ప్రసవం తర్వాత మహిళలు ఫాలో అవ్వడం మర్చిపోయే 10 బ్యూటీ టిప్స్!
మహిళల మొహంలో స్వతహాగానే ఆకర్షణ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అయితే, పిల్లలు పుట్టిన తర్వాత మీరు అందం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మీ అందాన్ని కోల్పోతారు. కొత్తగా తల్లి అయిన మహిళలకు ఎక్కువ బాధ్యతలు ఉండటం వల్ల అందం మీద శ్రద్ధ తగ్గిస్తారు. సాధారణంగా కొత్తగా అమ్మ అయిన వారు అందం పరంగా చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే,
సన్‌స్క్రీన్ లోషన్
కొత్తగా తల్లి అయినవారు పిల్లల కోసం చాలా చోట్ల తిరగాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి వైద్యుని దగ్గరకు వెళ్ళాల్సి రావడం, పార్క్స్‌కు వెళ్ళడం, బయటకు వెళ్ళడం వంటివి చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకొని వెల్తే మీ చర్మం మృదువుగా ఉంటుంది.
జుట్టు సంరక్షణ
మీ చర్మం లాగే మీ జుట్టు కూడా చాలా సున్నితమైనది. కాబట్టి, మీరు బయటకు వెళ్ళేటప్పుడు జుట్టుకు ఏదైనా అప్లై చేయాలి లేకపోతే మీ జుట్టు ఎండ బారిన పడి పొడిబారుతుంది.
మేకప్
పెళ్ళికి ముందు మీరు మేకప్ వేసుకోకుండా ఏ ఈవెంట్‌కూ వెళ్ళి వుండరు కానీ, పెళ్ళి అయిన తర్వాత మేకప్ వేసుకోవడానికి సమయం కూడా ఉండదు కాబట్టి అందంగా ఉండటానికి సహజమైన పద్ధతులు ఎంచుకోవడం మేలు.
చేతుల సంరక్షణ
మీరు ఎన్నో రోజుల నుండి మీ బేబికి సపర్యలు చేయడం వల్ల చేతులు పొడిగా మారిఉంటాయి. అంతేకాక, ఇంటి పని కూడా చేయడం వల్ల చేతుల మీద వాతలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా హ్యాండ్ లోషన్ లేదా నూనె రాయడం మంచిది.
జుట్టు
భార్యలు శుభ్రంగా ఉంటే మగవారు ఎక్కువగా ఆఖర్షితులు అవుతారు. కాబట్టి, మీ శరీర పార్శ్వాలలోనూ, కాళ్ళ మీద ఉండే వెంట్రుకలను తొలగించుకోవాలి. తద్వారా మీ శృంగార జీవితం హాయిగా ఉంటూ మీ భర్తకు మీరు మరింత దగ్గర అవుతారు.
ముఖం కడుక్కోవడం
పిల్లలు పుట్టక ముందు మీరు రోజూ రెండు సార్లైనా ముఖం కడుక్కొనేవారు కానీ ఇప్పుడు ఉదయం మాత్రమే కడుక్కోవడానికి అలవాటు పడి ఉంటారు. మీరు తిరిగి అందాన్ని పొందాలంటే, రోజూ పడుకొనే ముందు ఫేస్‌వాష్ చేయాలి.
కాళ్ళు
ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరంలో విడుదల అయ్యే హార్మోన్స్ అసమతుల్యం వల్ల మీ శరీర భాగాలకు సరైన పోషణ అందదు. అందులో భాగంగా మీ కాళ్ళకు కూడా సరైన పోషణ అందక కాళ్ళు పగలడం, చీలడం వంటీవి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఎంత బిజిగా ఉన్నా కాళ్ళ సంరక్షణను అశ్రద్ధ చేయకండి.
వ్యక్తిగత కిట్
మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అందానికి సంబంధించి వ్యక్తిగతంగా కొన్ని వస్తువులు తీసుకెళ్ళడం మంచిది. అవేంటంటే, ఫేష్ వాష్ క్రీమ్, లిప్‌స్టిక్, రబ్బర్ బ్యాండ్స్, సన్ లోషన్ క్రీమ్ వంటివి. వీటి వల్ల మీరు మీఅందాన్ని తగ్గకుండా కాపాడుకోవచ్చు.
వ్యాయామం
మీకు ఉండే పనులు, బాధ్యతల దృష్ట్యా వ్యాయామం చేయడం అస్సలు కుదరకపోవచ్చు. కానీ మీ శరీరంలో వచ్చిన అనవసర కొవ్వులను తగ్గించుకోవడానికి మీరు రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయడం మంచిది. దీని వల్ల మీరు అలసిపోవడంతో బాగా నిద్ర పోతారు, నిద్రతో ఒత్తిడి దూరమై అహ్లాదంగా ఉంటారు.
నీళ్ళు తీసుకోవడం
మీరు మీ పనుల ఒత్తిడిలో ఉండిపోయి తగినంత నీటిని తీసుకోలేకపోతారు. దీంతో మీ చర్మం మీద ముడుతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజులో మీరు ఎంత ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే అంత మంచిది.
పైపనులన్ని చేయడం వల్ల మీరు మునుపటి అందాన్ని తిరిగి పొందగలరు
ఇవి కూడా చదవండి..
