Link copied!
Sign in / Sign up
10
Shares

పిల్లలు పుట్టాక శృంగారంలో వచ్చే మార్పులను మాతో పంచుకున్న 7 మంది మహిళలు

ప్రసవం జరిగిన తర్వాత శృంగారం ఎలా ఉంటుందో అన్న ఆలోచన చాలా మంది మహిళలకు ఉంటుంది. శృంగారంలో  తేడా ఉంటుందా లేక మునుపటిలాగానే ఉంటుందా అన్న విషయాలను కొత్తగా తల్లి అయిన మహిళలు మాతో పంచుకున్నారు. వారి చెప్పిందేంటంటే,

చాలా తొందరగా జరిగింది

‘నేను తల్లి అయిన తర్వాత, 3 వారాల పాటూ శృంగారం చేసుకోకూడదని డాక్టర్ చెప్పారు. అయితే నాకు, మా భర్తకు శృంగారం పట్ల చాలా అసక్తి ఉండటంతో అన్ని రోజులు ఎలా ఉండాలా అని ఆలోచించుకొనేవాళ్ళము. మేము దాదాపు రెండున్నర వారాలు శృంగారం చేసుకోకుండా ఉన్నాము అయితే ఆ తర్వాత ఒక రోజు రాత్రి మా భర్త, నేను అనుకోకుండా పాల్గొన్నాము. శృంగారం పూర్తయ్యే వరకు కూడా మేము ఏమి చేశామని తెలియలేదు. అది మాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’  అని సుహానా అనే మహిళ చెప్పింది.

చాలా నొప్పిగా అనిపించింది

‘మేము శృంగారంలో పాల్గొనడానికి పాటించాల్సిన జాగ్రత్తలు అన్నీ పాటించాము. డాక్టర్ చెప్పినట్లు నెల పాటు దూరంగా ఉన్నాము. నేను పూర్తిగా కొలుకున్న తర్వాతనే ప్రారంభించాము. అయితే, ప్రసవం తర్వాత జరిగిన శృంగారం వల్ల నాకు చాలా నొప్పిగా అనిపించింది. నేను బాగా ఇబ్బంది పడుతుంటే మావారు మధ్యలోనే ఆపేశారు. ఆరోజు నేను చాలా బాధపడ్డాను. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు మేము ఆనందంగా శృంగారం చేసుకుంటున్నాము’ అని ప్రీతి తెలిపింది.

ముందులాగా అస్వాదించలేపోయాను

‘మేము శృంగారం కోసం చాలా వేచి ఉన్నాము. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకు మేము శృంగారంలో పాల్గొన్నాము. అయితే నాకు ముందులాగా గొప్పగా అనిపించలేదు. మా భర్త కూడా మునుపటిలా ఆస్వాదించలేకపోయాడు’ అని రమ్య అనే యువ మహిళ తన అనుభవాన్ని పంచుకుంది.

భర్త నన్ను అర్థం చేసుకున్నారు

‘మేము పాప పుట్టిన చాలా రోజుల తర్వాత శృంగారంలో పాల్గొన్నాము. నిజం చెప్పాలంటే నేను ఎంతో బాగా ఆస్వాదించాను దానికి కారణం మా భర్తే.  ఎందుకంటే అతను నన్ను అర్థం చేసుకొని చాలా నిదానంగా శృంగారం చేశాడు. కాబట్టి ఆ క్రెడిట్ నా భర్తకే’ అని లక్ష్మి అనే మహిళ ఆనందంగా తెలిపింది.

మధ్యలో పాప లేచింది

‘మేము ప్రసవం జరిగిన తర్వాత శృంగారం ప్రారంభించిన కొద్ది సేపటికే మా పాప ఏడవడం మొదలు పెట్టింది. నేను వెంటనే పాప దగ్గరకు వెళ్ళి తన బాగోగులు చూశాను. అప్పుడు నాకు కొంచెం గిల్టీగా అనిపించినా, మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రమే సెక్స్ చేసుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ రావడంతో ఆమెకు పాపను ఇచ్చి మేము ఏకాంతంగా గడిపాము’ అని రోసీ తెలిపింది.

నాకు చాలా నొప్పిగా అనిపించింది

‘మేము శోభనం రోజు ఎలాగైతే ప్లాన్ చేస్తారో అలాగే చేశాము. ఇష్టమైన పువ్వులు, కొత్త బెడ్‌షీట్, బెడ్‌రూమ్ లైట్ వేసి మా భర్త సెక్స్ మొదలు పెట్టగానే, నాకు నొప్పిగా అనిపించింది. మా భర్త అర్థం చేసుకొని వద్దన్నా కూడా నేనే అతనిని బలవంతం చేసి సెక్స్ చేయమన్నా. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎక్కువ నొప్పి కలగడంతో నేను ఏడవడం మొదలు పెట్టాను. చూస్తే, బెడ్‌షీట్ మొత్తం రక్తంతో తడిసింది. నేను ఏడుస్తూ బయటకు వెళ్ళగా, నా భర్త వెనుకే వచ్చి నన్ను ఓదార్చాడు. ఆ తర్వాత వైద్యుని సలాహా మేరకు మేము పాల్గొనడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు’ అని నిర్మలా అనే మహిళ తన స్వీయానుభవాన్ని తెలిపింది.

మేము మరింత ఎంజాయ్ చేశాము

‘బాబు పుట్టిన కొన్ని రోజులకు బాబును మా అమ్మకు ఇచ్చి మేము గత అనుభవం పొందేలా ప్లాన్ చేసుకున్నాము. మాకు స్వతహాగానే కోరికలు ఎక్కువ ఉండటం వల్ల బెడ్‌రూమ్‌లో మొదలుపెట్టి, ఆతర్వాత ఇంటిలో మాకు నచ్చిన ప్రతి చోటా సెక్స్ చేసుకున్నాము. మా భర్త చేసే చిలిపి పనులంటే నాకు చాలా ఇష్టం దీంతో మేము చాలా ఎంజాయ్ చేశాము’ అని కావేరి అనే మహిళ తన అనుభవాన్ని పంచుకుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon