Link copied!
Sign in / Sign up
1
Shares

కొన్నిసార్లు ప్రసవించే సమయంలో పిల్లలు బయటకు రాకుండా ఇరుక్కుపోతారు : అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి

బిడ్డకు జన్మను ఇచ్చే ప్రసవ సమయంలో కొన్నిసార్లు బిడ్డ బయటకు రాకుండా ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో వైద్యులు సిజేరియన్ సలహా ఇస్తుంటారు. అయితే బిడ్డ ఎందుకు గర్భాశయం నుండి రావడానికి ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఎటువంటి సమయంలో ఇలా జరుగుతుందో తప్పక తెలుసుకోండి.

మీ బిడ్డ పొజిషన్

మీరు ప్రసవానికి సిద్ధమయ్యే చివరి మూడు నెలలలో మీ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏ స్థానంలో ఉన్నా కూడా తల కిందకు రావడం జరుగుతుంది. సహజంగా ప్రసవం (యోని నుండి) పొజిషన్ ఇదే. అయితే కొన్నిసార్లు బిడ్డ తల వెనుకకు ఉండి, ముందు కాళ్ళతో వస్తుండటం లేదా బొడ్డు తాడు అడ్డుపడుతున్నపుడు ఇరుక్కుపోతుంటారు. ఈ సమయంలో ప్రతి వైద్యుడు తీసుకునే నిర్ణయం సిజేరియన్.

ప్రసవించే తల్లి పొజిషన్

డెలివరీ సమయంలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. మాములుగా చక్కగా కాళ్ళపై నిలబడి, భూమికి చేతులను ఆనించి మోకాళ్ళపై కూర్చోవడం, స్ట్రైట్ గా పడుకోవడం ఈ విధంగా ఉన్నప్పుడు ప్రసవం బాగా జరుగుతుంది. అలా కాకుండా ఒకే వైపు పడుకుని, కూర్చొని ఉండటం, వాలుగా ఉండటం వలన బిడ్డ బయటకు రాకుండా ఇరుక్కుపోవడం జరుగుతుంది.

ఎపిడ్యూరల్

ప్రసవ సమయంలో నొప్పులను తట్టుకోవడానికి గర్భంతో ఉన్న మహిళకు ఇచ్చే మత్తు మందు ఎపిడ్యూరల్ అనేస్తిషియా. ఈ సమయంలో నొప్పులు తగ్గుతాయనేది నిజమే అయినా కొన్నిసార్లు ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా, తల్లి ఎక్కువ శ్రమకు గురై బలోపేతం కావడం, తన కంట్రోల్ లో లేకపోవడం వలన ఏం జరుగుతుందో, ఏ పొజిషన్ లో ఉండి ప్రసవిస్తున్న విషయం తెలీదు. ఇదే సమయంలో బిడ్డ అడ్డం తిరిగి ఇరుక్కుపోయే అవకాశం ఉంది.

భుజాలు పెద్దవిగా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు

ప్రసవించే బిడ్డ ఎంత బరువుతో ఉన్నాడో చెప్పడం కష్టమే కానీ బిడ్డ గర్భాశయం నుండి రావడానికి ఇబ్బందిపడుతున్నాడు అంటే ఒకటి ఎక్కువ బరువుతో ఉండాలి లేదా తన భుజాలు పెద్దవిగా ఉండటం వలన బయటకు రాలేక ఇరుక్కుపోతాడు. ఈ సమయంలో ఖచ్చితంగా సి- సెక్షన్ చేయాల్సిందే. చాలా తక్కువ మందే సహజంగా జన్మను ఇచ్చేందుకు ఈ సమయంలో ధైర్యం చేస్తుంటారు.

పొత్తి కడుపు ఆకారం

యోని నుండి బిడ్డకు జన్మను ఇవ్వాలనుకున్నప్పుడు పొత్తి కడుపు కరెక్ట్ సైజులో ఉందా, కరెక్ట్ బరువుతో ఉందా లేదా అని వైద్యులు చెక్ చేస్తుంటారు. నార్మల్ డెలివరీలో ఇది చాలా ముఖ్యమైనది. కరెక్ట్ ఆకారంలో లేకపోయినా, బరువు తక్కువగా ఉన్నా ప్రసవ సమయంలో ఎక్కువ నొప్పి పొత్తి కడుపుపై పడే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఇరుక్కుపోవడం జరుగుతుంది.

అయితే ఎవరూ బిడ్డ గర్భాశయం మధ్యలో బయటకు రాకుండా ఇరుక్కుపోవాలని అనుకోరు. కానీ, గర్భంతో ఉన్నప్పుడు చేయాల్సిన వ్యాయామాలు, యోగా చేయడం వలన బిడ్డ ఇరుక్కుపోవడం వంటివి జరగవు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon