Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రసవ సమయంలో బిడ్డ ఇరుక్కుపోవడానికి 5 కారణాలు


ప్రెగ్నన్సీ తో ఉన్న ప్రతి మహిళ కోరుకునేది తన డెలివరీ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరగాలని. తన కడుపులోని బిడ్డ ఏ సమస్య లేకుండా ఈ భూమి మీదకు రావాలని. అందుకు సహజ కాన్పయితే అనుకూలంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ సహజ కాన్పులో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని సార్లు బిడ్డ ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకు కారణాలు ఇవే…

1. చిన్నగా ఉండడం

కాన్పు సమయంలో బిడ్డ యోని మార్గం ద్వారా బయటకు వస్తాడు. ఒకవేళ మీ యోని మార్గం చిన్నదిగా ఉండి, బిడ్డ పెద్దగా ఉంటే, కాన్పు సమయంలో బిడ్డ ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సిజేరియన్ ద్వారా ప్రసవం చేయాల్సి ఉంటుంది.

2. బిడ్డ అడ్డం తిరగడం

సాధారణంగా బిడ్డ తల కింద వైపుకు ఉంటే, సహజ కాన్పు సునాయాసంగా జరిగిపోతుంది. కానీ బిడ్డ పోసిషన్ వేరుగా ఉండడం వలన సహజ కాన్పు ఇబ్బంది కావచ్చు. ఒకవేళ బిడ్డ అడ్డం తిరిగి ఉన్న లేదా బిడ్డ పోసిషన్ లో ఏదైనా తేడాలు ఉన్న బిడ్డ ఇరుక్కు పోతాడు.

3. భుజాలు

సాధారణ కాన్పు సమయంలో బిడ్డను బయటకు తీసేటప్పుడు ముందుగా ఒక భుజం బయటకు వస్తుంది. తరవాత ఇంకోటి వస్తుంది. కానీ కొన్ని సార్లు బిడ్డను బయటకు తీసేటప్పుడు రెండు భుజాలు ఒకేసారి బయటకు వస్తాయి. అలా రావడాన్ని Shoulder girdle dystocia అంటారు. ఇలా జరిగినప్పుడు బిడ్డ బయటకు రాకుండా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది.

4. ప్రసవించే పొజిషన్

ప్రసవించే సమయంలో మీరు ఉండే పొజిషన్ కూడా ప్రసవం మీద ప్రభావం చూపిస్తుంది. ప్రసవానికి ముందు మెల్లగా నడవండి దీని వలన మీ యోని దగ్గరి కండరాలు రిలాక్స్ అవుతాయి. ప్రసవం సులభమవుతుంది. అలానే ప్రసవ సమయంలో మీరు వీపు మీద పడుకోవడం కన్నా కూర్చోవడం వలన ప్రసవం సులభమవుతుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు పాటించండి.

5. యోని ఆకారం

మీకు ఇంతక ముందు జరిగిన ఏదైనా ఆపరేషన్ వలన కానీ లేదా సహజంగా మీ యోని చిన్నగా ఉండడం వలన ప్రసవ సమయంలో కొంచెం ఇబ్బందులు ఉండవచ్చు. ఒకవేళ బిడ్డ పెద్ద సైజులో ఉంటే మీ యోని ఆకారం చిన్నగా ఉన్నప్పుడు బయటకు రావడం కష్టమవుతుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon