Link copied!
Sign in / Sign up
22
Shares

ప్రసవం తరువాత ఈ 7 లక్షణాలు కనిపిస్తే మీ గైనకాలజిస్ట్ ను తప్పకుండా కలవాలి


గర్భవతి అయినప్పటి నుంచి ప్రసవం వరకు అన్ని విషయాలలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ప్రసవం తరువాత కూడా ఎదురుకోవలసిన కొన్ని సమస్యలు మిగిలే ఉంటాయి. మీ శరీరం, మీ మెదడు, కొత్త మార్పులకు అలవాటుపడడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకున్న సమాచారం మేరకు జాగ్రత్తలు, చిట్కాలు పాటించచ్చు. కానీ మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ ను తప్పనిసరిగా కలవాల్సుటుంది. అలాంటి ప్రధానమైన 7 లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

1.తీవ్ర జ్వరం

తీవ్ర జ్వరం, పొత్తి కడుపులో నొప్పి, వనకడం, లాంటి లక్షణాలు చాల ప్రమాదకరమైనవి. ఈ లక్షణాలు సిజేరియన్ ప్రసవం జరిగిన వాళ్లలో సహజంగా కనిపిస్తాయి. సిజేరియన్ ద్వారా అయిన గాయం మానకపోవడం, యోని లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిస్తాయి. అంతే కాకుండా మూత్రనాళాల ఇన్ఫెక్షన్(UTI) ప్రారంభ దశలో వున్నపుడు ఈ లక్షణాలతో పాటు, మూత్ర విసర్జనప్పుడు మంటగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ లన్ని చాల త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్ ను కలవండి.

2.శ్వాస కష్టంగా తీసుకోవడం

మెట్లు ఎక్కేటప్పుడు, లేదా ఏదైనా పనిచేసాక శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం సహజమే. కానీ పనులు పూర్తి చేసాక, విశ్రాంతి తరువాత కూడా శ్వాసలో ఇబ్బందిగా ఉంటే, అది ఊపిరి తిత్తుల సమస్య ( pulmonary embolism ) వున్నపుడు కనిపించే లక్షణం. ఊపిరి తిత్తుల ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం వలన ఈ సమస్య వస్తుంది. ఈ లక్షణం వున్నపుడు గైనకాలజిస్ట్ ను కలవడం తప్పనిసరి.

3.చాతి నొప్పి

చాతి లో బరువుగా అనిపించడం, లేదా నొప్పిగా ఉండడం,ఊపిరితిత్తుల సమస్యను సూచించే లక్షణాలు. కొన్ని సార్లు ఎక్కువగా పని చేయడం కూడా ఈ లక్షణాలకు కారణం కావచ్చు. చాతి నొప్పి ఎక్కువగా వున్నా, దగ్గినప్పుడు రక్తం పడినా, వైద్యులను కలవడం మంచిది.

4.తలనొప్పి

ప్రసవం జరిగేటప్పుడు, నొప్పులు తగ్గించడానికి చేసే ఎపిడ్యూరల్ (epidural) , మత్తు మందు ఇచ్చే విధానం,ప్రసవం తరువాత  తలనొప్పికి కారణం కావచ్చు. కొన్ని సార్లు మైగ్రెన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పితో పాటు వికారం, వాంతులు, మైకం, చూపు మసక బారడం, లాంటి లక్షణాలు కూడా కనిపిస్తే, అవి ప్రీ-ఏక్ లాంప్సియా (pre-eclampsia)ను సూచిస్తున్నాయి. ఈ లక్షణాలు ఉంటె గైనకాలజిస్ట్ ను కలవడం చాలా అవసరం.

5.తీవ్ర రక్తస్రావం

ప్రసవం తరువాత రక్తస్రావం అందరికి జరిగే విషయమే. ఏదేమైనా రక్త స్రావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే అది హెమరేజ్ (haemorrhage) అయ్యే అవకాసం వుంది. ఒక గంట లోపల సానిటరీ ప్యాడ్ మొత్తం రక్తం అవ్వడం, యోని నుండి గడ్డ కట్టిన రక్తం రావడం లాంటివి జరిగితే అది సాధారణ రక్తస్రావం కాదు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే  గైనకాలిజిస్టు ను కలవాలి.

6.పిక్కల నొప్పులు

చాల మంది పిక్కల నొప్పులకు అధిక బరువు కారణం అనుకుంటారు. కొన్నిసార్లు పిక్కల నొప్పులు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. పిక్కల నొప్పులు తీవ్రంగా వున్నా, వాచినా, ఎర్రగా కందిపోయి తాకితే వెచ్చగా అనిపించినా, ఇవన్నీ సిరల్లో రక్తం గడ్డకట్టడం (Deep Vein Thrombosis,DVT) యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు వున్నపుడు వైద్యులను కలవడం మంచిది.

7.ఆందోళన

ప్రేగ్నన్సి నుండి ప్రసవం వరకు మీరు ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదురుకుంటారు. ఇవన్నీ మీ శరీరం మీద మాత్రమే కాకుండా భావోద్వేగాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. నిద్రపట్టక పోవడం, ఉన్నటుండి ఉలిక్కిపడడం, భ్రమలకు గురవ్వడం లాంటి లక్షణాలు మానసిక వ్యాధులకు కారణం అవుతాయి. ఇలాంటి లక్షణాలున్నపుడు వైద్యులు పర్వేక్షణ అవసరం. మీ గైనకాలజిస్ట్ ను కలిసి, వారి సలహా మేరకు ఎవరైనా సైకియాట్రిస్ట్ ను సంప్రదించాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
75%
Wow!
25%
Like
0%
Not bad
0%
What?
scroll up icon