Link copied!
Sign in / Sign up
40
Shares

ప్రెగ్నన్సీ సమయంలో భార్యల శరీరం గురించి భర్తలు ఎలా ఆలోచిస్తారు? మాతో పంచుకున్న 6 భర్తలు

భార్యాభర్తలకు తమ జీవితంలో కలిగే మొట్టమొదటి ఆనందం తమ జీవితంలోకి ఇంకొకరు (బాబు/పాప) రాబోతున్నారని  తెలిసినప్పుడు. భార్య గర్భం దాల్చినప్పుడు భార్య కంటే ఎక్కువగా సంతోషిస్తాడు, కానీ తన భావాలను బయటకు చెప్పుకోలేడు. అయితే భార్య ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు భర్తలు ఎలా తమ  భార్యల శరీరం గురించి ఎలా ఆలోచిస్తారో మాతో 6 మంది భర్తలు ఈ విధంగా పంచుకున్నారు. ఆ విషయాలేంటో మీరూ చూడండి.

చాలా బాధగా ఉంటుంది

భర్తకు భార్యంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేడు కానీ చేతల్లో ఎక్కువగా చూపిస్తుంటారు. అందుకే భార్య గర్భవతి అని తెలియగానే ఎంత సంతోషిస్తాడో అంతే విచారంగా, బాధపడటం చేస్తాడు. అప్పటివరకు తనను ఎంతో ప్రేమగా చూసుకున్న నా భార్య ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోగలదా,  ఆరోగ్యంగా ధైర్యంగా ప్రసవించడం తనకు సాధ్యమేనా అని టెన్షన్ పడుతుంటాడు. ఎందుకంటే భార్య అంటే అంత ఇష్టం, ప్రేమ కాబట్టి.. -వంశీ

నా భార్య కంటే అందగత్తె లేరు

ఇలా చెప్పవచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నా భార్య ప్రెగ్నన్సీ కావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే నా భార్య గర్భంతో ఉన్నప్పుడు తనను మించిన అందగత్తె లేరనేది నా ఫీలింగ్. అలాగే మాములుగా కన్నా ప్రెగ్నన్సీ సమయంలోనే నా భార్యపై నాకు ఎక్కువ అట్రాక్షన్ కలిగింది. తను గర్భవతి కాబట్టి ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని తెలుసు కానీ నాకు ఈ సమయంలో నా భార్యతోనే ఉండాలనిపిస్తుంది. -మోహన్

చాలా ప్రకాశవంతంగా ఉంటుంది

నా భార్యతో ఈ మాటలు చాలా సార్లు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు. సిగ్గు వలనో, బిడియం వలనో తెలీదు కానీ ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తన శరీరం, తన ముఖం ఇప్పటికి నాకు గుర్తు ఉన్నాయి. తను ఎంతో ప్రకాశవంతంగా ఉండేది ఆ సమయంలో. అదే సమయంలో తనకు కీళ్లు నొప్పులుగా ఉన్నాయని, వికారంగా ఉందని ఎంతో బాధపడేది. తను పడుతున్న బాధను చూస్తే కన్నీళ్లు వచ్చేవి. -ప్రవీణ్

అసహజం కానీ మంచిదే

ఒకసారి హెల్త్ క్లాస్ కు అటెండ్ అయ్యినప్పుడు భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్తతో శృంగారంలో పాల్గొనవచ్చా? అనే విషయం గురించి చెప్పారు. అప్పుడు అది అసహజం అలా ఎలా చేస్తారు? బిడ్డకు తల్లికి ప్రమాదం ఉండదా..! అనే అనుమానం భయం కలిగింది. అలాగే నా భార్య గర్భంతో ఉన్నప్పుడు అదే విషయం ఆలోచించాను, కానీ ఉద్రేకంగా కాకుండా భావప్రాప్తి పొందేలా భార్యతో శృంగారం చేస్తే గర్భానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు వైద్యులు.  -అజయ్

తన వక్షోజాలు ఆకర్షిస్తాయి

ప్రెగ్నన్సీని పొందటం మహిళకు దక్కిన అదృష్టమే కానీ తన భర్త తోడుగా ఉండటం ఈ సమయంలో భార్యకు కలిగే సంతోష క్షణాలు. నా భార్య గర్భం దాల్చిన తర్వాత తన వక్షోజాలు అంతకుముందు కంటే పెద్దవిగా ఆకర్షణగా కనిపించాయి. తన మేను సౌందర్యం, తన కళ్ళలో కనిపించే అందమైన వెలుగు, తన నుండి వచ్చే శ్వాస నా భార్య పక్కనే ఉండేలా చేశాయి. -గౌతమ్

శరీరం చల్లగా ఉంటుంది

పెళ్లి తర్వాత నా భార్యే నాకు ప్రపంచం అయ్యింది. పెళ్ళైన కొద్ది  నెలలలోనే తను గర్భం దాల్చింది. ఆ సమయంలో ఎంత సంతోషం కలిగిందో తను పుట్టింటికి వెళ్తుందేమోనని భయం కూడా వేసింది. నువ్వు బిడ్డకు జన్మను ఇచ్చేంత వరకు నాతోనే ఉండాలి అని చెప్పగానే సరే అని ఒప్పుకుంది. ఎప్పుడు తన గర్భాన్ని తాకుతూ తన శరీరంపై చేతులు వేస్తుంటే ఎంత చల్లగా ప్రశాంతంగా ఉండేది. ఇది నా భార్యకు చెప్పేది ఏమీ అనకుండా చిన్న నవ్వు నవ్వేది. -ప్రదీప్

భర్త మనస్సు నిజంగా ఎంత గొప్పదో కదా.. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon