Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవానికి ముందు ప్రతి మహిళకు ఉండే 6 కోరికలు : మీ ఆయనకు చెబితే చాలా సంతోషిస్తారు

ప్రసవం గురించి మహిళలు ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. తమకు పుట్టబోయే బిడ్డ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటారు. వారు బిడ్డను మోస్తున్న 9 నెలలు కూడా బిడ్డ గురించే ఆలోచిస్తారు. ప్రసవం బాగా జరగాలి అని, బిడ్డ అందంగా ఉండాలి అని కోరుకుంటారు. వీటితో పాటు వారు ప్రసవం గురించి ఏమి కోరుకుంటారంటే,

బాబా లేక పాపా

చాలా అమ్మలు తమకు అబ్బాయే కావాలని లేదా అమ్మాయే కావాలని గట్టిగా కోరుకుంటారు. దానికి ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా వారి ఆలోచనలు అలా ఉంటాయి. చాలా మంది తమ పిల్లలకు కావల్సిన షాపింగ్ కూడా ముందే చేసుకుంటారు.

నా కళ్ళే

చాలా మంది తల్లులు తమ పిల్లలకు తమ కళ్ళే రావాలను కోరుకుంటారు.  మీ జీన్స్ ఎక్కువగా వచ్చి మీ జుట్టు, మీ కలర్ వంటివి కూడా వస్తే బాగుంటుందని వారు అనుకుంటారు.

సుఖ ప్రసవం

మొదటిసారి తల్లి అయ్యే వారికి ప్రసవం ఎలా జరుగుతుందో అన్న భయం ఉంటుంది. అందుకే ప్రసవం సుఖంగా, ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని చాలా మంది గర్భవతులు కోరుకుంటారు. సుఖంగా ప్రసవం జరిగి తల్లి, బిడ్డా క్షేమంగా ఉండాలని వారు ఆశిస్తారు.

సహజ ప్రసవం

సిజేరియన్ కాన్పు వల్ల వచ్చే ఇబ్బందుల దృష్ట్యా చాలా మంది సహజకాన్పు కావాలని కోరుకుంటారు. సహజ ప్రసవంలో కొంత బాధ ఉన్నప్పటికీ చాలా మంది దాన్నే ఎన్నుకుంటారు.

బ్రెస్ట్ మళ్ళీ తక్కువ అవ్వకూడదని

మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో బ్రెస్ట్ పెరగడం మొదలౌతుంది. దీని వల్ల తక్కువ బ్రెస్ట్ ఉన్న మహిళలు వాటిని అలాగే ఉండాలని కోరుకుంటారు. తిరిగి పరిమాణం తగ్గడాన్ని వారు ఇష్టపడరు. అయితే, మంచి బ్రాస్ వాడటం వల్ల మంచి ఆకృతిని పొందవచ్చు.

భర్త పక్కన ఉండగా ప్రసవం

చాలా మంది మహిళలు తమ భర్తనే సర్వస్వంగా బావిస్తారు. దీంతో వారి భర్త తమను ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదని అనుకుంటారు. అదే విధంగా ప్రసవం జరుగుతున్నప్పుడు తమ భర్త తమ పక్కనే ఉండాలని, తమకు ధైర్యం చేప్పాలని, తమ చేతిలో చెయ్యి వేయాలని అనుకుంటారు. ఇలా ఒక్కో మహిళను బట్టి ఒక్కో రకమీన కోరికలు లేదా ఆశలు ఉంటాయి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon