Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవం తరువాత వత్తిడిని ఎదురుకోవడం ఎలా?

ప్రసవానంతర ఒత్తిడిని నివారించడం ఎలా? కారణాలు ఏమిటి?

జ్యోతి అనే మహిళ ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రతి ప్రసవం తరువాత ఆమెను ఎన్నో శారీరిక సమస్యలు మరియు మానసిక ఒత్తిడిలు చుట్టుముట్టాయి. ఆమె ఎలా అధిగమించిందని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆమెలా మీరు చేస్తే ఇక ఒత్తిడి అనేది మీ జోలికి రాదు.

జ్యోతి అనే ఆమె మనలో ఒకరు. ప్రసవం తరువాత ప్రతి మహిళా ఎదుర్కునే సమస్యలను ఎదుర్కున్న మీ లాంటి నా లాంటి ఒక సాధారణ మహిళ. ఎన్నో సమస్యలు ప్రసవం తరువాత మహిళను వెంబడిస్థాయి, వాటిలో ముఖ్యమైనవి నిద్రలేమితనం, అలవుతూ లేని పిల్లల పెంపకం, పాలు పట్టించడం, ఒత్తిడి ఎలా ఎన్నో. ఇన్ని రోజులు మీ జీవితాన్ని మాత్రమే చూసుకుంటున్న మీరు, ఇపుడు మీ చేతుల్లో ఒక ప్రాణం ఉందంటే మీ ఒత్తిడిని అర్థం చేసుకోగలము. ఇప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకొని పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుందాము.

1. బ్రెస్ట్ ఫీడింగ్

జ్యోతికి కూడా అందరిలాగే ఒత్తిడి మొదట పిల్లలకు పాలు పట్టించే సమయంలో కలిగింది. పిల్లలకు కావాల్సినన్ని పాలు లేకపోవడం వలన కానీ పిల్లలు పాలు తాగలేకపోవడం వలన ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అయ్యింది. జ్యోతి పాలు పెట్టకపోయినా, పిల్లలు పాలు తాగకపోయినా తనను తాను నిందించుకొని తెగ బాదపడిపోయేది. అంతే కాకుండా చుట్టాలు, ఇరుగుపొరుగు వారు అదేదో థానే తప్పు చేసినట్టు మాట్లాడటం తో ఈ ఒత్తిడి మరింత ఎక్కువ అయ్యింది. మాకు తెలుసు, జ్యోతి పడిన ఈ బాధను ప్రతి మహిళా పడింటుందని, కానీ అది మీ పొరపాటు కాదు, మీ తప్పు ఏమి లేదు, అనవసరంగా నిందించుకోకండి. జ్యోతి ఈ విషయాన్నీ అర్థం చేసుకొని తనని తాను నిందించుకోవడం మానేసింది, డాక్టర్ని అడిగి పరిస్కారం తెలుసుకుంది.

2. నిద్రలేమితనం

కొత్తగా తల్లి అయిన వారికి ఇది మరొక పెద్ద సమస్య. అసలే శారీరక సమస్యల వలన నిద్ర రాకుంటే, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో మనకు నిద్ర అనేదే లేకుండా పోతుంది. పిల్లల నిద్ర సమయాలు మనలా ఉండవు కనుక మనం వారు నిద్రపోయే సమయాల్లో నిద్రపోవడానికి ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. నిద్రలేమి వలన మనకు ఎన్నో సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలోనే జ్యోతి పిల్లలు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి సరైన వాతావరణం ఏర్పడిచి పిల్లలను ఉయ్యాలలో వేసి ఊపేది. ఇది వినడానికి సింపుల్ గానే ఉన్నా ఇలా చేసిన తరువాత జ్యోతి హాయిగా నిద్రపోగలిగేది.

3. శరీర బరువు

కొత్తగా తల్లి అయిన వారిని అత్యధికంగా బాధపెట్టే సమస్య ఏమిటంటే వారి బరువు. కొంతమంది దీనిని అస్సలు పట్టించుకోరు కానీ కొంత మంది వెంటనే తగ్గించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ రెండు రకాల ఆలోచనలు తప్పే. 9 నెలలుగా పౌష్ఠిక ఆహరం తీసుకోవడం వలన పెరిగిన బరువు వెంటనే తగ్గాలని అనుకోవడం మంచిది కాదు. అలాగే అధిక బరువుతో ఉంటె అనేక సమస్యలు వస్తాయి కాబట్టి నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. ఎలాంటి సమయంలోనే, తన బిఇడి పెంపకానికి అడ్డు రాకుండా నిదానంగా బరువు తగ్గించుకోవడం మొదలు పెట్టింది. బిడ్డ ఎదుగుదలతో పాటు, తన శరీరాకృతిని కూడా మార్చుకుంది. అందుకే నిదానంగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే ఫలితం కనపడటం లేదు అని ఒత్తిడికి గురి అవ్వకూడదు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon