Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవం తరువాత 70 శాతం మహిళలు డిప్రెషన్ కు గురవుతున్నారు : అందుకు కారణాలు ఇవే

ప్రసవం తరువాత మీలో జరిగే మార్పులంటే కేవలం శారీరక మార్పులు మాత్రమే కాదు, మానసిక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనిని పోస్టనాటల్ డిప్రెషన్ (Postnatal difference) ప్రసవానంతర డిప్రెషన్ లేదా ప్రసవానంతర కలిగే ఆందోళన అని అనవచ్చు. ఇది సాధారణంగా జరిగే విషయమే.ప్రసవానంతర డిప్రెషన్ కు గల కారణాలు :

1.హార్మోన్లు 

హార్మోన్లలో కలిగే మార్పులు మీ మూడ్స్ లో విపరీతమైన మార్పులను కలగచేస్తాయి. హార్మన్లు కొన్ని సమయాల్లో విపరీతంగా విడుదలవడం. మరి కొన్ని సమయాల్లో తక్కువ విడుదలవడం. మెదడులోని భావాలను అస్తవ్యస్తం చేస్తాయి. 

2. కొత్తగా పుట్టిన బిడ్డ 

పుట్టిన బిడ్డతో  గడపడం అనేది కొంచెం కష్టమైనా విషయమే అంతే కాకుండా జీవితం లో ఎన్నో విషయాలు ఒకేసారిగా మారుతుంటాయి . అది విపరిమతమైన ఆందోళన కలిగిస్తుంది.

3. నిద్ర 

బిడ్డ పుట్టిన తర్వాత మీరు కొంత నిద్రను కోల్పోవాల్సి ఉంటుంది.  నిద్రలేమి మీ మెదడు మరియు శరీరం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది కూడా డిప్రెషన్ కలిగించవచ్చు.

4. చిన్న వయసులో 

 ఒక వేళ మీరు చిన్న వయసులోనే బిడ్డకు జన్మనిస్తే అది మీ మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది.  చిన్న వయసు లోనే తల్లి కావడం భయపెట్టవచ్చు. మీరు ఆ విషయం గురించి ఉతేజవంతగా ఉండవచ్చు కానీ అది కొన్ని సార్లు డిప్రెషన్ కూడా కలిగిస్తుంది.

5. తక్కువ ఆత్మవిశ్వాసం

చాలా మంది పిల్లలు పుట్టాక, మంచి అమ్మ అవ్వగలమా లేదా అని ఆలోచిస్తూ బాధపడుతారు. ముందుగా మిమల్ని మీరు నమ్మాలి. ఇది ఒక మంచి తల్లి అవడానికి యొక్క మొదటి లక్షణం. ఇది డిప్రెషన్ ను నియంత్రిస్తుంది.

6.సిజేరియన్

ప్రెగ్నన్సీ సమయంలో ప్రతి మహిళ కోరుకునేది తనకు సాధారణ కాన్పు జరగాలని. కానీ సిజేరియన్ చేయాల్సి రావచ్చు.  మీరు ఎదురు చూడని ఈ పరిణామం మిమ్మల్ని కొంత మానసికంగా బాధకు గురి చేయచ్చు.  కానీ జరిగిపోయిన సిజేరియన్ కాకుండా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని, త్వరగా కోలుకోవడానికి ప్రయత్నించండి. 

డిప్రెషన్ వంటి ఎటువంటి గుర్తులు లేకపోయినా స్త్రీలను ప్రసవం అయినా ఒకటి రొండు నెలలు అయ్యేదాకా తరచూ డాక్టయారు దగ్గరకి తీసుకువెళ్తూ ఉండటం మంచిది.

7. మూడ్

డిసార్డర్స్ గురించి తెలియపరచాలి. హార్మోన్ల వల్ల కలిగే మార్పులు వల్ల ప్రసవం అయిన ఒక ఏడాది వరకు మూడ్ స్వింగ్స్ లేదా డిప్రెషన్ కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తల్లులకు మైల్డ్ - డిప్రెషన్ లాంటిది పిల్లలు పుట్టిన వెంటనే సంభవించవచ్చు. ఇది కొన్ని గంతలు లేదా కొన్ని వరాల వరకు ఉంటుంది. దీని చికిత్స వంటిది అవసరం లేదు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon