Link copied!
Sign in / Sign up
11
Shares

తెలివైన పిల్లలు పుట్టాలంటే ప్రెగ్నన్సీ సమయంలో తినాల్సిన 5 ఆహారాలు


ప్రతి మహిళ తాను ప్రేగ్నన్ట్ అవ్వాలని కోరుకుంటుంది. అది మాత్రమే తాను పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో,తెలివితో పుట్టాలని కోరుకుంటుంది. ఈ కోరిక తీరాలంటే ప్రెగ్నన్సీ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీసుకునే ఆహరం విషయంలో, ప్రెగ్నన్సీ సమయంలో మీరు  తీసుకునే ఆహారంలోని పోషక విలువలు కడుపులో ఎదుగుతున్న పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. పుట్టబోయే పిల్లలు పూర్తి ఆరోగ్యంతో, తెలివితో పుట్టాలంటే మీరు ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే…

1. చేపలు

పిల్లల మెదడు లోని నాడి వ్యవస్థ అభివృద్ధి చెందడానికి వారికి DHA అవసరం. ఇది పిల్లలలోని రోగ నిరోధక శక్తిని , కంటి చూపు అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అయితే ప్రెగ్నన్సీ సమయంలో చేపలు తీసుకోవడం వలన ఈ DHA మీ కడుపులోని బిడ్డకు అందుతుంది. కనీసం వారానికి రెండు సార్లు చేపలను తినచ్చు.

2. గుమ్మడి విత్తనాలు

కడుపులోని శిశువు మెదడు యొక్క నిర్మాణం పూర్తిగా అభివృద్ధి చెందడానికి జింక్ అవసరం. అంతేకాకుండ మెదడులో సమాచారాన్ని అందుకునే కణాలను జింక్ ప్రేరేపితం చేస్తుంది. గుమ్మడి విత్తనాల పొట్టులో అధిక శాతం జింక్ ఉంటుంది. అందుకే పొట్టు తీయకుండా విత్తనాలను తినండి. రోజుకు కనీసం 7 మీగ్రా విత్తనాలను తినడానికి ప్రయత్నించండి.

3. పాల కూర

పాల కూరలో అధికంగా ఐరన్ ఉంటుంది, దానితో పాటు ఫోలేట్ కూడా ఉంటుంది. కడుపులోని శిశువు యొక్క కొత్త DNA నిర్మాణానికి, మెదడు కణాలు దెబ్బ తినకుండా కాపాడడానికి ఫోలేట్ అత్యంత అవసరం. ప్రెగ్నన్సీ సమయంలో మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా పాల కూరను చేర్చుకోండి. అయితే పాల కూరను ఎక్కువ ఉడకపెట్టకండి, అందులోని పోషక విలువలు పోతాయి.

4. గుడ్లు

గుడ్లలో అధిక శాతం ప్రోటీన్, ఐరన్ తో పాటు కొలిన్ అనే పదార్ధం ఉంటుంది. ఈ చోళీనే మెదడులోని జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా సహాయపడుతుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో రోజు గుడ్డు తినడం వలన కడుపులోని శిశువు మెదడు ఎదగడానికి కావాల్సిన చోళీనే అందుతుంది.

5. పప్పు దినుసులు

కడుపులోని శిశువు యొక్క మెదడు పూర్తి స్థాయిలో ఎదగడానికి కావాల్సిన ఇంకో ముఖ్యమైన పోషకం ఐరన్. మెదడు పూర్తిగా నిర్మాణం చెందడానికి,  మెదడులో కణాలు వేగంగా సమాచారాన్ని అందుకోవడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపం పుట్టబోయే పిల్లలలో బుద్ధి మాంధ్యతను కలిగిస్తుంది. అందుకే ప్రెగ్నన్సీ సమయంలో తక్కువ మోతాదులో ఆహరం తీసుకొని ఎక్కువ ఐరన్ పొందాలంటే పప్పు ధాన్యాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon