Link copied!
Sign in / Sign up
92
Shares

ప్రతి భార్య తన భర్తకు తప్పకుండా చెప్పాల్సిన 7 విషయాలు

ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే, చాలా విషయాలు చెప్పుకోకుండానే, కొంతమంది తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మనుసులో మాట పంచుకోవడం, ఆనందమైన వైవాహిక జీవితానికి అవసరం. అంతే కాకుండా భార్య భర్త మధ్య అనుబంధాన్ని ఇంకా మధురం చేస్తుంది. మీరు కూడా మీ ఆయన గురించి ఎన్నో మంచి విషయాలు తనకు చెప్పాలనుకుని, చెప్పలేక పోయుంటారు. కానీ చెప్పాలి, అది మీ మధ్య ప్రేమను పెంచడానికి కారణం అవుతుంది. ఒకసారి ఈ 7 విషయాలు మీ ఆయనకు చెప్పి చూడండి…

1. థాంక్ యు

మీ ఆయన మీకు, మీరు మీ ఆయనకు… చాలా సార్లు అనేక విషయాలలో ఒకరికొకరు సహాయం చేసుకుని ఉంటారు. కానీ ఎప్పుడు థాంక్స్ చెప్పుకోరు. మీ అయన కూడా మీకు ఏదైనా సహాయం చేసినప్పుడు, మీ నుంచి థాంక్స్ కోరుకోడు. కానీ ఒకసారి మీ ఆయనను మెచ్చుకుని.. థాంక్స్ చెప్పండి. సంతోషిస్తాడు.

2. సారీ

భార్య భర్త మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు, తప్పును ఒకరి మీద ఒకరు నెట్టేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈసారి అలా కాకుండా, ఏదైనా గొడవ జరిగినప్పుడ... “తప్పు నాదే..ఐ అమ్ సారీ” అని చిన్న మాట చెప్పండి. గొడవ అంతటితో ఆగిపోతుంది. తప్పు మీది కాకపోయినా సారీ చెప్పినందుకు, మీ ఆయనకు, మీ మీద గౌరవం పెరిగిపోతుంది.

3. ఈ రోజు మీరు అందంగా కనపడుతున్నారు..

మీ ఆయన మీకు చాలా నచ్చుతాడు. కానీ ఏదైనా ప్రత్యేకమైన రోజు, సూట్ వేసుకున్నప్పుడు, లేదా మీకు నచ్చే కలర్ షర్ట్ వేసుకున్నప్పుడు. “మీరు ఈరోజు చాలా బావున్నారు…. “ అని ఒక చిన్న మాట, మీ నుంచి వినడం మీ ఆయనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.

4. మిమ్మల్ని నేను నమ్ముతాను

ఈ మూడు పదాలు చాలా విలువైనవి. భార్య భర్తల అనుబంధాన్ని నిలపెట్టే ముఖ్యమైన స్తంబాలలో, నమ్మకం మొదటిది. అందుకే, మీ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు… “నాకు మీద నమ్మకం ఉంది.. మీరు ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారు” అని మీ చెప్పండి. మీ అయన ముఖం ఎంత వెలిగిపోతుందో చూడండి.

5.దీని సంగతేంటో ఒకసారి చూడండి

ప్రతి ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోతే, దానిని బాగు చేసే హక్కు లేదా ఆ ప్రయత్నంలో దాన్ని పాడు చేసే హక్కు… భర్తకు మాత్రమే ఉంటుంది. అవును మగవాళ్ళకు రిపైర్లు చేయడం అంటే చాలా ఇష్టం. చేతకాకపోయిన సరే. అందుకే ఎప్పుడు మీ ఇంట్లో ఏ వస్తువు పాడైపోయిన, మెకానిక్ ని పిలిచే ముందు, మీ ఆయనకు ఒకసారి దాని సంగతేంటో చూడమని  చెప్పండి.

6. నేను రెడీ అయిపోయాను

“ఆడాళ్ళు అలంకారాలు మొదలుపెడితే ఏడాదైనా పూర్తవదు” ఇది ఆడవారి మీద అందరూ వేసే నింద. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు. మీరు లేట్ చేస్తే మీ ఆయన కొంచెం విసుక్కుంటాడు కదూ. అందుకే ఈసారి మీ ఆయనకన్నా ముందే రెడీ అయిపోయి చూపించండి. ఆశ్చర్యం,ఆనందం రెండు కలుగుతాయి.

7. ఐ లవ్ యు

మీ ఆయనకు ఈ మాటను చెప్పి ఎన్ని రోజులైంది…ఎన్ని ఏళ్ళయింది. మీ ఆయన మీద మీకు బోలెడంత ప్రేమ ఉంది కదూ. ఒక్కసారి ఆ ప్రేమను చూపించండి. ఐ లవ్ యూ అని మీ ఆయనకు ఒకసారి చెప్పండి. మీతో మళ్ళి ప్రేమలో పడిపోతాడు.

ఈ విషయాలన్ని మీ ఆయనకు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇది మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి… చాలా సంతోషిస్తాడు

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon