Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా రావడానికి 7 కారణాలు : ఈ చిట్కాలు నొప్పుల నుండి రిలీఫ్ ఇస్తాయి

ఈ ప్రపంచంలో అన్ని నొప్పులకంటే బిడ్డకు జన్మను ఇచ్చే సమయంలో తల్లి పడే ప్రసవ నొప్పులు తట్టుకోవడం ఒక్క మహిళలకే సాధ్యం అని అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే మనం మన అమ్మలకు జీవితాంతం ఈ ఒక్క విషయానికే రుణపడి ఉండవచ్చు. అసలు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా ఎందుకు వస్తాయి, ఎక్కువ నొప్పులు లేకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం..

గర్భాశయ సంకోచం

బిడ్డకు జన్మను ఇచ్చే పవిత్రమైన గర్భాశయ ద్వారం బలహీనంగా ఉండటం వలన ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా రావడానికి ఒక కారణం. సాధారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్రగ్నన్సీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన లేదా ఇంకే కారణాలవలనైనా 6 నుండి 10 గంటలు లేదా 6 గంటల పాటు నొప్పులు కలుగుతాయట. కొందరిలో మాత్రం నొప్పులు రావడానికి చాలా సమయం పడుతుంది.

బిడ్డ బరువుతో లావుగా

మీ గర్భం నుండి ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న బిడ్డ అధిక బరువుతో గానీ లావుగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

నిద్రించే పొజిషన్

ప్రగ్నన్సీ సమయంలో మీరు పడుకునే విధానం, నిద్రించే సమయం కూడా ప్రసవ సమయంలో నొప్పులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మీ కడుపును ఎప్పుడు తాకించకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గర్భంతో ఉన్నప్పుడు మంచి నిద్ర, ఎక్కువ నిద్ర అవసరమే. అలాగే మీరు వ్యాయామం చేయడం మరియు వాకింగ్ చేయడానికి కూడా కాస్త టైం కేటాయించాలి.

తల

బిడ్డ ప్రసవించే సమయానికి తల ముందుకు వస్తూ బయటకు రావడం జరుగుతుంది. ఐతే కొన్నిసార్లు తలపై భాగంలో ఉండి కాళ్ళు ముందుకు వస్తుంటాయి. అటువంటప్పుడు నొప్పులు ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే ఈ నొప్పులు మరీ అధికంగా ఉంటే డాక్టర్లు సిజేరియన్ సలహా ఇస్తారు.

అండాశయం చిన్నదిగా

కొంతమందిలో గర్భాశయం చిన్నదిగా ఉండటం వలన బిడ్డ బయటరావడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు మరియు చేరుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇటువంటప్పుడు ఆ మహిళకు నొప్పులు ఎక్కువగా రావడం జరుగుతుంది.

బిడ్డ అడ్డం తిరిగినప్పుడు

ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగాడని డాక్టర్లు చెబుతూ ఉంటారు కదా.. అంటే తన స్థానభ్రంశం సరిగ్గా లేకపోవడం, పేగు అడ్డుగా ఉన్నప్పుడు తల్లికి ఎక్కువ నొప్పులు మరియు బిడ్డకు ప్రమాదం ఉన్నట్లయితే వెంటనే సిజేరియన్ సలహా ఇస్తారు వైద్యులు.

మీరు తీసుకునే ఆహారం

అవును నిజమే మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు, పౌష్టిక ఆహారం సరిగ్గా లేకపోవడం, రక్త వృద్ధిని పెంచే ఆహారాలు లేకపోతే ప్రసవ సమయంలో నొప్పులు, రక్తహీనత రావడానికి కారణమవుతుంది. అందుకని సరైన ఆహారం సరైన సమయానికి తీసుకోవడం ఉత్తమం.

దయచేసి ఈ విషయాలు అందరికీ SHARE చేయగలరు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon