Link copied!
Sign in / Sign up
3
Shares

ప్రెగ్నన్సీ సమయంలో ఐస్ క్రీం తినడం ప్రమాదమా?

ప్రెగ్నన్సీ సమయంలో మహిళలు తమకు ఇష్టమైనవి తినాలని కోరుకుంటారు. ఆ ఇష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడుతారు. కానీ ప్రెగ్నన్సీ సమయంలో ఐస్ క్రీం తినడం మంచిదేనా? ప్రెగ్నన్సీ సమయంలో ఐస్ క్రీం తినడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదా? ఇక్కడ తెలుసుకుందాం.

ఐస్ క్రీం తినడం ప్రమాదమా?

ప్రెగ్నన్సీ సమయంలో ఐస్ క్రీం తినడం ప్రమాదమేమీ కాదు. కానీ ఎలాంటి ఐస్ క్రీం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నది గమనించుకోవాలి. పాలతో పండ్లతో చేసిన నాణ్యమైన ఐస్ క్రీమ్స్ మాత్రమే తినండి. కృతిమ ఫ్లెవర్స్ తో చేసిన ఐస్ క్రీమ్స్ కు దూరంగా ఉండండి. అందులో వుండే రసాయనాలు మీకు కడుపులోని బిడ్డకు హాని కలిగించవచ్చు. ప్రెగ్నన్సీ సమయంలో మీరు తినే ఐస్ క్రీం ను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇంట్లో సహజంగా తయారు చేసేన ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా మంచిది.

అలానే ప్రెగ్నన్సీ సమయంలో ఎంత ఐస్ క్రీం తినాలి అన్నది కూడా ప్రశ్నే. ఐస్ క్రీం మాత్రమే ప్రెగ్నన్సీ సమయంలో ఏ ఆహారమైన అమితంగా తీసుకోవడం మంచిది కాదు. మీకు తినాలనిపించినప్పుడు కొంచెం కొంచెం గా తినండి. ఒకే సారి మరి ఎక్కువగా తీసుకోకండి. ఐస్ క్రీం ఎక్కువగా  తినడం వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావచ్చు. ఇవి మీకు బిడ్డకు కూడా ప్రమాదమే. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో మీకు ఐస్ క్రీం తినాలనిపిస్తే మితంగా తీసుకోండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon