Link copied!
Sign in / Sign up
65
Shares

భార్యల స్ట్రెచ్ మార్క్స్ గురించి భర్తలు ఏమనుకుంటారు : 8 మంది భర్తలు మాతో పంచుకున్న విషయాలు

మగవారిని బాగా ఆకర్షించడంలో అందం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రసవం జరిగిన తర్వాత మహిళల అందం తగ్గుతుందని మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పొట్ట దగ్గర ఎక్కువగా వాతలు వచ్చే అవకాశం ఉంది.  దీంతో చాలా మంది మహిళలకు ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇలా మచ్చలు లేదా వాతలు రావడం వల్ల భర్త తమను దూరంగా ఉంచుతారనే అభిప్రాయం ఆడవారిలో ఉంటుంది. అయితే, మగవారికి తమ బాగస్వామిలో ప్రసవం తర్వాత వచ్చిన మార్పులు మీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో మీకు తెలియక పోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాము.

వ్యక్తిత్వం ముఖ్యం:

చాలా మంది మగవారు తమను అర్థం చేసుకొనే అమ్మాయి వస్తే చాలని అనుకుంటారు. వ్యక్తిత్వం నిజంగా బాగుంటే  వారి అందాన్ని నేను అస్సలు పట్టించుకోను అని ఒక భర్త తెలిపారు.

నాకు అప్పుడే వారు నచ్చుతారు:

నా భార్యకు వీపు కింద భాగంలో చాల పెద్ద మొత్తంలో మార్క్స్ వచ్చాయి. చాలా మంది మగవారికి అలా ఉంటే నచ్చదు కానీ నేను మాత్రం ఆమెను ఇప్పుడు మరింత ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఆమె మునుపటితో పోలిస్తే ఇప్పుడు మరింత జెన్యూన్‌గా ఉంది అని కొత్తగా తండ్రి అయిన వ్యక్తి తెలిపారు.

వాటిని పులిచారలులా బావిస్తాను:

ప్రసవ వాతలను ఒక్కోక్కరు ఒక్కోవిధంగా బావిస్తారు. ఒక తండ్రి మాట్లాడుతూ, మాకు పుట్టిన పాప వల్ల ఆ వాతలు వచ్చాయి. ఆ వాతలను నేను పులి చారలుగా బావిస్తాను. దీంతో ఆమె మీద నాకు మరింత ప్రేమ కలుగుతోంది.

ఆమె మునుపటిలాగానే అందంగా ఉంది:

సాధారణంగా, ఒక వ్యక్తి పూర్తిగా మనల్ని అర్థం చేసుకున్నాక వారి అందాన్ని మనం పరిగణలోకి తీసుకోము. మాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన పొట్ట భాగంలో ఎక్కువగా ప్రగ్నెన్సీ మార్క్స్ వచ్చాయి. వీటిని చూసి తను రోజూ బాధపడేది అయితే నేను నా భార్యకు ఒక్కటే చెప్పేవాడిని, నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు, నిజం చెప్పాలంటే నువ్వు ముందులాగానే అందంగా ఉన్నావు అని చెప్పానని ఒక భర్త తెలిపారు.

ఇప్పుడు ఇంకా అందంగా ఉంది:

నా భార్య ప్రగ్నెన్సీ తర్వాత ఎక్కువ బరువు పెరగడంతో పాటూ పొట్ట దగ్గర మార్క్స్ కూడా వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు నా కళ్ళకు మరింత అందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఇన్ని రోజులూ నా పాపను మోసింది మరియూ నన్ను ఇప్పటికీ బాగా చూసుకుంటోంది అని ఒక బాధ్యత గల భర్త తెలిపారు.

నాకు ఆమెలో నచ్చేదే అది:

మాకు పుట్టిన ముగ్గురు అందమైన పిల్లల వల్లే నా భార్యకు పొట్ట దగ్గర మార్క్స్ వచ్చాయి. ఇంత మంచి పిల్లలను నాకు ఇచ్చినందుకు ఆమె నేను ఋణపడి ఉండటమే కాక ఇప్పుడు ఆమెకు ఉన్న మార్క్సే నన్ను ఎక్కువ ఆకర్షిస్తున్నాయి అని ఒక భర్త చెప్పారు.

నేను ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించాను:

నా భార్యకు ప్రసవం తర్వాత పొట్ట భాగంలో మార్క్స్ వచ్చిన మాట వాస్తవమే. వాటిని పోగొట్టుకోవడానికి ఆమె కసరత్తులు కూడా చేస్తోంది. అయితే నేను ఆమె శరీరాన్ని ప్రేమించలేదు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. కాబట్టి ఆమె ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు అని మరో భర్త తెలిపారు.

దీనిని బట్టి మనకు తెలిసిందేంటంటే, మగవారిలో చాలా మంది తమ భార్యకు వచ్చే ప్రగ్నెన్సీ మార్క్స్ గురించి పట్టించుకోరు. కాబట్టి మీరు కూడా వాటి గురించి ఆలోచించి మథనపడకండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon