Link copied!
Sign in / Sign up
27
Shares

ప్రెగ్నన్సీ సమయంలో రోజు బాదం తినాలి : అందుకు వైద్యులు చెప్తున్న 8 కారణాలు ఇవే

ప్రెగ్నన్సీ సమయంలో మీ కడుపులోని బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలు బాదం కలిగి ఉంటుంది. మీ శరీర నెల వారి అవసరాలకు కావాల్సిన పోషకాలు, విటమిన్లు, క్యాలోరీలు ఇందులో ఉంటాయి. అయితే ప్రెగ్నన్సీ సమయంలో బాదం తినడం మంచిది కాదని కొంత మంది భావిస్తారు. అందుకు ఏ విధమైన  ఆధారాలు లేవు. మీరు ప్రెగ్నన్సీ ముందు బాదం సహజంగా తింటున్నటైతే ప్రెగ్నన్సీ సమయంలో కూడా తినడంలో ఏ ప్రమాదం లేదు. డాక్టర్ లు, నిపుణులు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు రోజు బాదాం తినాల్సిందిగా సూచిస్తున్నారు. అందుకు వారు చెప్తున్నా కారణాలు ఇవే…

1. ప్రోటీన్లు

కడుపులోని బిడ్ద కండరాల ఎదుగుదలకు కావాల్సిన ప్రోటీన్లు బాదంలో అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రెగ్నన్సీ సమయంలో , ఆ తరువాత డెలివరీ ని ఎదురుకోవడానికి మీకు కావాల్సిన శక్తిని, బలాన్ని బాదంలోని ప్రోటీన్లు మీకు అందిస్తాయి. రోజు బాదం తినడం వలన బిడ్డ బరువు కూడా పెరుగుతుంది.

2. పీచు

బాదంలోని పీచు పదార్ధాలు ప్రెగ్నన్సీ సమయంలో సహజముగా వుండే అరుగుదల సమస్యలను నివారిస్తాయి. పేగులు శుద్ధి చేయబడతాయి. మల బద్దకం లాంటి సమస్యలు రావు.

3. విటమిన్ ‘ఇ’

మీ కడుపులోని బిడ్డ యొక్క జుట్టు, చర్మం ఆరోగ్యంగా అందంగా ఎదగడానికి కావాల్సిన విటమిన్ ‘ఇ’ ను బాదం ద్వారా మీకు అందుతుంది. అంతేకాకుండా మీరు కూడా అందంగా కనపడడానికి విటమిన్ ‘ఇ’ సహాయపడుతుంది.

4. కాల్షియమ్

బిడ్డ పళ్ళు, ఎముకలు ఏర్పడడానికి కావాల్సిన కాల్షియమ్ బాదంలో పుష్కలంగా ఉంటుంది. ప్రెగ్నన్సీ సమయంలో అధిక వత్తిడిని కాల్షియమ్ నివారిస్తుంది.

5. మాంగనీస్

బాదంలో ఉండే మాంగనీస్ తల్లి బిడ్డ బరువును నియంత్రిస్తుంది. అంతే కాకుండా ఎముకలను బలంగా దృడంగా చేస్తుంది.

6. రిబోఫ్లావిన్ (Riboflavin)

రిబోఫ్లావిన్ పిల్లల మానసిక ఎదుగుదలకు కావాల్సిన ముఖ్యమైన విటమిన్. దీనినే విటమిన్ ‘బీ2’ అని కూడా అంటారు. ఇది కడుపులోని బిడ్డ గ్రహించే, ఆలోచించే, శక్తిని పెంచుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్ బాదంలో పుష్కలంగా దొరుకుతుంది.

7. మెగ్నీషియం

బాదంలోని మెగ్నీషియం కడుపులోని బిడ్డ నాడి  వ్యవస్థ అభివృద్ధికి అవసరమవుతుంది. మీ బిడ్డకు కావాల్సిన మెగ్నీషియం బాదం ద్వారా మీకు అందుతుంది.

8. ఫోలేట్

కడుపులోని బిడ్డ మెదడు ఎదుగుదలకు కావాల్సిన ముఖ్యమైన విటమిన్ ఫోలేట్. దీనినే విటమిన్ బి9 అని కూడా అంటారు. ఈ బిడ్డ నాడి వ్యవస్థలోని లోపాలను తొలిగిస్తుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon