Link copied!
Sign in / Sign up
4
Shares

ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే 7 సమస్యలు

గర్భం దాల్చడం మరియు ప్రసవం అనేది స్త్రీ జీవితంలో మరొక జన్మగా చెప్పవచ్చు. దీని తరువాత ఆమె శరీరంలో ఎన్నో మార్పులు మరియు ఎన్నో రకాల  సమస్యలు కలుగుతాయి.వాటిని అదిగమించటానికి అనుసరించాల్సిన సూచనలు మరియు పాటించాల్సిన ఆహార నియమాలు సరి అయిన రీతిలో తీసుకోవాలి. సాధారణంగా గర్భాధారణ సమయంలో వచ్చు సమస్యలు

వికారం మరియు వాంతులు

గర్భిణీ స్త్రీలకు వికారం మరియు వాంతులు సర్వ సాధారణం. మహిళలు గర్భందాల్చిన సమయంలో ఎక్కువగా బాధించే సమస్య వేవిళ్ళు. ఈ వేవిళ్ళ వల్ల కొందరు బాగా నీరసపడిపోతారు. నోటికి రుచికరంగా ఉండే ఆహారం తీసుకున్నప్పటికీ.. అవి వెంటనే వాంతుల రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ వేవిళ్లు కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఆస్పత్రుల్లో కూడా చేరాల్సి ఉంటుంది. కొందరికి గర్భం ధరించనప్పటి నుండి ప్రసవం అయ్యేంత వరకూ ఈ వేవిళ్ళు బాధిస్తుంటాయి. అయితే, ఈ తరహా ఇబ్బందులు ప్రతి గర్భిణిలోనూ ఉండవని వైద్యులు అంటున్నారు.

సాధారణంగా గర్భిణీ స్త్రీలకు కలిగే వేవిళ్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది సాధారణ వాంతులు, రెండవది తీవ్రమైన వాంతులు అని పిలుస్తారు. సాధారణ వేవిళ్ళనే మార్నింగ్ సిక్‌ నెస్ అని కూడా పిలుస్తుంటారు. మార్నింగ్ సిక్ నెస్ కు డాక్టర్ ను సంప్రదించడం పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. అయితే రెండోరకం వాంతులు మాత్రం కొద్దిగా ప్రమాదకరమైనవే. ఈ వాంతుల లక్షణాలను పరిశీలిస్తే...

 ప్రీ ఎక్లమ్ప్సియా

తీవ్రమైన తలనొప్పి, కంటి చూపులో సమస్యలు, కడుపులో నొప్పి వంటివి మూడవ త్రైమాసిక దశలో కలుగుతాయి, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి మరియు ప్రాణాంతకరం అని చెప్పవచ్చు. అధిక రక్త పీడనం మరియు మూత్రంలో ఎక్కువ శాతం ప్రోటీన్ వంటివి ఉండటం వలన ఇలా జరగవచ్చు, సాధారణంగా ఇలా 20 వారంలో జరుతుంది. కావున క్రమంగా మీ రక్త పీడన్నాన్ని చెక్ చేపించుకోండి.

నీరు చేరటం

గర్భిణుల పాదాల వద్ద తడిగా కనిపించటం చాలా సాధారణం. కారణం గర్భ సమయంలో వారి మూత్ర సంచి నిండి ఒత్తిడిగా ఫీల్ అయి మూత్రం భయటకు వస్తుంటుంది. కొన్ని సమయాల్లో వారి శరీరంలో పొరలు ప్రమాదానికి గురవటం వలన ద్రావనాలు భయటకు వస్తుంటాయి.  కావున లీక్ అయ్యే ద్రావనాలు మూత్రమా? వేరే ఇతర ద్రావణాల అని తెలుసుకోవాలి. ఎలాంటి సమస్యలు కలిగిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

గర్భాధారణ డయబెటిస్

కొంత మంది మహిళల్లో గర్భాధారణ సమయంలో రక్తంలో సుగర్ అధికమౌతుంది. ఒకవేల ఇదే జరిగితే ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా మారుతుంది. ఒకవేల మీకు ఏవైనా అనుమానాలు వస్తే వైద్యున్ని సంప్రదించాలి. దీని వల్ల తల్లితో పాటూ బిడ్డ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందస్తుగా కనుకోవడం వల్ల ఏదైనా చేయడానికి వీలవుతుంది.

పెల్విక్ కండర సంకోచాలు

సాధారణంగా ప్రెగ్నెన్సీ కలిగిన మహిళల్లో, 3వ త్రైమాసికంలో పెల్విక్ కండరం సంకోచం చెందుతూ ఉంటుంది. అయితే, మీరు తిరిగి తగినంత నీరు తీసుకున్న తర్వాత ఇది ఆగిపోవచ్చు. కానీ ఆగకుండా అలాగే సంకోచం చెందుతూ ఉంటే మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

అధిక రక్త పీడనం

మీగుండె శరీరంలో అన్ని భాగాలకు రక్తం పంపినట్లే పిండానికి కూడా రక్తం పంపాలి. అయితే, పిండానికి రక్తం పంపడానికి ఇబ్బంది కలిగినప్పుడు గుండె అధిక వేగంతో రక్తాన్ని పంపిస్తుంది. అప్పుడు శరీరంలో రక్త పీడనం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడానికి అప్పుడప్పుడు డాకటర్ వద్దకు వెల్తూ ఉండాలి.

స్రావం

మొదటి త్రైమాసిక గర్భస్థ దశలో కడుపులో నొప్పి, తిమ్మిరులు వంటివి కలిగితే మాత్రం అది 'ఎక్టోపిక్ ప్రేగ్నేన్సి'గా చెప్పవచ్చు. గుడ్డు యోనిలో ఫలదీకరనం చెందకుండా వేరే స్థలంలో ఫలదీకరనం చెందటం వలన ఎక్టోపిక్ ప్రేగ్నేన్సి కలుగవచ్చు. తిమ్మిరులతో కూడిన అధిక స్రావాన్ని గర్భస్రావానికి ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఇలా మూడవ త్రైమాసిక దశలో జరిగితే 'ఎబార్షన్' చేయవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో అత్యవసర మందులు అవసరం. ఇలాంటిబి కలిగినట్లయితే వెంటనే వైద్యుడిని కలవటం చాలా మంచిది.

 
Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon