Link copied!
Sign in / Sign up
32
Shares

ప్రెగ్నన్సీ సమయంలో భర్తలు భార్యలను ఎందుకు మోసం చేస్తారు..!!

భర్తలు వేరే మహిళలతో సంబంధం పెట్టుకోవడం, భార్యలు ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. అందరూ ఇలా చేయరు, కానీ చేసే వాళ్ళు భార్యలు ప్రెగ్నన్సీ తో ఉండడాన్ని ఒక అవకాశంగా తీసుకుంటారు. భర్తలు ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు మూడు విధాలుగా ప్రవర్తిస్తారు. అవేంటో ఇక్కడ చుద్దాం…

1. మొదటి రకం

కొంత మంది భర్తలు ప్రేమను కేవలం శారీరక అనుభవంగా భావించరు. కేవలం ఏకాంతం మాత్రమే కాదు, తమ మధ్య జరిగే చిన్న విషయాలకు కూడా చాలా విలువిస్తారు. అందుకే మీరు ప్రెగ్నన్సీ సమయంలో మీ మధ్య అది జరగకపోయినా జరగకపోయినా, ప్రేమ మాత్రం తగ్గదు. భార్యను, కడుపులోని బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంతే కాదు ఆ బాధ్యతను తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి భర్తల నుండి మీరు ఎటువంటి భార్యలకు ఎటువంటి సమస్య రాదు.

2. రెండవ రకం

వీరికి ఆ విషయం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అది కూడా చాలా యాంత్రికంగా ముగిస్తారు. కేవలం శరీర అవసరానికి మాత్రమే, ఒకరికొకరి దగ్గర ఉండి అందులో పాల్గొంటారు. ఏ మాత్రం ప్రేమ ఉండదు. ఇలాంటి భర్తలకు భార్య ప్రేగ్నన్ట్ అవడం వలన, ఆ అవకాశం ఉండదు. భార్య ప్రెగ్నన్సీ సమయంలో వీరి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. వీరు ప్రెగ్నన్సీ సమయంలో భార్యలను మోసం చేసే అవకాశం ఉంటుంది.

 

 

 

3. మూడవ రకం

భార్య మీద భర్తకు మొదటి నుండి ఏ విధమైన ప్రేమ లేకపోవడం, దీనికి దారి తీయచ్చు. వీరు వారికి ఇంతకముందు నుండి ఉన్న ఆలోచనను ఇప్పుడు ఆచరిస్తారు. భార్య ప్రెగ్నన్సీ తో ఉండడాన్ని ఒక అవకాశంగా తీసుకుంటారు. చేసిన తప్పుకు అది సాకు మాత్రమే ఆ ఆలోచన వారికి ఇంతకముందు నుండి ఉంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon