Link copied!
Sign in / Sign up
11
Shares

ప్రసవం తర్వాత శృంగారం ఇలా చేయాలి...

 

ప్రసవం జరిగిన తర్వాత శృంగారం అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయం. మునుపటిలా సులభంగా, ఆనందంగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మునుపటిలా మీరు శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అవేంటంటే,

లూబ్రికేషన్

బిడ్డ పుట్టిన తర్వాత వెజీనా డ్రై అయ్యే అవకాశం ఉంది. మీకు కూడా అలా అనిపిస్తే లూబ్రికేటింగ్ జెల్స్ వాడటం మంచిది. అయితే వెజీనా తడి కోసం కృత్రిమ లూబ్రికెంట్స్ వాడడం కన్నా కొబ్బరినూనె, ఆముదం వంటి సహజమైనవి వాడటం శ్రేయస్కరం. ఇలా చేసిన తర్వాత  కూడా నొప్పిగా ఉంటే డాక్టర్‌ను కలవాలి.

మరీ ఇబ్బందిగా ఉంటే ఆపేయండి

శృంగారం ప్రారంభించే ముందు ఫోర్‌ప్లే చేయడం మంచిది. నిదానముగా  వివిధ భంగిమలు ప్రయత్నించిన తర్వాత మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో దానినే కొనసాగించండి. సెక్స్ లో పాల్గొనే అప్పుడు మీకు నొప్పి కలిగినా, ఏమైనా ఇబ్బందిగా అనిపించినా మీ భర్తకు చెప్పండి, ఆయన అర్థం చేసుకోగలరు. శృంగారం మొదలుపెట్టే కొన్ని రోజుల ముందు నుండి కేగెల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

సన్నిహితంగా మెలగండి

ప్రసవం తర్వాత శృంగారం తిరిగి మొదలు పెట్టినప్పుడు నిదానంగా చేయడం చాలా మంచిది. ముందులాగా శృంగారం చేయడానికి ఇబ్బందిగా ఉంటే మీ భర్తతో రొమాన్స్ చేస్తూ, అతనికి సన్నిహితంగా మెలగండి. కోరికలు తీర్చుకోవడానికి కేవలం సెక్స్ ఒక్కటే మార్గం కాదు. ఫోర్త ప్లే, రొమాన్స్ లాంటివి చేస్తూ మీ శరీరాన్ని సెక్స్ కి రెడీ చేయండి. దీని ద్వారా మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి తొందరలోనే మీరు మునుపటిలా సెక్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు.

బ్రా వేసుకోవడం మంచిది

ప్రసవం తర్వాత మీ చెస్ట్ ఎంత సున్నితంగా మారిందో మీ భర్తకు తెలియచేయండి. వీలైతే అక్కడ చేతులు వేయకండి అని మీ భర్తకు నచ్చజెప్పండి. బ్రా వేసుకొని సెక్స్ లో పాల్గోనడం ద్వారా అక్కడ చేతులు వేయకూడదు అని మీ భర్తకు గుర్తు వుంటుంది.ఒక్కోసారి బ్రెస్ట్ నుండి పాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్రా వేసుకొని శృంగారం చేయడం మంచిది.

అర్థం చేసుకొనేలా మీ భర్తకు వివరించండి

ప్రసవం జరిగిన తర్వాత శృంగారంలో కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఫొర్‌ప్లే చేయమని మీ భర్తకు చెప్పండి. శృంగారం చేసేటప్పుడు మీకు కలిగే అసౌకర్యాన్ని పూర్తిగా వివరించండి. శృంగారం మీద ఎటువంటి అంచనాలూ పెట్టుకోకండి అని చెప్పండి, ఎందుకంటే మీభర్త పూర్తిగా సంతృప్తి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సెక్స్ చేసే ముందు ఒకరికొకరు సన్నిహితంగా మెలగడం వల్ల మంచి అనుభవాన్ని పొందవచ్చు.

మీ పాపను గమనిస్తూ ఉండండి

శృంగార జీవితం అనేది పెళ్ళికి ముందు ఉన్నంత సులభంగా పెళ్ళి తర్వాత ఉండదని గుర్తించండి. మీరు శృంగారం చేసుకొనే సమయంలో మీ పాప ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా చూసుకోండి. మీ బిడ్డ ఆకలి తీర్చడం, నిద్రపుచ్చడం వంటివి అయిన తర్వాతనే మీరు ఇతర విషయాల మీద దృష్టి పెట్టడం మంచిది.

కావల్సినంత సమయాన్ని తీసుకోండి

ప్రసవం జరిగిన తర్వాత మళ్ళీ శృంగారాన్ని మొదలుపెట్టడానికి తగిన సమయం తీసుకోండి. మీరు మానసికంగా, శారీరకంగా సనంద్దమైనప్పుడే తిరిగి సెక్స్ జీవితాన్ని ప్రారంభించండి. కొందరు మహిళలు తిరిగి శృంగారంలో పాల్గొనడానికి నెలల తరబడి సమయం తీసుకుంటారు కాబట్టి మీరు సమయం గురించి, మీ భర్త గురించి చింతించకండి. వీటికి తోడు క్రమం తప్పకుండా వైద్యున్ని సంప్రదించడం మర్చిపోకండి..

కుటుంబ నియంత్రణను పాటించండి

ప్రసవం జరిగిన తర్వాత సెక్స్‌లో పాల్గొనాల్సి వస్తే కుటుంబ నియంత్రణను పాటించడం చాలా మంచిది. మరో బిడ్డ కావాలని మీరు కోరుకుంటున్నా, ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మేలు. ఎందుకంటే, మీరు అప్పటికే శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు మీరు కోలుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి.

ప్రసవానంతరం శృంగార జీవితం ప్రారంభించేటప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మీ భర్త కూడా అంతగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీకు శృంగారంలో అసౌకర్యంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటే త్వరలోనే మీరు మీ మునుపటి శృంగార జీవితాన్ని తిరిగి పొందవచ్చు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon