Link copied!
Sign in / Sign up
8
Shares

ప్రతి నెల మీరు మీ పిల్లలు తప్పకుండా తినాల్సిన 5 రకాల పండ్లు : వారి ఆరోగ్యానికి చాలా మంచివి

 

 పండ్లు అంటే అందరికీ ఇష్టమే. అవి ఆరోగ్యాన్నిస్తాయి. కొన్ని పళ్లు ఆయా కాలాల్లో దొరుకుతాయి. వేసవిలో మామిడిపళ్లు, తియ్యగా ఉండే కివి, చల్లగా ఉండే పుచ్చకాయ, పోషక విలువలున్న బొప్పాయి, ఉప్పగా ఉండే పైనాపిల్ దొరుకుతాయి. అలా దొరికే పళ్లతో రకరకాల ఐటెమ్స్ చేయవచ్చు.

1. మ్యాంగో పూరీ: 

దీన్ని తయారు చేయడానికి ఒక మామిడి పండు, పెరుగు, ఒక గిన్నె కావాలి. మామిడిపండును రెండు సగాలుగా చేసి, ఒక సగాన్ని చిన్న ముక్కలుగా కోసి గిన్నె లోను, మిగతా సగం సర్వింగ్ బౌల్ లో ఉంచుకోవాలి. ఒక సగాన్ని గుజ్జుగా చేయాలి. తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్ లో ఉన్న ముక్కల మీద పోయాలి. దాన్లో పెరుగు కలిపి సర్వ్ చేయాలి.

2. పుచ్చకాయతో క్రీమ్: 

తయారు చేయడానికి సగం కోసిన పుచ్చకాయ, పల్ప్ బ్లూ బెర్రీస్, డార్క్ చాక్లెట్ చిప్స్, ఫ్రెష్ వైపింగ్ క్రీమ్ కావాలి. పుచ్చకాయను గుండ్రటి చిన్న ముక్కలుగా తరగాలి. ఆ ముక్కలమీద కొంత వైపింగ్ క్రీమ్ ను ఉంచాలి. తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి ఉంచాలి. వాటిమీద బ్లూబెర్రీస్, చాకొలెట్ చిప్స్ ను  అందంగా అమర్చాలి.

3. కివీ డ్రింక్ : 

దీన్ని తయారు చేయడానికి ఒక కివి, ఒక అరటిపండు, కొన్ని బ్లూ బెర్రీస్, కొద్దిగా చక్కెర, రెండు స్పూన్ల పెరుగు కావాలి. వాటిని చిన్న ముక్కలుగా కోసి, ఒక గిన్నెలో ఉంచాలి. దానికి పెరుగు, కొంచెం చక్కెర కలపాలి. దాన్ని గ్లాసులో ఉంచి పైన బెరీ పళ్ల ముక్కలు ఉంచాలి.

4. బొప్పాయి ఐస్ క్రీమ్:

 దీన్ని తయారు చేయడానికి సగం బొప్పాయి, జ్యూసీ ఆరెంజ్, పాలు, వనీలా ఐస్ క్రీమ్ కావాలి. బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసి, దానికి పాలు, తాజా ఆరెంజ్ రసం కలపాలి. దీనికి ఐస్ క్రీమ్ కలపాలి. చల్లగా ఉన్నప్పుడు దీన్ని తింటే భలే ఉంటుంది.

5. పైనాపిల్ పాప్స్ : 

ఇది తయారు చేయడానికి సగం పైనాపిల్, ఒకటిన్నర కప్పు పాలు, ఒక నిమ్మకాయ, పాప్ సికిల్ స్టిక్స్ కావాలి. పైనాపిల్ ను చిన్న ముక్కలుగా కోసి, రసం వచ్చేలా పిండాలి. దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పాప్ సికిల్ లో పోయాలి. ఇది గట్టి పడేందుకు ఫ్రిజ్ లో రాత్రంతా ఉంచాలి. ఎండాకాలం మధ్యాహ్నం పూట తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon