Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవం తరువాత కూడా రక్తస్రావం గురించి ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి


కొత్తగా తల్లి అయిన చాలా మందికి ప్రసవం తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అందరికి తెలీదు అని చెప్పట్లేదు కానీ ఎక్కువ శతం మందికి తెలీదు అని చెప్తున్నాము. ప్రసవానంతరం మీకు ఎన్నో ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు, కొన్ని శరీరానికి ఇబ్బంది కరిగించే విషయాలు జరగవచ్చు. ఉదాహరణకి మీ చేతుల్లో బుజ్జి పాపాయి, మీ కడుపులో నుంచి వచ్చిన బిడ్డ ఉండడం అంతా కలలా ఉండి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, శారీరకంగా జరిగే మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

ఏదేమైనా ఈ మార్పులు సంభవించక తప్పదు. మనం చేయగలిగినది మాత్రం వాటిని తెలుసుకొని అటువంటి అవాంతరాలు జరగకుండా సిద్ధంగా ఉండడమే.

ప్రసవం తరవాత రక్తస్రావం జరగడమనేది ప్రముఖమైన మార్పు. ఇది సాధారణం కూడా, కాబట్టి భయపడకండి. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము.

1. రక్తస్రావం సహజమే

అవును. ప్రసవం తరువాత ప్రతి మహిళకి ఇది అత్యంత సాధారణంగా జరిగే ప్రక్రియ. డాక్టర్లు కూడా ముందుగానే ఈ విషయం మీకు చెప్తారు. కొన్ని సార్లు మర్చిపోయుండచ్చు కూడా.ఈ విషయం తెలీకుండా రక్తస్రావం జరుగుతున్నందుకు బాధ పడుతున్నారా? అవసరం లేదండి, ఇది మామూలు విషయమే. ప్రెగ్నన్సీ సమయంలో శరీరంలో రక్త శాతం అత్యధికంగా పెరుగుతుంది. అందుకే ప్రసవం తరువాత రక్తస్రావం జరుగుతుంది.

2. ఎన్ని రోజులు జరుగుతుంది?

ప్రసవం తరువాత రక్త స్రావం సాధారణంగా 10 రోజుల వరకు జరుగుతుంది. కానీ కొంత మందిలో అది నాలుగు వారల వరకు కూడా పెరగవచ్చు. మొదట్లో రక్తస్రావం అధికంగా ఉంటుంది, నిదానంగా రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. మొదటి రెండు రోజులు రక్తం మరియు కణజాలం బయట వచ్చేస్తాయి,. తరువాత కొద్ది కొద్దిగా రక్త స్రావం జరుగుతూనే ఉంటుంది.

3. దీనిని ఎలా అధిగమించాలి లేదా ఎలా తగ్గించాలి?

మొదట్లో, మందమైన శానిటరీ ప్యాడ్స్ వాడండి. తరువాత రక్తస్రావం బట్టి పల్చటి లేదా మందమువి వాడండి. మొదటి 6 వారాలలో టాంపూన్స్ అస్సలు వాడకండి. అంతే కాకుండా, తరచుగా బాత్రూం వెళ్లడం మంచిది. ఇలా చేయడం ద్వారా గర్భాశయం ఒత్తిడికి గురవ్వకుండా ఉంటుంది.

4. శుభ్రత

ఇది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. తప్పకుండ మీ సున్నితమైన భాగాలని శుభ్రంగా బాక్టీరియా వంటివి రాకుండా చూసుకోండి. టాంపూన్స్  వాడకుండా ఉండడానికి ఒక ముఖ్య కారణంకూడా ఇదే, శుభ్రత. మీకోసం ప్రత్యకంగా సోపు, టవల్ కొనుక్కోండి. ఇంట్లో మరెవరివి వాడకండి, మీ వస్తువులను వాడనివ్వకండి.

5. వైద్య సహాయం

రక్తస్రావం అనేది సాధారణ ప్రక్రియే కావచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ,  జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది. ఎక్కువగా రక్త స్రావం జరిగినప్పుడు తప్పకుండ డాక్టర్ని సంప్రదించాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon