Link copied!
Sign in / Sign up
15
Shares

ప్రతి భార్య భర్త తప్పకుండా చదవండి : మీ జీవితమే మారిపోతుంది..

పెళ్లి తర్వాత ప్రతి భార్యాభర్తల జీవితం చాలా అంటే చాలా కొత్తగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఐతే నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఆ విషయాలు ఎవరికీ తెలియకపోవడం వలన వారి దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ.  ఇక్కడ ప్రతి భార్యభర్తలు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాన్ని ఒక చిన్న కథగా మీకు అందిస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం…

పెళ్లి అయిన సంవత్సరం తర్వాత అసలు కథ..

పెళ్లి అయిన 6 నెలల వరకు ఈ భార్యభర్తల జీవితం రంగుల హరివిల్లు కంటే ఎంతో అందంగా గొప్పగా గడిచింది. కొన్ని రోజుల తర్వాత నేల వర్షపు నీరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఉంది ఆమె జీవితం. రోజూ భర్త ఆఫీసుకు వెళ్లడం వలన భర్త ఇంటి నుండి వెళ్లిన తర్వాత ఆమె ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉండటం వలన నరకంలా అనిపించేది. నెలకు రెండు సార్లు అత్తయ్య ఇంటికి రావడం అలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్పడం వలన ఆమె మాటలు ఒంటరిగా ఉన్నాననే నరకంగా ఉన్న చిరాకుగా అనిపించేవి. కొన్నిసార్లు ఆమెతో గొడవపడటం, భర్త ఇంటి వచ్చాక తన బాధ చెప్పుకుంటే అమ్మకు వయస్సంది కదా నువ్వే సర్దుకో అని చెప్పడం తప్ప తన బాధ పట్టించుకోడే అని ఏడుస్తూ ఉండేది.

బట్టల సూట్ కేసు ఈ దంపతుల జీవితాన్నే మార్చివేసింది

ఇంట్లో ఒంటరిగా ఉండటం వలన ఆమెకు  చాలా ఇబ్బందిగా ఉండేది, కుటుంబ పరిస్థితులు ఆఫీసులో టెన్షన్ కారణంగా అతను ఏమీ చేయలేకపోయేవాడు. ప్రతి రోజూలాగే గడిచిపోతున్న వారి జీవితంలో ఆమెను మరింత కోపానికి గురిచేసే సంఘటన ఎదురైంది. భార్య వంటగదిలో వంట చేసుకుంటూ ఉండగా, భర్త బట్టల సూట్ కేసుతో ఇంట్లోకి వచ్చాడు. ఆ సూట్ కేసును చూసి మళ్ళీ మీ అమ్మను తీసుకువచ్చారా, మీకు మీ అమ్మకు సేవలు చేయడం నావల్ల కాదని కోపంగా అరిచింది. వెంటనే ఇంటినుండి పంపేయండి, లేకపోతే నేను ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అని గట్టిగా కేకలు పెట్టింది. ఆమె బాధను అర్థం చేసుకున్న భర్త ‘‘నిన్ను చూడటానికి అత్తయ్యగారు (మీ అమ్మ) ఊరి నుండి వచ్చారు’’ అని చెప్పాడు.గుమ్మం బయటే నిల్చున్న ఆమె తల్లి కళ్ళలో కన్నీరు తిరిగాయి. నా కొడుకు, కోడలి పరిస్థితి ఇదే కదా అని బాధపడింది.

ఈ కథ అంతా చదివిన తర్వాత మీకు ఏమనిపించిందో మాకు తప్పకుండా COMMENT చేయండి. ‘’మన జీవితంలోకి వచ్చివెళ్లే ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ఏదో ఒక సమయంలో మన ప్రేమను కోరుకోవడం, వాళ్ళ ప్రేమను అందించడం చేస్తుంటారు’’ అనేది మా కామెంట్. మరి మీ అభిప్రాయం ఏంటి.. మీరు ఏం అర్థం చేసుకున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon