Link copied!
Sign in / Sign up
6
Shares

బిడ్డకు జన్మను ఇచ్చాక పీరియడ్స్ (నెలసరి) మహిళలలో ఎలా ఉంటుందో తెలుసా..! ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రసవం అయిన తర్వాత కూడా మహిళల శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.  అవి పీరియడ్స్‌కు సంబంధించినవి కూడా అయి ఉండవచ్చు. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో పీరియడ్స్

మహిళలు గర్భాన్ని దాల్చిన తర్వాత ఎటువంటి రక్తస్రావం జరగదు. ఒకవేల జరిగినా చాలా తక్కువగా జరగవచ్చు. మీకు రక్తస్రావం జరుగుతుంది అని అంటే గర్భంలో బిడ్డ లేనట్లే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా కొన్ని సార్లు తక్కువ మోతాదులో బ్లీడ్ అవ్వవచ్చు. ఒకవేల ఎక్కువ బ్లీడ్ జరిగితే వైద్యున్ని సంప్రదించండి.

ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్స్

బిడ్డకు పాలు ఇవ్వని మహిళల్లో 5-6 వారాల తర్వాత పీరియడ్స్ రావచ్చు. బిడ్డకు పాలిచ్చే మహిళల్లో పాలు  ఇవ్వడం ఆపిన తర్వాతనే పీరియడ్స్ వస్తాయి. అయితే ఇది అందరి మహిళల్లో ఒకే రకంగా ఉంటుందని చెప్పలేము. వారి వారి శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు.

రక్తస్రావ ప్రవాహం

ప్రసవం జరిగిన తర్వాత, పీరియడ్స్ అప్పుడు ఎంత మోతాదులో రక్తస్రావం జరుగుతుందనేది చెప్పలేము. ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి చాలా తక్కువ అవ్వచ్చు. మీరు మునుపటిలా సెట్ అవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేకాక, పీరియడ్స్ మధ్య గ్యాప్ కూడా ఒక్కోసారి ఎక్కువగా ఒక్కోసారి తక్కువగా ఉంటుంది.

అండోత్సర్గం మరియు ఋతుస్రావం

ప్రసవం జరిగిన తర్వాత వచ్చే పీరియడ్స్ అప్పుడు అండం శుక్రకణంతో కలిస్తే మళ్ళీ గర్బం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి రుతుస్రావం అప్పుడు జరిపే సెక్స్ పట్ల జాగ్రత్త వహించండి.

పరిశుభ్రత, ఆరోగ్యం

ప్రసవం జరిగిన తర్వాత మీరు చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది. రక్తస్రావం ఎక్కువగా ఉంటే శ్యానిటరీ ప్యాడ్స్ వాడటం మంచిది, ట్యాంపన్స్ వాడకపోవడం మంచిది. ఆ సమయంలో మీరు ఎక్కువ రక్త కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon