Link copied!
Sign in / Sign up
6
Shares

గర్భంతో ఉన్న మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు : మీ బిడ్డ ఆరోగ్యం కోసం

మహిళకు ఈ ప్రపంచంలో అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని, ఆనందభాష్పాలను ఇచ్చే విషయం ఏదైనా ఉందంటే అది గర్భం దాల్చడం, తల్లి కావడం అనే చెప్పాలి. పరిపూర్ణ మహిళ అని ఒక బిడ్డకు జన్మను ఇచ్చి, ఆ బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవడమని చెబుతారు. ప్రెగ్నన్సీ గురించి ఇప్పటివరకు మీరు చాలా విషయాలే విని ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన ఆహారం, ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయకూడని పనులు, మహిళలు ప్రెగ్నన్సీ సమయంలో చేసే కొన్ని పనులు కడుపులోని బిడ్డపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరంగా తెలుసుకుందాం…

1. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

2. ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం

3. గర్భం పోవడానికి కారణాలు, పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

4. మీకు పుట్టబోయే పిల్లలు అందంగా, తెల్లగా పుట్టాలంటే ఏం చేయాలి?

5. గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా?

ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలను పూర్తి వివరంగా ఇక్కడ చెప్పబోతున్నాం. మీతో పాటు ఇంకా ఎంతోమందికి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా SHARE బటన్ పై క్లిక్ చేసి అందరికీ SHARE చేయగలరు.

గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

ప్రేగ్నన్ట్ అని శుభవార్త విన్న తర్వాత ప్రతి మహిళకు ఎంత సంతోషంగా ఉంటుందో నిజంగా మాటల్లో చెప్పలేరు. గర్భం దాల్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలా చేయడం కరెక్టేనా? ఇలా చేయడం కడుపులోని బిడ్డకు మంచిదా, కాదా! ఇలా ఎన్నో విషయాలు వారి మెదడులో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఈ జాగ్రత్తల గురించి వివరంగా అందిస్తున్నాం.

రక్తం తక్కువగా ఉంటే

గర్భం దాల్చడం అనేది ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గర్భం దాల్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం రక్తహీనత. మీ శరీరంలో రక్తస్థాయి ఎంత మోతాదులో ఉందో తెలిపే ఈ పరీక్షలు ఊరికి వచ్చే వైద్యులు లేదా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చేస్తారు. మీరు తీసుకునే ఆహారమే మీ రక్తహీనతను పెంచుతుంది. అటువంటి ఆహారాన్ని మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఎక్కువగా గుడ్లు, పాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన రక్తహీనత సమస్య ఉండదు.

బిడ్డ ఎదుగుదల

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన విషయం తరచూ డాక్టర్ ను కలిసి చెకప్ చేయించుకోవడం. బిడ్డ ఎదుగుదల ఎలా ఉందని ఖచ్చితంగా అడగాలి. మీరు తీసుకునే ఆహారం, మీరు చేసే పనులు బిడ్డ ఎదుగుదలపై ఆధారపడి ఉంటుంది. బిడ్డ ఎదుగుదల గురించి సరైన ఆలోచన, చెకప్ చేయించుకోకపోవడం వలన కడుపులోని బిడ్డకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. బిడ్డ ఎదుగుదల సరిగ్గా జరగకపోతే గర్భంలోనే మరణించిన శిశువుల సంఖ్య ఎక్కువగానే ఉంది కూడా.

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు :

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి ఏమీ ఆలోచించకుండా ఎక్కువ సార్లు అయినా తక్కువ మోతాదులో అదనపు ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలే మీ బిడ్డను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మరి గర్భంతో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

▪️ కాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్, మొలకెత్తిన విత్తనాలు, ముడి ధాన్యాలు

▪️ పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు

▪️ గుడ్లు, మాంసం, పాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్

గర్భంతో ఉన్నప్పుడు చేయకూడని పనులు

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని పనులు చేయకూడదు, ఇలా చేయడం వలన మీకు మీ కడుపులోని బిడ్డకు ప్రమాదమనే చెప్పాలి. గర్భంతో ఉన్నప్పుడు చేయకూడని ఆ పనులేంటో మీరే చూడండి.

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు చేయకూడని పనులు 

▪️ గర్భం దాల్చిన తర్వాత, బిడ్డకు జన్మను ఇచ్చిన కొన్ని నెలల వరకు బ్లడ్ డొనేట్ చేయకూడదు.

▪️ పొగాకు, మద్యపానాలకు దూరంగా ఉండాలి.

▪️ కాఫీ, టీ లు ఎక్కువగా తీసుకునేవారు వాటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత కాఫీ, టీ లు తీసుకోకపోవడం మరీ మంచిది. వీటి వలన శరీరానికి ఐరన్ అందదు.

▪️ ఒకే చోట ఉండకూడదు. ఎప్పుడు పడుకోవడం చేయకూడదు. కొద్ది దూరం నడవడం, ఉదయం సూర్య కిరణాల వెలుతురులో లేదా నడవటం చేయాలి. అలాగే వ్యాయామాలు కూడా చేయడం ఉత్తమం.

అలాగే మీకు పుట్టబోయే పిల్లలు తెల్లగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ ఉన్న ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు..

ఇక్కడ క్లిక్ చేయగలరు : Clik here ⇒ పిల్లలు తెల్లగా పుట్టాలంటే, ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహారాలు:

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మీరు వేసే ప్రతి అడుగు మరియు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు పుట్టబోయే బిడ్డపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. గర్భం దాల్చడం మాతృత్వానికి తొలిమెట్టు అని అంటారు. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ఎటువంటి ఆహారం తీసుకోవడం మంచిదో చెబుతూ ఉంటారు గానీ ఎటువంటి ఆహారం తీసుకోకూడదో చాలా తక్కువ మంది మాత్రమే చెబుతుంటారు. గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహారాలలో చాలామందికి తెలిసిన విషయం బొప్పాయి పండు తీసుకోకూడదని. అయితే ఇక్కడ వివరంగా గర్భంతో ఉన్న మహిళలు ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిదో ఇక్కడ తెలుసుకోండి.

▪️ పచ్చి పాలు

▪️ క్యాన్డ్ ఫుడ్స్

▪️ కెఫిన్

▪️ సరిగ్గా ఉడకని మాంసాహారం

వీటి గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే మన టైనీ స్టెప్ వెబ్ సైట్ లోని ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు.

ఇక్కడ క్లిక్ చేయగలరు : Clik here ⇒ ఈ నాలుగు ఆహారాలు మీ గర్భంలో బిడ్డకు ప్రమాదం : ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు తినకండి

గర్భం పోవడానికి కారణాలు :

అమ్మ అనే పదం చాలా గొప్పది. ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఎప్పుడు బిడ్డ బయటకు వస్తాడా, ఎప్పుడు నన్ను అమ్మా అని పిలుస్తాడా అని ఎంతో ఆతృతగా ప్రతి ఒక్క మహిళ ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల అజాగ్రత్తగా ఉండటం వలనో లేక ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలియక చాలామంది గర్భాన్ని పోగొట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. గర్భం పోవడాన్నే మిస్ క్యారేజ్ అని అంటారు. మరి గర్భం పోవడానికి కారణాలు ఏంటి? గర్భం పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఇక్కడ అందిస్తున్నాం…

▪️ అధిక బరువు

▪️ జన్యుపరమైన లోపం

▪️ ధూమపానం, మధ్యపానం అలవాటు ఉన్నవారిలో

▪️ మధుమేహం, రక్తహీనత

▪️ ఆందోళన చెందటం, భయపడుతూ ఉండటం

▪️ ఎక్కువగా వయస్సు పై బడినప్పుడు గర్భం పోవడం

▪️ గర్భాశయ ముఖ ద్వారం బలహీనంగా ఉండటం

▪️ పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం

ఇవన్నీ గర్భం పోవడానికి కారణాలు అయితే, గర్భం పోతుందని తెలిపే లక్షణాల గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోగలరు..

ఇక్కడ క్లిక్ చేయగలరు : Clik here ⇒ గర్భం పోవడానికి కారణాలు, పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రెగ్నన్సీ గురించి ఈ సమాచారం మీకు నచ్చి ఉంటే ప్రతి ఒక్కరికీ దయచేసి SHARE చేయండి. అలాగే ఈ విషయాలపై మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఇంకా ఏదైనా విషయాల గురించి తెలుసుకోవాలన్నా సరే మాకు COMMENT చేయండి.

Tags : pregnancy tips in telugu, pregnancy health tips in telugu, pregnancy ravadaniki tips, pregnancy in telugu, pregnancy food tips in telugu, normal delivery tips in telugu, how to get pregnant in telugu, pregnancy symptoms in telugu, pregnancy test in telugu, pregnancy week by week in telugu, how to confirm pregnancy in telugu

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon