Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రతి తల్లి తప్పక చదవాల్సిన ఓపెన్ లెటర్.. అమ్మకు మాత్రమే అర్ధమయ్యే 5 నిజాలు

ప్రియమైన ఇంట్లో ఉండే తల్లి...

రోజూ ఇంట్లోనే ఉండి నువ్వు ఏం చేస్తావని కొంతమంది అడుగుతుండవచ్చుగాక. కాని నాకు తెలుసు.. నువ్వు ఏం చేస్తావో.. ఎందుకంటే నేను కూడా అమ్మనే. నేను కూడా పిల్లలను కన్నాను.

నాకు తెలుసు.. నువ్వు జీతం లేని పని చేస్తున్నావని. ఒక్కోసారి నువ్వు చేసే పనులకు కృతజ్ఞ‌తలు కూడా ఉండవు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఆ పనులు పూర్తి కావు. నీకు వీక్ఎండ్స్, రాత్రి అంటూ తేడా లేకుండా ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుంది. చివరకు లీవ్ కూడా ఉండదు నీకు.

మన జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఆఫీసులో పని చేస్తాను. నువ్వు ఇంట్లో పని చేస్తావు. నాపనిలో మీటింగ్స్, ఈమెయిల్స్, స్ప్రెడ్ షీట్స్, పవర్ పాయింట్ లాంటివి ఉంటాయి. నీ పనిలో డైపర్స్, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, పిల్లలు గొడవ పడితే వాళ్లకు సర్ది చెప్పడం లాంటివి ఉంటాయి. నేను ఎక్కువ సేపు నా పిల్లలతో గడపాలని అనుకుంటాను. కాని, కుదరట్లేదు. కాని.. నువ్వు నాలా కాదు. ప్రతి రోజు పిల్లలతో సరదాగా గడుపుతావు. ఒక్కోసారి ఒంటరిగా బాధ పడతావు. కాని.. అది నామమాత్రమే.

నీ పని ఎప్పటికీ పూర్తికాని సైకిల్. రోజులో ఓ గంట ప్రశాంతంగా భోజనం చేయడానికి దొరుకుతుందేమోనని, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టైమ్ దొరుకుతుందేమోనని ఆశపడతావు కాని.. నువ్వు ప్రశాంతంగా ఓ గంట గడపడానికి కూడా నీకు సమయం దొరకదు. ఒక్కోసారి సాయంత్రం నువ్వు కాసేపు బ్రేక్ తీసుకుందామనుకునేలోపే నీ భర్త ఆఫీసు నుంచి ఇంటికి వస్తాడు. అప్పుడు నీకు ఏడుపు ఒక్కటే తక్కువగా ఉంటుంది. నీ జాబ్ కు శాలరీ ఉండదు. హాలీడేలు ఉండవు. నీకు సమయం దొరకట్లేదని నీలో నువ్వే కుమిలిపోతుంటావు, నీకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా నీకు సిక్ డే అంటూ ఏదీ ఉండదు. నీ జాబ్ చేయాలంటే చాలా కష్టం.

ఇక.. సొసైటీలో మహిళల మీద వేసే అభాండాలు అన్నీ ఇన్నీ కావు. మనం ఇంట్లో ఉంటే పనీపాట లేకుండా ఇంట్లోనే ఉంటుందంటారు. జాబ్ కు వెళ్తే ఇంటి పనులు చూసుకోకుండా, పిల్లలను పట్టించుకోకుండా ఈ జాబ్ ఏంటి అని ప్రశ్నిస్తారు. కాని.. నువ్వు ఫ్యామిలీ కోసం సరైన నిర్ణయం తీసుకున్నావు.

కాని.. నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు కేవలం ఒక బేబీ సిట్టర్ మాత్రమే కాదు. నువ్వు రోజు మొత్తం కష్టపడి పెంచే నేటి పిల్లలే రేపటి భావితరాలకు దారి చూపేవారవుతారు. భవిష్యత్తులో ప్రపంచానికి దిశానిర్ధేశం చేసేది వీళ్లే. వాళ్ల నిజ జీవితం సంతోషంగా ఉండాలని నువ్వు రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడతావు. ఎటువంటి స్వార్థం లేకుండా రివార్డ్, ప్రమోషన్, శాలరీ, లీవ్స్ లాంటివేమీ లేకుండా నువ్వు చేసే ఈ పనికి నేను మెచ్చుకుంటున్నాను.

మనం చేసే పనులు, మన జీవితాలు వేరు కావచ్చు. కాని.. మనలో చాలా సారుప్యతలు ఉన్నాయి. మనమిద్దరం మన పిల్లలను ప్రేమిస్తాం, వాళ్లను మంచిగా పెంచి పోషిస్తాం. మాతృత్వం అనేది చాలా కష్టమైన పని.. మనం ఎలా చేసినా.. ఎంత కష్టపడ్డా.. అది ఎంతో కష్టమైనదే.

చివరగా నేను నీకు చెప్పేది ఒకటే. మనమిద్దరమూ తల్లులమే. నీ పిల్లల కోసం ప్రస్తుతం ఎలా కష్టపడుతున్నావో.. తర్వాత కూడా అలాగే కష్టపడు. మంచి పిల్లలను తయారు చేయి. సరేనా. ఇక ఉంటాను.

ప్రేమతో

జాబ్ చేసే ఓ తల్లి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon