Link copied!
Sign in / Sign up
35
Shares

ప్రతి భార్య తన భర్తకు చెప్పే 6 అబద్ధాలకు అర్ధాలు ఇవే..

ఆడవాళ్ళకు, అబద్ధాలకు ఏ సంబంధం లేకపోయినా, ఎందుకో అబద్ధాలని ఆడవాళ్ళకు అంటగట్టేసారు. మరీ అంత దగ్గర సంబంధం కాకపోయినా,  ఆడవాళ్ళు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతారు. అయితే ఆ అబద్ధాలకు అర్ధాలు వేరు. వాటికి కారణాలు కూడా ఉంటాయి. అలా తప్పనిసరి పరిస్థితుల్లో భార్యలు తమ భర్తలకు చెప్పే అబద్ధాలు ఏంటో చూడండి….

1. పెళ్లి రోజు బహుమతులు వద్దు

కానుకలు, బహుమతులు అంటే ఆడవారికి ఇష్టమే కదా. కానీ ఇలా అంటున్నారు ఏంటి అని ఆలోచించకండి. అది ఒక అబద్ధం. వద్దు అంటే కావాలని అర్ధం.

2. అప్పుడే పిల్లలు వద్దు

అప్పుడే పిల్లలు వద్దు అంటే, అంత తొందరగా కాకపోయినా, కొంచెం తొందరగా కావాలని. ఈ అబద్ధాన్ని అర్ధం చేసుకోడం కొంచం కష్టం.

3. మీరు లేట్ గా ఇంటికి వచ్చిన నాకు ఇబ్బంది లేదు

ఇదొక పెద్ద అబద్ధం. ప్రతి భార్య తన భర్తతో ఎక్కువ సమయం గడపాలనుకుంటుంది. ఇలా భార్య తన భర్తతో చెపితే ఇంటికి త్వరగా రాకపోతే బాగోదు!!! అని ఇచ్చే వార్నింగ్.

4. మీరు ఎలా ఉన్నా నాకు ఇష్టమే

ప్రతి భార్య తన భర్తను, అందరికి గర్వంగా చూపించాలనుకుంటుంది. కానీ భర్త ఏ వెలసి పోయిన రంగు చొక్కనో, వేసుకుని ఉంటే, ఎం బావుంటుంది. అందుకే “మీరు ఎప్పుడు అందంగా కనిపించాలి” చెప్పడమే దీని అర్ధం.

5. మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు

తన భర్తను ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండే  ఫ్రెండ్స్ అంటే, భార్యకు కొంచం కోపముంటుంది. తనతో గడపాల్సిన సమయాన్ని కూడా, ఫ్రెండ్స్ తో గడిపితే, ఆ కోపం ఇంకా పెరిగి పోతుంది. ఈ అందమైన అబద్ధం నోటి నుంచి వచ్చేస్తుంది.

6. నాకు కూడా క్రికెట్ అంటే ఇష్టం

ఆదివారం పూట తాను చాల రోజులనుండి చూడాలనుకున్న సినిమా చూస్తున్నప్పుడు, భర్త హడావడిగా వచ్చి రిమోట్ తీసుకుని, ఏ క్రికెట్ ఛానలో  పెట్టేస్తే. ఎమి చేస్తుంది? భర్తను నొప్పించడం ఇష్టం లేక ఈ అబద్ధం ఆడుతుంది

మీరు చెప్పే అబద్ధాలకు, అర్ధాలు - కారణాలు మీ ఆయనకు తెలియాలనుకుంటే. ఇది మీ ఆయనకు తప్పకుండా SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon