ప్రసవం తర్వాత బెల్లీ బెల్ట్ వాడటం మంచిదేనా..! అసలు నిజాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి
తల్లి అయిన తరువాత బిడ్డను చూసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, శరీరంలో లో వచ్చిన మార్పులు చూసుకుంటే అంత బాధగా ఉంటుంది. కాని, దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి శాశ్వతమైన మార్పులు కాదు. ఈ రోజుల్లో మీ శరీరాన్ని మల్లి మునుపటిలా మార్చుకోవడానికి చాలా పరికరాలు ఉన్నాయి. వాటిలో బెల్లి బెల్ట్ అత్యంత ఉపయోగకరమైనది.
ఈ అద్బుతమైన పరికరం శరీరాక్రుతుని సరి చేస్తుంది, స్త్రేచ్త్ మార్క్స్ తగ్గిస్తుంది మరియు వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం కల్గిస్తుంది. ఇప్పుడు బెల్లి బెల్ట్ ఎలా వాడాలి మరియు వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
1. అందమైన శరీరాకృతి మీ సొంతం
ఈ బెల్లి బెల్ట్ యొక్క ప్రధమ ఉపయోగం శరీరాకృతిని అందముగా మార్చడం. ప్రసవం తరువాత నడుం భాగం బాగా వెడల్పుగా తయారయుంటుంది. ఈ బెల్ట్ వాడటం ద్వారా సులువుగా మీరు అతి తక్కువ సమయం లో మీ పూర్వ శరీరాకృతి పొందగలరు. బెల్లి బెల్ట్ వాడిన వారు తమ అనుభవాలు చెప్తుంటే చాలా ఆశ్చర్యం కల్గింది. అంతే కాకుండా, జెస్సికా ఆల్బా వంటి హాలీవుడ్ తారలు కూడా దీనిని సిఫారసు చేస్తున్నారు. తనకి కేవలం 3 నెలల్లోనే ఈ బెల్ట్ వాడడం ద్వారా తన పూర్వ శరీరాకృతి తిరిగి వచ్చింద౦ట. అద్బుతం కదా?
2. శరీరం యొక్క పటుత్వం పెరుగుతుంది
బెల్లి బెల్ట్ వాడటానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే అది మన శరీర పటుత్వం పెంచుతుంది. అంతే కాకుండా దీనిని వాడటం కూడా చాలా సులువు. పిల్లలను చూసుకుంటూ మన శరీరం మీద శ్రద్ద పెట్టడ అంత సులువైన విషయం కాదు. కానీ, బెల్లి బెల్ట్ సులువుగా పిల్లలను ఎత్తుకుని కూడా ఉపయోగించవచ్చు.
3. వెన్ను నొప్పి తగ్గించడంలో దోహదపడుతుంది
ప్రసవం తరువాత వెన్ను నొప్పి రావడం చాలా సహజం. దీనికి ముఖ్య కారణం మన శరీరాక్రుతిలో మార్పు రావడం. ముందుగా చెప్పినట్టు బెల్లి బెల్ట్ మీ శరీరాకృతిని అందంగా మారుస్తుంది తద్వారా వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం కల్గిస్తుంది. ముఖ్యంగా పార్శ్వగూని, వెన్ను సమస్యలతో బాధపడే వారికి ఇది అధికముగా ఉపయోగపడుతుంది.
4. సిసేరియన్ ఆపరేషన్ తరువాత
సిసేరియన్ ఆపరేషన్ జరిగిన మహిళలకు డాక్టర్లు బెల్లి బెల్ట్ ని సిఫారసు చేస్తుంటారు. ఈ బెల్ట్ వాడడం ద్వారా మీకు ఆపరేషన్ జరగడం వలన కలిగే నొప్పి కొంత వరకు తగ్గుతుంది. అంతే కాకుండా కుట్లు తొందరగా మానడం లో కూడా సహాయపడుతుంది. దీనిని ధరించడం ద్వార గాయానికి ఇన్ఫెక్షన్, దెబ్బలు వంటివి కలగకుండా ఉండడం లో కూడా సహాయ పడుతుంది.
పైన చెప్పిన కారణాల మూలానే కాకుండా ఇది వేసుకోవడానికి సులువుగా కావాల్సిన కొలతల్లో దొరకడం వలన దీనిని ఎక్కువ మంది వాడటానికి ఇష్టపడుతుంటారు.
గమనిక: మీరు ఈ బెల్ట్ వాడే ముందు ఒక్కసారి డాక్టర్ దగ్గర సలహా తీసుకుంటే మంచిది.
