ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మలబద్దకాన్ని నివారించడానికి 5 అద్భుతమైన ఆహారాలు
మలబద్దకం ప్రెగ్నన్సీతో ఉన్నపుడు సహజం. ప్రెగ్నన్సీ సమయంలో శరీరంలో ప్రొజెస్టెరోన్ హార్మోన్ (progesterone hormone) ఉత్పత్తి పెరుగుతుంది. దీని వలన కండరాలతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా నిధానిస్తుంది, మలబద్దకానికి దారి తీస్తుంది. దీనితో పాటు మీరు తీసుకునే ఆహారంకూడా మలబద్దకానికి కారణం కావచ్చు. ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా 25-30 గ్రాముల ఫైబర్ ఉండాలి. కొన్ని ఆహారాలను రోజు తీసుకోవాలి. అలా మలబద్దకాన్ని నివారించడానికి తప్పకుండా తినాల్సిన 5 ఆహారాలు ఇవే….
1.పెరుగు

పెరుగులో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా జీర్ణాశయంలో సరైన అరుగుదల జరగడానికి తోడ్పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అందుకే ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు, మీరు తినే ఆహారంలో పెరుగును చేర్చుకోండి. అయితే పల్చగా చేసి తీసుకోండి.
2. పప్పు దినుసులు

కందిపప్పు, పెసరపప్పు, బీన్స్, అలసందలు, మొలక విత్తనాలు, వీటన్నిటిలో అధికంగా ఫైబర్ ఉంటుంది. అందుకె తప్పకుండా వీటిని తినాలి. మీ రోజు వారి ఆహారంలో పప్పుకూరలు భాగం చేసుకోండి. మీ అరుగుదల శక్తి పెరుగుతుంది.
3. ఆపిల్స్

రోజుకు ఒక్క ఆపిల్ మిమ్మల్ని డాక్టర్ నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే మలబద్దకం నుంచి కూడా. ఒక చిన్న ఆపిల్ లో 4. 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందుకే ఆపిల్ తినడం ఆరోగ్యంతో పాటు అరుగుదలకు కూడా మంచిది.
4. డ్రై ఫ్రూట్స్

బాదాం, పిస్తా, జీడీ పప్పు, వేరుశనగ పప్పు, వాల్నట్, వీటిలో పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే క్యాలోరిస్ మిమ్మల్ని శక్తివంతంగా కూడా చేస్తాయి. అయితే రోజుకు గుప్పెడు మాత్రమే తినండి.
5. ద్రాక్ష

రుచికరమైన ద్రాక్ష అంటే అందరికి ఇష్టమే. ద్రాక్షను మీరు ఇష్టంగా తింటున్నటైతే, మంచిది, ఆలా తినడం కొనసాగించండి. ఒకవేళ తినకపోతే వెంటనే తినడం మొదలుపెట్టండి. ద్రాక్ష లో అధికంగా ఫైబర్స్ ఉంటాయి. వీటిని తినడం మలబద్దకాన్ని నివారిస్తుంది.
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి http://bit.ly/naturalfc
