Link copied!
Sign in / Sign up
65
Shares

ప్రసవం తరువాత ప్రతి భార్య తన భర్తతో చెప్పాలనుకుని చెప్పలేకపోయే 5 విషయాలు

మీకు ప్రసవం తరువాత మీ భర్త మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుని చెప్పలేకపోతుంటాడు. ఆ సమయంలో చెప్పడం  కర్రెక్టా కాదా,  చెప్తే మీరు ఏమి  అనుకుంటారు అని అలోచించి మధనపడుతుంటాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కావచ్చు లేక మీరు అపార్ధం చేసుకుంటారేమో అని భయంతో కావచ్చు,  తనకి అవసరమైనా ఈ విషయాలు మీ దగ్గర చెప్పలేడు. అవేంటంటే…

1.శృంగారం

ప్రసవం తరువాత మీకు కోరికలు సంనగిల్లిపోయుంటాయి. కానీ, నెలల ఎడబాటు వాలన తను కోరికలు ఆపుకోలేకపోవచ్చు. మీతో ఈ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీనిని మీరు అర్థం చేసుకుని మీ భర్తతో ఈ విషయం గురించి మాట్లాడండి. మీరు ఇంకా సిద్దంగా లేకపోతే తనకి వివరించి ఒక నిర్ణయానికి రండి. తగిన సమయములో మొదలు పెడదాము అని చెప్పి తన నిరీక్షనని తగ్గించండి.

2.శరీరాకృతి

ప్రసవం తరువాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు. అది చాలా సహజం కూడా. మీరు మీ భర్త దీని గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకోవద్దు. ఈ విషయం తనని ఇబ్బంది పెట్టదు. కానీ మీరే మీ శరీరాన్ని మునుపటిలా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

౩. మెచ్చుకోవడం

మీరు పిల్లల సంరక్షణ చుసుకుంటున్న సమయంలో మీ బాగొగులు చూసుకోవాల్సిన భాద్యత మీ భర్తది. అతను తన భాద్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు మీరు తనని మెచ్చుకోండి. అలా చేస్తే మీకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని ఆనందిస్తాడు. మీరు మెచ్చుకోవాలని తను కోరుకోవకపోవచ్చు, కానీ మంచి పనిని మెచ్చుకోవడం మీ భాద్యత. ఒక చిన్న ముద్దు లేకపోతే ఒక పొగడ్త చాలు తనని సంతోష పరచడానికి.

4.ఏకాంత సమయము

సాధారణంగా మగ వారు ఏకాంత సమయం కావాలనుకుంటారు. కానీ, మీ ప్రసవం కారణంగా అతను ఇంట్లోనే ఉండి మీతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు తనని అర్థం చేసుకొని మీకు పర్లేదు అనుకున్నప్పుడు తనకు కొంచెం ఏకాంత సమయం ఇవ్వండి. తన అలవాటుగా  చేసే మంచి పనులను ప్రోత్సహించండి.

5.ఆర్ధిక పరిస్తితి

భర్తగా తనకి ఎన్ని కస్టాలు ఉన్నా మీకు, బిడ్డకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలి అని అనుకుంటాడు. ప్రసవం జరిగిన తర్వాత మీరు ఏమి అడిగినా కాదనకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. హాస్పిటల్ కర్చులు, అధిక కర్చుల వలన ఆర్ధిక పరిస్తితి అంత బాగాలేకపోవచ్చు కాని మిమ్మల్ని బాదపెట్టడం ఇష్టంలేక ఇబ్బంది పడి అయిన మీకు కావలసినవి సమకూరుస్తుండచ్చు. కాబట్టి మీరు ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం మంచిది.

పైన చెప్పినవి మీ భర్త మీతో చెపచ్చు, చెప్పకపోవచ్చు కాని ఇవి తెలుసుకోవడం మీకు చాలా అవసరం. అతని ఆలోచనలు అర్థం చేసుకుని తనకి అండగా నిలిస్తే మీ వివాహిక జీవితం మరింత మధురంగా తయారవుతుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon