Link copied!
Sign in / Sign up
0
Shares

ప్రతి మహిళల తమ లోదుస్తుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవలసిన 8 విషయాలు


మీ మొత్తం లుక్ యొక్క అతి ముఖ్యమైన భాగం ఏమిటనుకుంటున్నారు. మీరు కట్టుకున్న చీర, మీకు నచ్చి పంజాబీ డ్రెస్ లేదా వేసుకున్న టీ షర్ట్ అనుకుంటున్నారా? వీటి అన్నిటికంటే ముఖ్యమైనవి లోదుస్తులు. అవునండి, లోదుస్తులు మీ లుక్ లోను మరియు ఆరోగ్యంలోను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అదెలాగో చుడండి.

1. కరెక్ట్ బ్రా సైజు

మీకో విషయం తెలుసా? దాదాపు 64 శాతం మహిళలు తప్పు బ్రా సైజు వేసుకుంటున్నారు. ఇదేమి అంత పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు. కానీ, అలా తప్పు బ్రా సైజు ధరించడం వలన స్థానాల మీద చారలు పడుతాయి మరియు అవి సాగిపోతాయి కూడా. ఇప్పుడు అర్థమైందా, కరెక్ట్ బ్రా సైజు ఉండడటం ఎంత అవసరమో. అంతేనా, కరెక్ట్ బ్రా వేసుకోకపోవడం వలన మన శరీర ఆకృతి కూడా వికృతంగా కనపడుతుంది. చిన్న బ్రా వేసుకుంటే రోజంతా ఇబ్బందిగా ఉండి ఏ పని చేసిన చిరాకు వస్తుంది.

2. Thongs మీద అమితమైన ప్రేమ

Thongs చాలా బాగుంటాయి, అందుకే మనం రాత్రి పూట కుదిరితే పగలు కూడా వేసుకోవడానికి ఇష్టపడతాము. అంతే కాకుండా టైట్ బట్టలు వేసుకుంటే మన పాంటీ లైన్ కనపడకుండా చేయడంలో కూడా thongs సహాయపడతాయి. కానీ, thongs ని ఎక్కువ సేపు వేసుకుంటే మరియు ఎక్కువ సార్లు వేసుకుంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి వలన రాపిడి జరిగి సున్నితమైన ప్రదేశాలలో ఇన్ఫెక్షన్స్ కలిగే ప్రమాదం ఉంది. అదే గర్భవతిగా ఉన్న సమయంలో ఇలా వేసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త.

3. బ్రా ని ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది

సాధారణంగా బ్రాని 6 నెలల కంటే ఎక్కువ వాడకపోవడం మంచిది. బ్రా అనేది మనకు ఎంతో ఇష్టమైనది. అది మంచి మరియు చేదు సమయాల్లో మనకు తోడుగా నిలిచిన నేస్తం. కానీ, దేనిని ఎక్కువ కాలం వెంట పెట్టుకోకూడదు.

4. లోదుస్తులను సంతోష పెట్టండి

లోదుస్తులను సంతోష పెట్టడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, వాటికి తరచుగా ఉతుకుతు ఉండండి. వాటిని మనం సంతోష పెడితే, అవి మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనల్ని సంతోషపెడతాయి.

5. వ్యాయామం చేసిన వెంటనే లోదుస్తులను మార్చండి

ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. జింకి వెళ్లి వచ్చిన తరువాత లేదా వ్యాయామం చేసిన తరువాత లోదుస్తులను వెంటనే మార్చేసి స్నానం చేసి ఉతికినవి వేసుకోండి. వ్యయం చేస్తున్న సమయంలో వచ్చిన చెమట మరియు ద్రవాల వలన అవే లోదుస్తులు వేసుకుంటే ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంది.

6. దేనితో తయారు చేసినవి వేసుకోవాలి

సిల్క్ మరియు ఇతర సింథటిక్ వాటితో తయారయిన లోదుస్తులు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనపడుతాయి. కానీ, కాటన్తో చేసినవి మత్త్రమే సౌకర్యంగా మరియు సురక్షితంగా ఉంటాయి. కాటన్ మీ చెర్మాన్ని గాలి అందేలా చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. మంచి లోదుస్తులు, చెడ్డ లోదుస్తులు

పొడిగా, శుభ్రంగా ఉండి మంచి సువాసన ఇచ్చేవి అంతా మంచివి. తడిగా ఉండి సాగిపోయినవి చెడ్డవి. మంచివి వేసుకోండి, హాయిగా ఉండండి.

8. అస్సలు వేసుకోకండి

అప్పుడప్పుడు వీటిని ధరించకండి. కానీ, ఇలా చేస్తున్నప్పుడు పల్చటి మరియు టైట్ బట్టలు వేసుకోకండి. నిజానికి రాత్రులు వాటికి కూడా కొంత విశ్రాంతి ఇస్తే మంచిది. ఎలాగో ఇస్తారు అనుకోండి, అది వేరే విషయం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon