Link copied!
Sign in / Sign up
13
Shares

పొట్ట చుట్టు ఉన్న కొవ్వు తగ్గకపోవడానికి 7 కారణాలు

 ప్రసవం జరిగిన తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరగడంతో పాటు పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంది . గత 9 నెలలుగా మీ శరీరం చాలా ఒడిదుడుకులకు లోను కావడం వల్ల అనతి కాలంలో బరువు తగ్గలేకపోవచ్చు, అలాగే కొవ్వు కూడా తగ్గదు. అదుకు కొన్నికారణాలు ఇవే...

ప్రసవం తర్వాతి ఒత్తిడి

సాధారణంగా ప్రసవం జరిగిన తర్వాత చాలా రకమైన హార్మోన్స్ విడుదల అవుతాయి. దీని వల్ల మహిళలు ఒక రకమైన ఒత్తిడితో ఉంటారు. ఆ ఒత్తిడి వల్ల మీకు నడుము చుట్టూ ఉండే ఫ్యాట్ కరగదు. మీకు సరైన ప్రోత్సాహం లేక వ్యాయామం కూడా చేయలేకపోవచ్చు.  దీనిని అధికమించాలంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల విడుదల అయ్యే కొన్ని రకాల హార్మోన్స్ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి మంచి మూడ్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఆహారం

మీరు బరువు తగ్గకపోవడం అన్నది చాలా వరకు మీరు తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం కూడా ఒక కారణం కావచ్చు. లేదా మీరు తినే ఆహారంలో కరగడానికి ఎక్కువ సమయం పట్టే కొవ్వులు గల ఆహారం ఉండవచ్చు. మెగ్నీసియం తక్కువ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరవు తగ్గకపోవచ్చు. దీనికి తోడు మీరు నీరు తక్కువగా తాగుతూ ఉండవచ్చు.

వ్యాయామం

మీరు వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గరు. చాలా మంది కార్డియోకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గుతారు కానీ అది నిజం కాదు. బరువు తగ్గడానికి వేరే వ్యాయామాలు ఉన్నాయి. కండ బలపడటామికి చేసే వ్యాయామాలు చేయడం వల్ల కొవ్వు కరిగి బలంగా తయారవవచ్చు.

వయసు

వయసు పెరిగిన తర్వాత వ్యాయామాలు చేసినా బరువు తగ్గకపోవచ్చు. దానికి గల కారణం వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఉండే కొవ్వును తగ్గించే బెటబాలిజం తన సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తుంది. కాబట్టి వయసు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడం మరింత కష్టం.

ప్యాకేజ్డ్ ఫుడ్

నిల్వ ఉంచిన ఆహారం లేదా ప్యాకేజ్ ఫుడ్‌లో కరగించలేని కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవసరం లేని కొవ్వి మరింత స్థాయికి చేరుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటూ ఆకుకూరలు, కాయగూరలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు.

నిద్ర

మీరు చాలా నెలలుగా నిద్రకు చాలా దూరమై ఉంటారు. నిద్రకు దూరమైనప్పుడు ఆకలికి సంబంధించిన హార్మోన్స్ మన శరీరంలో ఎక్కువగా విడుదల అవుతాయి. దీంతో మీరు ఎక్కువ అహారాన్ని తీసుకుంటారు. కాబట్టి మీరు వీలైనంత నిద్ర పోవడానికి ప్రయత్నం చేయండి. తగినంత నిద్ర వల్ల మీరు బరువు బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

ఒత్తిడి

ప్రసవం జరిగిన తర్వాత శరీరంలో ఎక్కువ హార్మోన్స్ విడుదల అవడం వల్ల ఒత్తిడి లెవల్స్ పెరుగుతాయి. తద్వారా ఫ్యాట్‌కు సంబంధించిన కణాలు చురుకుగా మారి మీ బరువును తగ్గకుండా నిలువరిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

మీకు కనీస మోతాదులో నడుము చుట్టూ ఫ్యాట్ ఉండటం మంచి విషయమే.అయితే ఎక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటే తగిన చర్యలు తీసుకోని కొవ్వును తగ్గించుకోవడం మంచిది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొవ్వు తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించడం మంచిది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon