Link copied!
Sign in / Sign up
6
Shares

ప్రసవం సమయంలో కచ్చితంగా ఉండాల్సిన వస్తువులు


ప్రగ్నెన్సీ అన్నది చాలా సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ, మహిళలు చాలా అసౌకర్యానికి గురి అవ్వాల్సి రావచ్చు. మరీ ముఖ్యంగా శరీరం విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు. శరీరంలో వచ్చే మార్పుల వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ప్రగ్నెన్సీ సమయంలో మీ శరీరానికి కావల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటి వల్ల మీకు ప్రెగ్నెన్సీ సులువుగా అనిపించవచ్చు.

పొట్ట దగ్గర ఆయిల్‌తో మర్ధన చేయడం

ప్రగ్నెన్సీ సమయంలో బాగా మార్పు వచ్చే శరీర భాగం పొట్ట. కడుపు చాలా విశాలంగా వ్యాకోచిస్తుంది. అయితే, చర్మం ఎప్పుడైతే సాగుతుందో అప్పుడు అక్కడ డ్రైనెస్ తగ్గిపోతుంది తద్వారా దురద వస్తుంది. దురదతో పాటూ కడుపు చుట్టూ వాతలులాగా వచ్చే అవకాశం ఉంది. దురద తగ్గడానికీ మరియూ వాతలు రాకుండా ఉండడాటానికి బయో ఆయిల్‌తో పొట్ట భాగాన మర్ధనా చేయాలి.

సౌకర్యంగా ఉండే ప్యాంట్స్ వాడటం

పొట్ట భాగం పెరిగినప్పుడు నడుము కూడా కొంతవరకు పెరుగుతుంది దీంతో మీకు ఉన్న దుస్తులన్నీ టైట్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి బెల్లీని సపోర్ట్ చేసే ప్యాంట్స్ ఇప్పుడు మార్కెట్‌లో లభ్యం అవుతున్నాయి. వాటిని వాడటం వల్ల మీరు ప్రత్యేకంగా మోయాల్సిన బరువు కొంత వరకు తగ్గుతుంది. అంతేకాక, ఇవి చాలా మెత్తగా ఉండటంతో పాటూ, మీ రోజు వారీ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటాయి.

బెల్లీ సపోర్ట్ బ్యాండ్స్

పొట్ట భాగం పెరిగే కొద్దీ వెన్నునొప్పి, మరియూ ఇతర భాగాల దగ్గర నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టీ పొట్ట భాగాన్ని సపోర్ట్ చేసే బ్యాండ్స్ ఉంటాయి. వీటిని వేయడం వల్ల మీ శరీరానికి ఒక షేప్ రావడమే కాక, ఇతర శరీర భాగాల మీద ఒత్తిడి తగ్గుతుంది.

మీకు కావల్సిన పోషకాలు తీసుకోండి

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ డైట్ చాలా మారుతుంది. మీరు మునుపటి లాగా అన్ని పధార్థాలు తినలేకపోవచ్చు. అంతేకాక, మీ కడుపులో ఉన్న పాప కోసం మీ శరీరంలోని చాలా పోషకాలు ఖర్చు చేయాల్సి రావచ్చు దీంతో మీకు పోషకలేమి ఏర్పడుతుంది. మీరు సమతుల్యం పాటించాల్సిన విటమిన్స్ ఏవంటే, కాల్సియం, విటమిన్-ఏ, విటమిన్-డి మరియూ ఫ్యాటూ యాసిడ్స్. వైద్యున్ని సంప్రదించి ఇవి ఉండే ట్యాబ్లెట్స్‌ను వాడటం లేదా ఆహారం తీసుకోవాలి.

సౌకర్యమైన షూ వాడటం

ప్రగ్నెన్సీ సమయంలో మీరు నడిచేటప్పుడు సౌకర్యంగా ఉండటానికి మంచి షూ తెచ్చుకోవడం మంచిది. వీని వల్ల మీ శరీరానికి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మీకు ఒకవేళ వాకింగ్ చేసే అలవాటు ఉంటే కొంత దూరం రోజూ నడవచ్చు దీని వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు కదలిక వచ్చినట్లు అవుతుంది. ఒకవేల మీకు షూ సౌకర్యంగా లేకపోతే మంచి చెప్పులు కూడా ఉపయోగించవచ్చు.

బేబీ పిల్లో ఉపయోగించడం

ప్రగ్నెన్సీ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మరో విషయం నిద్ర. ఏ కోణంలో పడుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్పలేము. ఒకవేల మీరు సైడ్‌కు పడూకుంటే మీ పొట్ట కిందకు ఆనే అవకాశం ఉంది ఇది బాబుకు ఎంతమాత్రమూ మంచిది కాదు. కాబట్టి బేబీ పిల్లోస్ వాడటం మంచిది. ఈ దిండు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో భాగాలకు ఒక సపోర్ట్‌లా ఉంటుంది. దీంతో మీకు నచ్చినట్లు మీరు పడుకోవచ్చు.

సరిపోయే బ్రాస్ తెచ్చుకోవడం

శరీరంలో పొట్ట తర్వాత మార్పు వచ్చే భాగం ఏదంటే వక్షోజాలు. ప్రగ్నెన్సీ సమయంలో ఇవి కొందరకీ పెద్దగానూ మరి కొందరికి చిన్నగానూ మారుతాయి. ఈ సమయంలో ఇవి కూడా పాల ఉత్పత్తిలో నిమగ్నమై ఉంటాయి. కాబట్టి ఇవి సౌకర్యంగా ఉండటానికి మీకు సరిపోయే బ్రాస్ తెచ్చుకోవాలి. సౌకర్యవంతమైన బ్రాస్ ఉపయోగించడం వల్ల వాటి మీద ఒత్తిడి ఉన్నట్లు మీకు అనిపించదు.

ప్రగ్నెన్సీ సమయంలో ఈ అన్ని వస్తువులను మీరు కొనాల్సి వస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon