Link copied!
Sign in / Sign up
18
Shares

ప్రసవం తర్వాత సెక్స్: ఎలా ఉంటుంది? వారి అనుభవాన్ని పంచుకున్న 7 జంటలు

ప్రెగ్నెన్సీ తర్వాత శృంగార జీవితం అంటే మరో ఘట్టం మొదలైనట్లే. ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత ఎప్పుడెప్పుడు సెక్స్‌లో పాల్గొందామా  అని మీ భర్తకు, మీకు ఉండవచ్చు. అయితే ప్రసవం తర్వాత శృంగారం గురించి 7 మంది జంటలు మాతో  వారి ఫీలింగ్స్‌ను పంచుకున్నారు. అవేంటంటే,

సెక్స్‌కు చాలా తక్కువ ప్రాధాన్యత

‘ప్రసవం జరిగిన తర్వాత సెక్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత చాలా తగ్గి౦ది, దాదాపు 13 గంటల ప్రసవ వేధన వల్ల సెక్స్ మీద తొందరగా శ్రద్ధ కలగలేదు’ అని తన్యా అనే ఆమె చెప్పింది. ‘మేము డాక్టర్‌ను కలిసిన తర్వాత మీరు కొన్ని వారాల పాటూ సెక్స్‌కు దూరంగా ఉండాలని చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది కాని మా భర్త పరిస్థితి దానికి భిన్నంగా ఉండింది’ అని ఆమె చెప్పింది. డాక్టర్ అలా సలహా ఇవ్వడం వల్ల శృంగారాన్ని అవాయిడ్ చేసేందుకు వెసులుబాటు కలిగిందని  తన్య చెప్పింది.

మొదటిసారి సెక్స్ చేసిన అనుభూతి

కరన్ మాట్లాడుతూ ‘నా భర్యకు ప్రసవం అయిన తర్వాత మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా పాల్గొన్నాము. మాకైతే మొదటిసారి శృంగారంలో పాల్గొన్న అనుభూతి కలిగింది’ అని చెప్పాడు. కరన్ భార్య నేహ మాట్లాడుతూ, ‘నాకు కూడా మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఎలాగైతే నొప్పి కలిగిందో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది అయితే, తక్కువ సమయములోనే మునుపటిలా ఆనందించగలిగాను’ అని చెప్పింది

నిదానంగా చేయాలి

‘ప్రసవం అయిన తర్వాత తిరిగి మునుపటిలా సెక్స్ చచేయడానికి కాస్త సమయం పడుతుంది. అయితే మేము సెక్స్ చేసే ముందు దాని గురించి మాట్లాడుకుంటూ మొదలుపెట్టాము, దాంతో మా పని సులభం అయింది’ మీన అభిప్రాయపడ్డారు. ‘అవును సులభంగా జరగడానికి ఫోర్‌ప్లేతో మొదలుపెట్టి ఆ తర్వాత శృంగారం చేశాము’ అని మీన భర్త రాహుల్ చెప్పారు.

వక్షోజాలు సున్నితంగా మారుతాయి

ప్రసవం జరిగిన తర్వాత పాల వల్ల వక్షోజాలు చాలా సున్నితంగా మారుతాయి. ముందులాగా శృంగార సమయంలొ తమ భర్త వక్షోజాల మీద చేతులు వేయడానికి చాలా మంది మహిళలకు ఇష్టం ఉండదు. అంతే కాకుండా ఎక్కువ ప్రెస్ చేస్తే పాలు వచ్చే ప్రమాదం ఉందని మహిళలు బావిస్తారు. అందుకే చాలా మంది బ్రా వేసుకొనే శృంగారంలో పాల్గొంటారు. ఆమె అనుభవం గురించి మాట్లాడిన అనూ, ‘మా భర్త మొదటగా కిస్ చేస్తూ ప్రారంభించారు, ఆ తర్వాత చెస్ట్ మీద చెయ్యి వేయగానే నేను తిరస్కరించాను. నాకెందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది’ అని చెప్పింది.

పిల్లలు గమనిస్తారేమో అనే ఆలోచన రావడం

మీరు శృంగారం చేసుకొనేటప్పుడు మీ పిల్లలు చూస్తారేమో అని అనుమానం రావడం సహజం. అవంతిక మాట్లాడుతూ, ‘మేము సెక్స్ చేసేటప్పుడు పాప గమనిస్తుందేమో అని ఆలోచనలో ఉంటాను, పొరపాటున ఆ సమయంలో ఉన్నప్పుడు పిల్లలు చూస్తే ఎలా అన్న ఆలోచనtతో చాలా సార్లు ఇబ్బంది కలిగింది’ అని ఆమె చెప్పింది.

ఆ భాగం సున్నితత్వాన్ని కోల్పోవచ్చు

నార్మల్ డెలివరీ అయిన వారికి ఆ భాగంలో ఉండే ఖండరాలు పటుత్వాన్ని కోల్పోయి మునుపటి సున్నితత్వం దూరం అయ్యే అవకాశం ఉంది. అదితి అనే ఆమె మాట్లాడుతూ, ‘మునుపటితో పోలిస్తే ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ నా భర్త వల్ల మళ్ళీ ముందులా అనిపించింది’ అని చెప్పింది. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చెయడం వల్ల ఆ భాగం తిరిగి సున్నితత్వాన్ని పొందవచ్చును.

సిజేరియన్ చెయడం వల్ల మీ శృంగార జీవితం మీద ప్రభావం ఉండవచ్చు

డెలీవరీ ఎలా జరిగిందనే విషయం మీద కూడా మీ శృంగార జీవితం ఆధారపడి ఉంటుంది. సిజేరియన్ చేసుకున్న వారికి శృంగారం చేయడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. సంజన మాట్లాడుతూ, ‘నార్మల్ డెలివరీ జరిగితే కేవలం కొన్ని రోజులే నొప్పిగా ఉంటుంది అదే సిజేరియన్ జరిగిన నాకు సెక్స్ అంటే మొదట్లో ఇబ్బందిగా అనిపించేది అయితే కొన్ని రోజులకు నేను కూడా మాములుగా ఆనందించగలిగాను’ అని చెప్పింది.


మీరు క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గరకు వెల్తూ, వారు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కొద్ది కాలములోనే మీరు కూడా మునుపటిలాగా శృంగార జీవితాన్ని అనుభవించగలరు

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon