Link copied!
Sign in / Sign up
1
Shares

ప్రపంచంలోనే మొదటిసారి : రెండో కాన్పులో ఇద్దరు.. మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు

మహిళకు అత్యంత సంతోషమైన క్షణాలు తల్లి అవుతున్నప్పుడు. మొదటిసారి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేరు. ఐతే ఇది చాలామందికి ఒకటి లేదా రెండు సార్లు కలుగుతూ ఉంటుంది. కానీ ప్రపంచంలోనే మొదటిసారి రెండో కాన్పులో ఇద్దరు కవలలు, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు ఈ దంపతులకు. మరి వీరి సంతోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఇలా చూడండి..

ముగ్గురు పిల్లలు చాలనుకున్నారు..కానీ

రాబర్ట్, నియా దంపతులు అమెరికాలోని మేరీ ల్యాండ్ కు చెందిన దంపతులు. వీరికి ఆరేళ్ళ క్రితం అంటే 2011లో అబ్బాయి పుట్టాడు. అతని పేరు షాయ్. ఆ  తర్వాత మళ్ళీ 2015లో రెండవ కాన్పులో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఈ కవల పిల్లలకు రిలే, అలెగ్జాన్డర్ అని పేరు పెట్టుకున్నారు. హమ్మయ్య ఈ ముగ్గురిని హాయిగా చూసుకుందాం అనుకోగా కొన్ని నెలల తర్వాత మళ్ళీ నియా గర్భం దాల్చిన విషయం తెలిసింది.

షాక్ అయిన దంపతులు

మూడోసారి గర్భం దాల్చిన తర్వాత హాస్పిటల్ కు బిడ్డ పెరుగుదల గురించి తెలుసుకునేందుకు వెళ్లగా ఆల్ట్రా స్కాన్ ద్వారా కడుపులో ఇద్దరు పిల్లలు ఉండే అవకాశం ఉందని చెప్పగానే షాక్ అయ్యారు. ఐతే తీరా ప్రసవం కాగానే ముగ్గురు పిల్లలు పుట్టడం వారికి ఆశ్చర్యం కలిగించిందట. చాలాసార్లు ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి, వారిని ఎలా పెంచాలి అని నేను నా భార్యతో జోక్స్ వేసేవాడిని. కానీ ఇప్పుడు మొత్తం ఆరుగురు పిల్లలు ఎలా అంటూ ఆశ్చర్యంతో పాటు ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే చాలామందికి మొదటికాన్పులో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు జన్మించడం జరిగింది కానీ ఇలా రెండో కాన్పులో ఇద్దరు, మూడో కాన్పులో ముగ్గురు పుట్టడం మాత్రం తొలిసారి…

మరి, ఈ కుటుంబానికి మీరు కూడా శుభాకాంక్షలు తెలుపండి, SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon