Link copied!
Sign in / Sign up
124
Shares

దంపతులు రోజు సెక్స్ చేయడం వలన ప్రయోజనాలు ఉన్నాయా?


సెక్స్, దంపతుల మధ్య జరిగే ఈ ప్రక్రియ కేవలం కోరికను తీర్చడమే కాదు, వారి మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. అందుకే శృంగారం దాంపత్య జీవితానికి అత్యంత అవసరం. చాలా మంది భార్య భర్త పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టిన తరువాత సెక్స్ చేయడం మానేస్తారు, లేదా ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఇలా కాదు, సెక్స్ భార్య భర్తల మధ్య దురాలన్నీ చెరిపేసి, కేవలం దేహాలను మాత్రమే కాదు, మనసులను కూడా దగ్గర చేయాలి. ఇలాంటి సెక్స్ మీ మధ్య తప్పకుండా జరగాలి, అందుకు కారణాలు ఇవే…

1. ఒత్తిడి తగిస్తుంది

మీరు మీ రోజును మొత్తం చిరాకుతో, పని భారంతో గడిపి, రోజు ముగిసే లోపు బోల్డంత ఒత్తిడిని మూటకట్టుకుంటారు. ఈ ఒత్తిడి మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ ఒత్తిడిని మొత్తం దూరం చేయడానికి సరైన మందు శృంగారం. మీ ఇద్దరి మధ్య సెక్స్ జరిగినప్పుడు, మెదడులో డోపోమైన్, ఎండోర్ఫిన్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మీ ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని కలిగిస్తాయి.

2. ఆనందమయమైన వ్యాయామం

మిమ్మల్ని ఆరోగ్యాంగా, ఉంచడానికి, మీ శరీరానికి వ్యాయామం అవసరం. కానీ చాలామంది సమయం దొరకక వ్యాయామానికి దూరమవుతారు. వారానికి కేవలం మూడు సార్లు సెక్స్ చేస్తే, సంవత్సరానికి 7,500 క్యాలోరిస్ ఖర్చవుతాయి. మీ శరీరం ఆరోగ్యాంగా, నాజూకుగా తయారవుతుంది.

3. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

రోజు సెక్స్ లో పాల్గొనడం ద్వారా, మీకు రోగాలు రాకుండా కాపాడే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, రోజు సెక్స్ లో పోల్గనడం వలన, మీ శరీరంలో ఇమ్మ్యూనోగ్లోబిన్(Immunoglobin) అనే యాంటిజెన్, మీ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది మిమ్మల్ని అనేక రోగాలనుండి కాపాడుతుంది.

4. గుండె జబ్బు రాదూ

ప్రతి రోజు శృంగారంలో పాల్గొనే వారిలో, గుండ జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. సెక్స్ చేయడం వలన క్యాలోరిస్ ఖర్చవుతాయి, అలా జరగడం వలన గుండ చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

5. పీరియడ్స్ ను క్రమబద్ధం చేస్తాయి

మీ పీరియడ్స్ సరిగా జరగడానికి సెక్స్ చాలా అవసరం. సెక్స్ చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. శరీర వ్యవస్తలని సరిగా జరిగేలా చేస్తుంది. దీని వలన మీ పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి.

6. మంచి నిద్ర పొందచ్చు

వ్యాయామం లానే సెక్స్ లో పాల్గొన్నప్పుడు, గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. అందుకే సెక్స్ తర్వాత రిలాక్స్ అవడానికి, త్వరగా నిద్ర పోతారు. సెక్స్ తర్వాత నిద్ర చాలా గాఢంగా ఉంటుంది. సరైన నిద్ర మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

అందరికి SHARE చేయండి

ఇవి కూడా చదవండి

ప్రసవం తర్వాత సెక్స్ గురించి మీకు తెలియని 10 షాకింగ్ నిజాలు

ప్రసవం తరువాత తమ శృంగార అనుభవాలని మాతో పంచుకున్న 7 మంది మహిళలు

ప్రతి భారతీయ దంపతులు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 కామసూత్ర పాఠాలు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon