Link copied!
Sign in / Sign up
20
Shares

ప్రతి అమ్మ చేసే ఈ 5 అద్భుతమైన పనులు....ఇంకెవరు చేయలేరు

అమ్మ తన పిల్లలకు ఏమి చేసినా ఉత్తమంగా ఉండేలా చూసుకుంటుంది. నిజమే కదా? తల్లి అయినా ప్రతి ఒక్కరికి గొప్ప నైపుణ్యం, నేర్పు ఉంటుంది.  కానీ, అందరు దానిని గుర్తించరు. మనామా మన అమ్మ చేసే పనులులకు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పామా.  ఈరోజు చెప్దాము. ఒక్కసారి వారి గొప్పతనం గుర్తు చేసుకుందాము.

1. అమ్మ ఉన్న ప్రతి ఇల్లు తాజ్ మహల్ కంటే అందంగా ఉంటుంది

నేల మీద టీ పడిందా? బెడ్ మీద టిఫిన్? బాధపడకండి, మీరు ఎలా క్లీన్ చేయాలో ఆలోచించే లోపే అమ్మ శుభ్రం చేసేస్తుంది. అమ్మ ఇంట్లో ఒక్క రోజు లేకపోయినా ఆ ఇల్లు ఎంత ఛండాలంగా ఉంటుందో మీకు తెలుసు కదా. కిచెన్ సింక్ లో నీళ్లు పొంగి పోతుంటాయి, బాత్ రూమ్ వాసన వస్తుంటుంది, డస్ట్ బిన్ నిండి పోయుంటుంది. అదే అమ్మ ఉంటె అన్ని నీట్గా పద్దతిగా ఉంటాయి, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. అది అమ్మ గొప్పదనం. అందుకే, అమ్మ ఉంటె ప్రతి ఇల్లు తాజ్ మహల్ కంటే శుభ్రంగా అందంగా ఉంటుంది.

2. ఓపికలో భూదేవి తో సమానం

అమ్మకి ఒకే మాట వంద సార్లు చెప్పినా కోపం రాదు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏదయినా బొమ్మ కావాలన్నా, వస్తువు కావాలన్నా కొనిచే వరకు అడుగుతూనే ఉంటాం. ప్రతి సారి సర్ది చెప్తూందే తప్ప ఎప్పుడూ విసుక్కోదు. మీరు తనకి ఏమైనా చెప్పండి, ఓపిగ్గా వింటుంది, తనకి తెలిసిన సలహా ఇస్తుంది. మీరు పెద్ద వారు అయి ఇంటికి దూరంగా ఉన్నా అమ్మ అని ఒక ఫోన్ చేస్తే చాలు తాను మీ దగ్గరకి వచ్చేస్తుంది. అమ్మ దగ్గర కంటే బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఇంకెక్కడా దొరకదు.

3. ఏదయినా కనపడట్లేదా? అమ్మని అడగండి

అమ్మా… నా బెల్ట్ కనపడట్లేదు, నెల రోజుల నుంచి వెతుకుతున్నా మీ సల్వార్ ఒకటి కనపడలేదా? అమ్మని అడగండి, 5 నిమిషాలలో మీ చేతుల్లో ఉంటుంది. కీస్, చెవి రింగులు ఇలా ఏమి కనపడకపోయినా అమ్మకు చెప్తే వెంటనే దొరికిపోతాయి. కాబట్టి, ఇంకోసారి ఏమైనా కనపడకపోతే కంగారు పడకండి, అమ్మని అడగండి చాలు.

4. మీరు నిద్రపోయాక పడుకుంటుంది, మీకన్నా ముందే లేస్తుంది

అమ్మ ఎంత లేట్ గా అయినా నిద్రపోని, మీ కన్నా ముందే లేచి టిఫిన్ కి కావాల్సినవి అన్ని తయారు చేసుంటుంది. ఒక వేళా మీరు లంచ్ తీసుకుని వెళ్లేలా ఉంటె అది కూడా సిద్ధంగా ఉంటుంది. అసలు అమ్మకు నిద్ర ఎలా సరిపోతుందో కదా. కానీ, తన అసౌకర్యాన్ని ఎప్పుడు మనకు తెలీనివ్వదు, మనకు అసౌకర్యం కలగనివ్వదు. అమ్మంటే అంతే మరి.

5. మైండ్ రీడర్స్

మీకు ఆకలి వేస్తోందా? ఆ విషయం మీకు తెలిసేలోపే మీ ముందు మీకు ఇష్టమైన ఆహారం తయారుగా ఉంటుంది.  అన్ని విషయాలు అమ్మకి చెప్పాల్సిన అవసరం లేదు, తనకి తెలిసిపోతాయంతే. బహుశా పిల్లల మైండ్ ని రీడ్ చేయడం అమ్మకి తెలుసేమో. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తనకి తెలుసు, పిల్లలకి ఆకలి ఎప్పుడేస్తుందో తనకి తెలుసు, పిల్లలు ఎప్పుడు పడుకుంటారు వారికి ఏమి కావలి అలా ప్రతి ఒక్కటి తనకి తెలుసు. అందుకే అంటారు మాతృదేవో భవ అని.

అడగకుండానే అమ్మ మనకు ఇన్ని చేస్తుంది. కానీ మన నుంచి ఏమి ఆశించదు. మనం చేయాల్సిందల్లా తనని సంతోషపెట్టడమే. ప్రతి రోజు కృతజ్ఞతలు తెలుపుకోవడమే.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon