Link copied!
Sign in / Sign up
125
Shares

ప్రసవం తరువాత బాలింతలకు బలాన్ని శక్తిని పాలను ఇచ్చే 'ధనియా గోంద్ లడ్డు' : ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుకోండి....

9 నెలలు ప్రేగ్నన్ట్ గా ఉండి, ప్రసవం పూర్తయ్యి బిడ్డ పుట్టిన తరువాత మీరు కొంత నీరసిస్తారు. కానీ బాలింతగా మీరు బలహీన పడితే ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. మీరు బలంగా శక్తితో ఉంటేనే బిడ్డకు బావుంటుంది. అంతే కాకుండా బాలింతలను వేదించే ఇంకో సమస్య పాలు. బిడ్డకు ఇవ్వాల్సినన్ని పాలు ఉండకపోవచ్చు. వీటన్నికి ఒక సమాధానం ధనియా గోంద్ లడ్డు. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, గోంద్ (ఒక రకమైన తినే జిగురు) చేసే లడ్డు మీకు కావాల్సిన పోషకాలను, మరియు మీ బిడ్డకు కావాల్సిన పాలను అందిస్తుంది. బాలింతలుగా ఉన్నప్పుడు ఈ లడ్డు తినడం మీకు బిడ్డకు చాలా మంచిది.  అందుకు కావాల్సిన పదార్ధాలు ఏంటో…ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

కావాల్సిన పదార్ధాలు :

గొంద్ - 500 గ్రాములు

బాదం - 500 గ్రాములు

పిస్తా - 500 గ్రాములు

అంజీర - 500 గ్రాములు

జీడీ పప్పు - 500 గ్రాములు

బెల్లం బెల్లం - 500 గ్రాములు

ఎండు ద్రాక్ష - 100 గ్రాములు

ఖర్జూరం - 100 గ్రాములు

అల్లం పౌడర్ - 100 గ్రాములు

యాలకలు - 100 గ్రాములు

కొబ్బరి పొడి - ఒక కప్పు

గసగసాలు - 25 గ్రాములు

నెయ్యి - తగినంత

తయారు చేసే విధానం

1.జీడీ పప్పు, బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరం, ఎండి ద్రాక్ష మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెయ్యిలో వేయించుకోవాలి.

2. గోంద్ ను కూడా నెయ్యిలో వేయించి పెట్టుకోండి.

3. వేయించిన ఖర్జురాన్ని, ఎండు ద్రాక్షాను, అంజీరాను మెత్తగా గ్రైండ్ చేసుకోండి.

4. వేయించిన గోంద్ ను మిక్సీలో మెత్తగా బ్లెండ్ చేసుకోండి.

5. బెల్లాన్ని మెత్తగా నలిపి నెయ్యిలో వేయించి కరిగించండి.

6. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని, ఆ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకోండి. ఒకవేళ ముద్దగా రాకపోతే, వేయించిన గోధుమపిండిని సరిపోయేంత కలుపుకుని ముద్దలు చేసుకోండి. 

ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలు చూడండి...

 

Video Credits : Vahchef-vahrehvah

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon