Link copied!
Sign in / Sign up
13
Shares

ప్రెగ్నెన్సీ గురించి అవమానంగా ఫీల్ అవ్వకూడని 6 సంధర్భాలు


ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని మార్పులు మన శరీరాన్ని, అలవాట్లని పూర్తిగా మార్చేస్తాయి. కానీ ఈ మార్పులు వలన మీరు అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి అందరికి సహజం ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు గిల్టీ ఫీల్ అవ్వకూడని కొన్ని సంధర్భాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,

బేబిని క్యారీ చేయడం

బేబిని క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీ శరీరం లోపల చాలా మార్పులు వస్తాయి మరియు ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. మీ పరిస్థితిని మీ భర్త అర్థం చేసుకోకపోతే గట్టిగా చెప్పినా తప్పు లేదు. మీరు స్ట్రేంజ్‌గా బిహేవ్ చేశారని ఇతరులు అనుకున్నా మీరు గిల్టీ ఫీల్ అవ్వకండి. అందుకంటే, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు మాత్రమే తెలుసు.

మీరు తక్కువ అవకండి

బిడ్డ తయారవడం వెనుక చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. మీరు చాలా శ్రమ పడాల్సి రావచ్చు. మీకు పొట్ట పెరుగుతూ ఉండటం వల్ల ఏవైనా ఫంక్షన్స్‌కు వెళ్ళలేకపోవచ్చు. వాటిని మీరు స్పోర్టీవ్‌గా తీసుకోండి. మీరు గత కొద్ది కాలంగా సరిగ్గా నిద్రపోయి ఉండరు. ఈ సమయాన్ని నిద్రకు కేటాయించడం ద్వారా మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

మీ పొట్ట ఆకారం

ప్రతి బేబీ ఎంత ప్రత్యేకమో ప్రతి పొట్ట అంతే ప్రత్యేకం. మీరు ఇంటర్‌నెట్‌లో చూసే విధంగా పొట్ట సరైన ఆకారంలో లేకపోవచ్చు. అయినప్పటికీ మీరు ఏలాంటి ఫీలింగ్ పెట్టుకోకండి. మీ బిడ్డ కోసం రూమ్ తయారు చేయడంలో నిమగ్నమవండి. ఇంటిని అలంకరించడానికి సమయం కేటాయించడం వల్ల మీకు ఇలాంటి ఆలోచనలు దరికి రావు.

ఎక్కువ సమాచారం

మీరు ఎవరితోనైనా మాట్లాడటం మొదలు పెడితే, వారు మీకు ప్రెగ్నెన్సీ గురించి అలవిగాని సమాచారం ఇవ్వవచ్చు. దీని వల్ల మీకు కొంచెం భయం కూడా కలగవచ్చు కాబట్టి అలాంటి విషయాలను పట్టించుకోకండి. మిమ్మల్ని ఇరిటేట్ చేసే విధంగా ఉంటే వారితో సహవాసం మానివేయండి.

వ్యాయామం లేదా తినడం

ఈ సమయంలో చాలా మంది వ్యాయామం చేయలా బాగా తినాల అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ వైద్యుడూ చెప్తే వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీకు అనుకూలంగా చేయండి లేకపోతే రెస్ట్ తీసుకోండి. అయితే నడవడం అలవాటు చేసుకోవడం ద్వారా ప్రసవం సులభం అయ్యే అవకాశం ఉంది.

ప్రెగ్నెన్సీ మీద ఇష్టం

తల్లికి బిడ్డ చాలా ప్రేమ ఉంటూంది కానీ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే చాలా మంది మహిళలు ఇష్టపడరు. రోజూ బరువు క్యారీ చేయడం, శరీరంలో మార్పులు రావడం, మూడ్ మారిపోతూ ఉండటం, ఎప్పుడూ సిక్‌గా ఉండటం వంటీవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోవాలి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon