకోవచ్చు. కానీ పది గ్రాములకంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అంటువ్యాధులు కలగకుండా

జీడిపప్పులో అధిక స్థాయిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ప్రగ్నన్సీ మహిళకు అంటువ్యాధులు సోకవు. అలాగే ఈ సమయంలో ఎక్కువ శక్తి మహిళకు అందించే బెస్ట్ ఫుడ్ కాజును చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువ మోతాదులో కాల్షియం ఉండటం వలన ఎముకల బలానికి పిండం అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి.

బరువు పెరిగే ప్రమాదం ఉంది

కాజూలో క్యాలరీలు అధికంగా ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రెగ్నన్సీ సమయంలో అధిక బరువు మంచిది కాదు. కొందరి శరీరానికి ఇవి పడవు. చర్మంపై దద్దుర్లు కలిగించడం, రాత్రిళ్ళు నిద్ర డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది.

కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి

ఎక్కువ మోతాదులో తినడం వలన అధిక బరువు పెరగడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకని ఎంత మోతాదులో తినాలి, మీ శరీరానికి ఇవి పడతాయో లేదో డాక్టర్ ను అడిగి తినడం మంచిది.

కాజూని వీటితో తినండి

జీడిపప్పును ఎప్పుడు విడిగా కాకుండా ఇతర డ్రై ఫ్రూట్స్ లేదా స్వీట్స్ తో కలిపి తీసుకోవడం ఉత్తమం. ఈ ముఖ్యమైన సమాచారం మీకు నచ్చితే అందరికీ వెంటనే SHARE చేయగలరు.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon