Link copied!
Sign in / Sign up
40
Shares

ప్రసవం తర్వాత ప్రతి మహిళ ఎదుర్కోవాల్సిన 6 ఇబ్బందికరమైన పరిస్థితులు


ప్రెగ్నన్సీ తరువాత బాధ్యతలు, పెరుగుతాయి. కొత్తగా పుట్టిన బాబు/పాపను సంరక్షించడమంటే మామూలు విషయం కాదు. మీరు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది, మీరు చేయాలనుకునే పనులేవీ చేయలేరు. మీకు ఎన్నో సందేహాలు రావచ్చు. మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కచ్చితంగా కొన్ని విషయాలను నివారించలేరు. అవేంటంటే,

1. నిద్రను మిస్ అవ్వడం

మీరు ప్రసవ సమయంలో చాలా అలసిపోయి ఉంటారు. ఇప్పుడు మీకు రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కానీ మీరు పాపతో బిజీ ఉండటం వల్ల కుదరకపోవచ్చు. మీరు కొన్ని నెలల పాటూ నిద్రకు దూరంగా ఉండాల్సి రావచ్చు. దీని వల్ల మీకు తలనొప్పి, ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి, ఇన్సోమ్నియ, అమ్నిసియా వంటి వ్యాధులకి దారి తీయవచ్చ్చు.

2. నచ్చిన దుస్తులు

మీరు ప్రెగ్నెంట్ అవడం వల్ల మీ పొట్ట చాలా లావుగా అయి ఉంటుంది. మీ నడుము భాగంలో ఎక్కువ ఫ్యాట్ చేరి ఉంటుంది. కాబట్టి మీరు మీకు నచ్చిన జీన్స్ దుస్తులు వేసుకోలేకపోవచ్చు. అయితే మీరు ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల తిరిగి మీ శరీరాకృతిని పొందవచ్చు. మీలో ఉన్న నమ్మకాన్ని సడలింపజేయవద్దు.

3. బ్రెస్ట్ ఫీడింగ్

మీరు ఇబ్బంది పడే మరో అంశం ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్. మీరు పాలు తాగించేటప్పుడు నొప్పిగా ఉండవచ్చు. పాలు ఇచ్చేటప్పుడు పాపను సరిగ్గా పడుకోబెట్టకపోతే అప్పుడు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది, మీ నిపుల్స్ మిమ్మల్ని మరింత బాధిస్తాయి. అయితే నొప్పిని తగ్గించుకోవడానికి వైద్యున్ని సంప్రదించాలి. ఈక్రమంలో మీరు మంచి డైట్ తీసుకోవాలి.

4. పర్ఫెక్షన్

పిల్లల విషయంలో మీకు వైద్యులు ఇచ్చిన ప్రతి సలహానూ పాటించి ఉంటారు కానీ పాప ఏడుపు మాత్రం ఆపదు. అప్పుడు మీ పర్ఫెక్షన్ మీద మీకు అనుమానం వస్తుంది. అయితే మీరు ఈ సమయంలో ఇతరుల సహకారం తీసుకోవడం ద్వారా దీనిని అధికమించవచ్చు. ఒకవేళ మీరు పిల్లల విషయంలో అనుకున్నవి జరగకపోయినా, మీరు ఫెయిల్ అయ్యారని బాధపడకండి, మెల్లగా అన్ని సర్దుకుంటాయి.

5. హార్మోన్ లోపం

మీకు వచ్చే భౌతికమైన మార్పులకు, మానసిక మార్పులకు ప్రధాన కారణం హార్మోన్స్. మీరు రూమ్‌లోకి వెల్తారు కానీ ఎందుకు వెళ్ళారో మర్చిపోతారు, మీ బట్టలు ఫ్రిడ్జ్‌లోనూ, ప్లేట్స్ వాషింగ్ మిషన్‌లోను పెట్టేస్తారు. అయితే దీనంతటికీ కారణం హార్మోన్ అసమతుల్యమే. కొన్ని రోజులకు మీరు మాములుగా అవ్వగలరు కాబట్టి దీని గురించి బాధపడాల్సిన పని లేదు.

6. ఒంటరితనం

మీరు ఒంటరి అన్న భావన చాలా సార్లు కలిగే అవకాశం ఉంది. మిమ్మల్ని మీ కుటుంభం కూడా అర్థం చేసుకోకపోవచ్చు. మీ భర్త అప్పుడప్పుడూ అర్థం చేసుకున్నా ప్రతిసారీ అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రసవం జరిగిన కొన్ని నెలలను మీరు చాలెంజ్‌గా తీసుకొని మళ్ళీ మునుపటిలా మారాలి. అయితే మీరు మానసికంగా ఎలాంటి సంఘర్షణను అనుభవిస్తున్నారో మీ భర్తకు చెప్పడం వల్ల అతను అర్థం చేసుకొనే అవకాశం ఉంది.

ఈ దశ మీకు ఒక్కరికే కాదు ప్రతి మహిళకూ వస్తుంది, దీన్ని అధికమించి తిరిగి మునుపటిలా మారడానికి కాస్త సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబం మీకు అండగా ఉంటే మీరు తొందరగా కోలుకుంటారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon