Link copied!
Sign in / Sign up
10
Shares

ప్రెగ్నెన్సీ గురించి 10 అపోహలు-నిజాలు

ప్రెగెన్సీ అనేది చాలా ముఖ్యమైన దశ. ప్రగ్నెన్సీ సమయంలో ఒక్కోకరు ఒక్కో విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు. అయితే వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

టేస్ట్

పేగ్నెన్సీ సమయంలో మీరు తినే ఆహారం పైనే మీ పిల్లల టేస్ట్‌లు ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పధార్థాలను అయితే ఎక్కువగా తింటారో పిల్లలు పుట్టిన తర్వాత వాటినే ఇష్టపడతారు. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి.

జుట్టు

ప్రెగ్నెన్సీ సమయంలో మీ జుట్టు ఎక్కువగా రాలిపోతోందని మీరు బాధపడుతున్నారా!! మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీరు మీ పాపకు ఒత్తైన జుట్టును ఇవ్వబోతున్నారు. కాబట్టి జుట్టు రాలినా మీ బేబీ కోసమే అని సంతోషించండి.

వేడి నీళ్ళతో స్నానం

గర్భవతులు వేడి నీళ్ళతో స్నానం చేయకూడదని చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే, మీ బాడీలో ఉష్ణోగ్రత 102 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే పిండానికి ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంది.

ఒత్తిడి

ఎక్కువ ఒత్తిడిలో ఉంటే గర్భానికి ఆపద అని అంటారు. అది నిజం. మీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు గర్భాన్ని సరిగ్గా క్యారీ చేయలేరు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

చాక్లెట్స్

సాధారణంగానే చాక్‌లెట్స్ ఎక్కువగా తింటే ఒత్తిడి ఉండదు. ప్రగ్నెన్సీ సమయంలో చాక్‌లెట్స్ తినడం వల్ల ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. అంతేకాక, ప్రీఎక్లంప్సియా అనే రోగం దరి చేరకుండా చూడవచ్చు.

వ్యాయామం

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయకూడని చాలా మంది అంటారు. అయితే, బేబికి మంచి జరిగే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. వాటిని వైద్యుల సలహా ద్వారా చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల బేబీ గుండెకు కూడా మంచిది.

చావులకు దూరంగా ఉండటం

చావులకు దూరంగా ఉండాలని చాలా మంది అంటుంటారు. దానికి గల తర్క కారణం ఏమిటంటే, మీరు చావును చూస్తే ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు, మీ ఆలోచనలు మారుతాయి. దీంతో ఆ ప్రభావం మీ బిడ్డపై ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది.

మతిమరుపు

ప్రెగ్నెన్సీ సమయంలో మీరు చాలా విషయాలు మరిచిపోతారు. దానికి గల కారణం ఏమిటంటే, మీ శరీరంలో విడుదల హార్మోన్స్. దీని వల్ల చాలా విషయాలను మర్చిపోతారు. అయితే ఇది చాలా రోజులు మాత్రమే ఉంటుంది.

వాతావరణం

‘ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ఒకేవిధమైన వాతావరణంలో ఉండాలి’. అవును ఇది కొంతవరకు నిజం. ఎందుకంటే, మీరు ఏవైనా శబ్ధాలు వినడం లేదా ఏవైనా చూడటం జరిగితే ఆ ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. కాబట్టి ఒకే చోట ప్రశాంతంగా ఉండటం మంచిది.

కాఫీ తాగకండి

ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ తాగకండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజం. మీరు కేవలం 200 మిల్లీగ్రాముల కాఫీని మాత్రమే తాగాలి. అంతకంటే ఎక్కువ తాగితే బిడ్డ యొక్క బెటబాలిసం దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి కాఫీకి బాయ్ చెప్పడం మంచిది.

ఇవి కూడా చదవండి 

ప్రెగ్నన్సీతో ఉన్న మొదటి మూడు నెలలు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon