Link copied!
Sign in / Sign up
3
Shares

ప్రతి మహిళ హ్యాండ్ బ్యాగ్ లో తప్పకుండా ఉండాల్సిన 6 వస్తువులు

ఈ మధ్య కాలంలో మహిళలందరూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఉంచుకోడానికే కాకుండా, తమ బట్టలు కు మ్యాచ్ అయ్యేలా ఫ్యాషన్ గా కూడా హ్యాండ్ బ్యాగ్ ను వాడుతున్నారు. కానీ మీరు హ్యాండ్ బ్యాగ్ ఏ వస్తువులను ఉంచుకుంటున్నారు. అవి మీకు ఎంత ఉపయోగపడుతున్నాయి? ప్రతి మహిళ హ్యాండ్ బ్యాగ్ లో తప్పకుండా ఉండాల్సిన వస్తువులేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. హ్యాండ్ శానిటైజెర్

క్రీములు ప్రతి చోట ఉంటాయని మనకు తెలిసిందే. ప్రతి రోజు మనం చేతులతో చేసే అనేక పనులు రోగకారకమైన క్రీములను మన చేతులకు అంటిస్తాయి.ఈ క్రీములు మన చేతుల ద్వారా మన శరీరంలోకి చేరుకుని రోగాలను కలిగిస్తాయి. అందుకే మన చేతులను శుభ్రపరుచుకోడానికి ఎప్పుడు అందుబాటులో ఉండేలా శానిటైజర్ ను మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోండి.

2. ట్యంపూన్స్ లేదా ప్యాడ్స్

మీకు నెలసరి రెగ్యులర్ గానే వస్తుండచ్చు. కానీ ఎప్పుడు ఏమైనా జరగచ్చు అందుకే ముందు జాగ్రత్తగా మీ హ్యాండ్ బ్యాగ్ లో ట్యంపూన్ లేదా ప్యాడ్స్ ఉంచుకోండి. అవసరంలో ఉన్న ఇతర మహిళలకు సహాయపడచ్చు.

3. లిప్ బామ్

ఏ కాలం లోనైనా పెదాలలో తేమ ఎండిపోతూనే ఉంటుంది. దీని కారణంగా పెదాలు పగలడం, రక్తం రావడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ బాధ నుండి తప్పించుకోడానికి లిప్ బామ్ ను అందుబాటులో ఉంచుకోండి. తరుచుగా వాడుతూ ఉండండి.

4. పెన్ మరియు నోట్స్

ఈ టెక్నాలజీ యుగంలో ఫోన్లు, ట్యాబ్స్ వచ్చాక పేపర్ పెన్ వాడడం పూర్తిగా మర్చిపోయాం. కానీ వాటి అవసరం ఎంతైనా వుంది. ఏదైనా ముఖ్యమైన డాకుమెంట్స్ పైన మీ సంతకం కావాల్సివుంటే, ఇతురులను పెన్ అడగడం బాగోదు. అందుకే మీ హ్యాండ్ బ్యాగ్ లో అవసరానికి ఒక పెన్ ఉంచుకోండి. అలాగే ఏదైనా ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోడానికి ఒక చిన్న నోట్ మీతో పాటు ఉంచుకోండి.

5. బ్రెత్ మింట్స్

నోటిలో ఎప్పుడు బాక్టీరియా ఉంటుంది. ఏదైనా ఆహరం తీసుకున్నాక బాక్టీరియా వలన నోటి దుర్వాసన రావచ్చు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అది మీకు సమస్య కావచ్చు. అందుకే ఈ సమస్య నుండి తప్పించుకోడానికి మీ హ్యాండ్ బ్యాగ్ లో బ్రెత్ మింట్స్ ఉంచుకోండి. ఆహరం తిన్నాక వాటిని వాడండి.

6. బ్యాండ్ ఎయిడ్స్

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు. పెద్ద గాయమే కానక్కర్లేదు. కొత్త చెప్పుల వలన కాళ్ళు పగలచ్చు. అలాంటి గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడైనా వేసుకునే విధంగా బ్యాండ్ ఎయిడ్ ను మీ బ్యాగ్ లో ఉంచుకోండి.

7. వైప్స్

మీ హ్యాండ్ బ్యాగ్ లో తప్పకుండా ఉండాల్సిన మరోక వస్తువు వైప్స్. మేకప్ తుడుచుకోడానికి, లేదా ముఖం మీద జిడ్డును ఇతర ధూళిని తుడుచుకొని మీ ముఖాన్ని రక్షించుకోవడానికి వైప్స్ ను మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోడానికి.

8. పెర్ఫ్యూమ్

ఎండా కాలంలో చమట ఎక్కువగా పోస్తుంది, దాని వలన శరీర దుర్వాసన రావచ్చు. దీని వలన మీరు ఇతరులతో దగ్గరగా మెలగలేరు. ఈ సమస్య నుండి తప్పించుకోడానికి మీ హ్యాండ్ బ్యాగ్ లో పెర్ఫ్యూమ్ ఉంచుకోండి.

9. పెప్పర్ స్ప్రే

మహిళలకు బయట ప్రపంచంలో ప్రతి అడుగు ఒక గండమే. వెళ్ళే దారిలో ప్రతి మలుపులో ఆపద ఏదో ఒక రూపంలో ఎదురుచూస్తూ ఉండచ్చు.  అలాంటి ఆపదలతో పోరాడి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీకు ఒక చిన్న ఆయుధం కావాలి, అది మీ హ్యాండ్ బ్యాగ్ లో వొదిగి పోవాలి. అదే పెప్పర్ స్ప్రే. మీ హ్యాండ్ బ్యాగ్ దీనికి కొంత చోటు ఉంచుకోండి.   

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon