Link copied!
Sign in / Sign up
13
Shares

6వ నెల నుండి 9వ నెల ప్రెగ్నన్సీ సమయంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు

ముందుగా కష్టమైన రెండు మాసాలు పూర్తి చేసుకుని మూడవ త్రైమాసికంలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. ఈ సమయంలో మీరు చాలా ఆనందిస్తారు ఎందుకంటే ముందుతో పోలిస్తే మూడవ త్రైమాసికంలో హాయిగా ఉంటుంది. కొంచెం ఆందోళన కూడా ఉంటుంది  కానీ దాని కంటే మీ బిడ్డ కడుపులో ప్రాణం పోసుకుంటున్నాడు అనే ఆనందమే ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు మూడవ త్రైమాసికంలో చేయవలసిన మరియు చేయకూడని పనులు తెలుసుకుందాము…

చేయవలసిన పనులు
1. ప్రసవానికి సిద్ధంకండి

ప్రసవం ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరగదు. అందుకోసమే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండటం మంచిది. ప్రసవం మీకు మొదటి సారి అయితే దాని గురించి ఎక్కువ చదవండి, తెలుసుకోండి తద్వారా మానసికంగా తయారవ్వండి. ఈ సమయంలోనే ప్రసవ సమయంలో మీతో పాటు ఎవరుండాలి, అధిక నొప్పిని ఎలా అధిగమించాలి వంటి విషయాల గురించి ఆలోచించండి.

2. పిల్లల పెంపకం గురించి ఎక్కువ చదవండి

ఇంకా కొన్ని రోజుల్లో మీ కలలకు రూపం వచ్చి ప్రాణం ఉన్న బిడ్డగా మీ చేతుల్లో ఉంటాడు. మరి వారిని బాగా చూసుకోవాలి కదా! అందుకే పిల్లల రక్షణ గురించి పెంపకం గురించి వీలైనంత తెలుసుకోండి. మీ భర్తను కూడా చదవమని తెలుసుకోమని చెప్పండి. ప్రతి సారి మన దగ్గర అనుభవం ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు కదా.

3. బ్రెస్ట్ ఫీడింగ్ కి సిద్ధంకండి

బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ చదివి తెలుసుకొని మీ అమ్మతనం మధురంగా చేసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అనుభవం ఉన్న వారిని అడగండి, చదవండి, మార్గం ఏదయినా పూర్తి వివరాలు, ఎదురయ్యే సమస్యలు తెలుసుకొని సిద్ధంగా ఉండండి.

4. మీ పుట్టబోయే బిడ్డ గదిని సిద్ధం చేయండి

మీకు పుట్టబోయే బిడ్డ కోసం కావాల్సిన వస్తువులను ముందే కొని పెట్టుకోండి. కుదిరితే మీ ఇంట్లో ఒక గదిని బేబీ ప్రూఫ్ చేయించండి. అంతేకాకుండా ఇంట్లో ఏమైనా రిపేరీలు ఉన్నా పునరద్ధరణలు ఉంటె వాటిని పూర్తి చేసి మీ చిన్నారి ఇంటికి వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంచండి.

5. నిమ్మళంగా ఉండండి

ప్రెగ్నన్సీ సమయంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ కష్టం అంతా ఫలిచబోతోంది కాబట్టి కంగారు పడకండి. నిమ్మళంగా మీ చిన్నారిని ఊహించుకుంటూ హాయిగా ఉండండి. ఈ సమయంలో మీరు టెన్షన్ ఎక్కువ పడకండి. వేగంగా లేవడం, కంగారు పడటం అటువంటివి అస్సలు చేయకండి.

చేయకూడని పనులు
1. నిద్ర కోల్పోకండి

అవసరమైనంత నిద్ర మీకు అత్యంత అవసరం. అందువలన ఏవేవో ఆలోచించుకుంటూ మీ నిద్రను కోల్పోకండి. నిద్రలేకపోవడం వలన మీ సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. కావున, అన్ని విషయాలను పక్కన పెట్టేసి సుఖంగా నిద్రపోండి.

2. ఒత్తిడిని దరి చేరనీకండి

ముందు చెప్పినట్టు ప్రెగ్నన్సీ సమయంలో ఎంతో టెన్షన్ మరియు ఒత్తిడికి గురవుతారు. మీకు పుట్టబోయే బిడ్డ గురించి లేదా ఇంట్లో సమస్యల గురించి ఒత్తిడికి లోను అవుతారు. ఇది మీకు మీ బిడ్డకు కూడా మంచిది కాదు. ఈ సమయంలో మీ కడుపులో ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న పరిస్థితిని పసిగట్టగలడు. కావున, యోగ లేదా మీకు నచ్చిన పని అంటే పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చెడు ఆలోచనలకు తద్వారా ఒత్తిడికి దూరంగా ఉండండి.

3. మీకు చెప్పిన డేట్ లో ప్రసవం జరగకపోతే కంగారుపడకండి

అందరికి ఒకేలా ప్రసవం జరగదు. కొందరికి చెప్పిన టైంలో అవుతుంది మరికొందరికి అవ్వదు అనే విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్స్ మీకు ఇచ్చే డేట్ ఒక ఐడియా కోసమే. ఆ రోజు జరగపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు.

4. వంగి కూర్చోవడం నిలపడటం వంటివి చేయకండి

ప్రెగ్నన్సీ సమయంలో మనం ఎలా నిలబడుతున్నాం, ఎలా కూర్చుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. వంగి కూర్చోవడం వలన మీకు నడుము నొప్పి రావచ్చు. అసలే ప్రెగ్నన్సీ కారణంగా బాధపడుతున్న మీకు ఈ నడుము నొప్పి మరింత చికాకు తెప్పిస్తుంది.

5. ప్రసవం తరువాత మీ శరీరాకృతి గురించి కొన్ని రోజులు ఆలోచించకండి

ప్రసవం తరువాత కూడా మీరు గర్భవతిలా కనపడే అవకాశం ఉంది. పొట్ట కండరాళ్ళు సాగడం ఇందుకు కారణం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే చిన్న వ్యాయామాల ద్వారా మీరు తిరిగి మీ పూర్వకృతికి వచ్చేస్తారు. కాబట్టి మీ శరీర మార్పు గురించి మాసికంగా సిద్ధగా ఉండటం మంచిది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon