Link copied!
Sign in / Sign up
5
Shares

ప్రసవం కోసం హాస్పిటల్ కు వెళ్ళేటప్పుడు మీతో తప్పకుండా ఉండాల్సిన 10 వస్తువులు

9 నెలల ప్రెగ్నన్సీ సమయం ముగిసిన తరువాత, ఇక మిగిలింది ప్రసవం. ప్రసవం కోసం మీరు చేయాల్సిన పని ఒక మంచి హాస్పిటల్ ను ఎంచుకోవడం. కానీ అంతటితోనే మీ పని పూర్తయినట్టు కాదు. మీ ప్రసవం సురక్షితంగా, ఏ సమస్య లేకుండా జరగాలంటే, మీకంటూ కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పకుండా మీతో పాటు ఉండాలి. అవి మీకు ఏ సమయంలోనైనా అవసరమవుతాయి. ప్రసవం కోసం హాస్పిటల్ కు వెళ్ళేటప్పుడు మీతో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు ఇవే…

1. ఫోన్ చార్జర్

దీనిని తప్పకుండా తీసుకువెళ్ళండి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీ ఫోన్ లో చేరఁగింగ్ లేకుండా మీరు ఇబ్బంది పడకూడదు.

2. మొబైల్

హడావుడిలో మర్చిపోతారేమో ముందే తీసిపెట్టుకోండి.

3. స్లిప్పర్స్

ఇవి మీకు ప్రసవం తరువాత తప్పకుండా అవసరమవుతాయి. హాస్పిటల్ లో క్రీములు నుండి రక్షించుకోడానికి అవి అవసరం.

4. స్వెటర్స్

ప్రసవం తరువాత శరీరం బలహీనంగా ఉంటుంది. చలి నుంచి కాపాడుకోడానికి స్వెటర్ తప్పని సరి.

5. బట్టలు

ప్రసవం తరువాత మీరు ఎక్కువ రోజులు హాస్పిటల్ లో ఉండాల్సి రావచ్చు. అందుకు తగిన బట్టలు తీసుకెళ్ళండి.

6. డైపర్స్

ఇవి మీకు పుట్టబోయే బిడ్డకు చాలా అవసరం. తప్పకుండా తీసుకువెళ్ళండి.

7. బట్టలు

ఈ బట్టలు మీ కోసం కాదు. పుట్టబోయే బిడ్డ కోసం. బిడ్డ పుట్టిన తరువాత తెచ్చుకోవడం కన్నా, ముందే తీసిపెట్టుకోండి.

8. చేతి తొడుగులు

పిల్లలు పుట్టిన తరువాత ఏడ్చేటప్పుడు లేదా ఎప్పుడైనా చేతులను ముఖం మీద ఉంచినప్పుడు గోర్లు గీసుకోవచ్చు. ఇది జరగకుండా ఉండాలంటే ఈ చేతులు తొడుగు పిల్లలకు అవసరం.

9. దుప్పట్లు

హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు అక్కడి దుప్పట్లు మీకు నచ్చకపోతే, లేదా బాలేకపోతే, వాడుకోవడానికి మీకు దుప్పట్లు కావాలి. అందుకే వీటిని తీసుకెళ్లండి.

10. టవల్స్

వీటిని మర్చిపోకండి  చాలా అవసరం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon