Link copied!
Sign in / Sign up
7
Shares

ప్రసవం తరువాత మీ శరీరం గురించి అందరూ చెప్పే ఈ 7 అపోహలను నమ్మకండి

కొత్తగా తల్లి అయిన ప్రతి ఒక్కరి శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అది నిజమే కాని, కొన్ని మూఢ నమ్మకాలను నమ్మి చాలా మంది ఆడవారు  భయపడుతుంటారు. ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఇలా చాలా మంది వివిధ సలహాలు ఇస్తుంటారు. అక్కడితో ఆగకుండా మరెన్నో సందేహాలు రేపుతుంటారు. కొన్ని నిజమైన సందేహాలు మనకు వస్తే, ఎక్కువ భాగం అనవసరమైన సందేహాలు మాత్రమే. ప్రసవం తరువాత మీ శరీరం గురి౦చి ఈ 7 మూఢ నమ్మకాలను వీడండి. అవేంటంటే….


1. బరువు తగ్గడం

డెలివరీ అయిన వెంటనే గర్భం కారణంగా పెరిగిన బరువుని తగ్గించుకోవాలనుకోడం పొరపాటు. అవును, బరువు తగ్గించుకోవాలి కాని వెంటనే కాదు. ఇప్పుడు మీ భారువు తగ్గించుకోవడం కంటే మీ ఆరోగ్యం చూసుకోవడమే మంచిది. కాని చాలా మంది వెంటనే తగ్గించకపోతే ఎప్పటికి తగ్గించలేము అని చెప్తారు. కాని అది తప్పు, ఒట్టి మూఢ నమ్మకం మాత్రమే. కొంచెం సమయం ఇవ్వండి, నిదానముగా బరువు తగ్గించుకోండి. 

2. బరువు తగ్గడం వలన అంతా నార్మల్ అయిపోతుంది.

డెలివరీ తరువాత మన శరీరంలో చాలా మార్పులు కలుగుతాయి. చస్ట్ భాగం పెద్దదిగా అయిపోవచ్చు, నడుము భాగం పెరగొచ్చు లేదా స్ట్రెచ్ మార్క్స్ మీ శరీరం మీద ఉండచ్చు. భయపడకండి, అన్నీ నిదానముగా సాధారణ స్థితికి రప్పించవచ్చు. కానీ వీటన్నిటికీ భారువు తగ్గడం ఒక్కటే పరిష్కారం కాదు.  బరువు తగ్గడంతో పాటు సమన్వయం పాటించడం కూడా అవసరము.

౩. భర్తకి ప్రేమ, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది

ఇలా ఎవరు చెప్పినా నమ్మకండి. ఈ మాట పచ్చి మూఢ నమ్మకం. నిజానికి మీ భర్త మిమల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే, తనకి తన బిడ్డకు ప్రాణం పోసిన తల్లి కంటే గొప్పగా ఎవరు ఉంటారు చెప్పండి.

4. బ్రెస్ట్ ఫీడింగ్

రొమ్ము పాలు ఇవ్వడం ద్వారా మీ అందం తద్దిపోతుంది అనుకోవడం పొరపాటే. నిజానికి, రొమ్ము పాలు ఇవ్వడం పిల్లలకే కాదు, మీకు కూడా మంచిదే. ఎలాగంటే, రొమ్ము పాలు ఇవ్వడం ద్వారా మీ శరీర బరువు తగ్గుతుంది. అంతే కాకుండా, మీ ముఖంలో కల పెరిగి అందంగా కూడా కనపడుతారు.

5. దాచిపెట్టడం

మీకు ఎలాంటి సమన్స్య ఉన్నా మీ భర్తకి తెలియజేయండి. ప్రసవం తరువాత మీ శరీరం లో లానే ఆలోచనల్లో కూడా కొంత మార్పు వస్తుంది. అది మీ భర్త కూడా అర్థం చేసుకోగలరు. కాబట్టి ఏ విషయమైన దాచిపెట్టకండి.

6. జ్ఞాపక శక్తి మందగిస్తుంది

గర్భం దాల్చిన సమయములో మన జ్ఞాపక శక్తి తక్కువుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, వస్తువులను ఒక చోట పెట్టి మర్చిపోవడం వంటివి చేస్తుంటాం. కాన్పు తరువాత అన్ని సర్డుకుంటాయి అని మనల్ని మనమే నమ్మిన్చుకుంటాము. అది నిజమే, ప్రసవం తరువాత మన జ్ఞాపక శక్తి ముందులా మెరుగవుతుంది కాని పిల్లల సంరక్షణలో మనం కోర్పోయే నిద్ర వలన మర్చిపోవడం సంభవిస్తూనే ఉంటుంది. పిల్లలు కొంచెం పెరగగానే అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి భయపడకండి.

7. 6 వారాల తరువాత సఅలా పాల్గొనవచ్చు

ఈ మాట డాక్టర్లే చెప్తారు, మెడికల్ గా కూడా నిజమే. కానీ, చాల మంది మహిళలు 6 వారాల తరువాత కూడా ఇబ్బందిగా మరియు నొప్పిగా ఉంది అని చెప్తుంటారు. మన శరీరాన్ని బట్టి, మన అలవాటులను బట్టి ఏకాంతంలో పాల్గొనడానికి పట్టే సమయం మారుతుంటుంది. కాబట్టి, మీరు మీకు సౌకర్యంగా ఉన్నపుడు మాత్రమే అలా పాల్గొనాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon