Link copied!
Sign in / Sign up
2
Shares

పొట్ట చుట్టు పేరుకుపోయిన ఆ కాస్త కొవ్వు మీ ప్రాణాలకే ముప్పు!!!

పొత్తి కడుపులో ఉండడం వలన మన అందం తగ్గడమే కాకుండా ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు కూడా వస్తాయి. గుండె జబ్బు, డయాబెటిస్, రక్త పోటు వచ్చే ప్రమాదాలు పుష్కలంగా ఉండాయి కనుక మీరు దాని పట్ల అశ్రద్ధ వహించకుండా తగ్గించుకోవడానికి మరాగాలు అన్వేషించండి. ఇప్పుడు పొత్తి కడుపులో కొవ్వు వలన కలిగే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.

1. గుండె సమస్య

ఇటీవల చేసిన ఒక అధ్యాయనం ప్రకారం, దాదాపు 15000 మంది మహిళలు పొత్తి కడుపులో కారణంగా గుండె సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిసింది. అధిక బరువు ఉన్నా లేకపోయినా పొట్టి కడుపులో కొవ్వు ఉంటె మాత్రం గుండె సమస్యలు ఎదుర్కోక తప్పదు. కావున వీలైనంత తొందరగా ఈ సమస్య నుండి బయటపడండి.

2. టైపు 2 డయాబెటిస్

పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు ఉంటె ఇన్సులిన్ మీ మీద పని చేయకపోవచ్చు. అందువలన డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. జీవితమంతా మీకు నచ్చిన స్వీట్స్ తినకుండా మీ ఆకలిని చంపుకుంటారా? లేదు కదా. అందుకే డయాబెటిస్ లేకపోయినా ఎక్కువ షుగర్ తినకండి. ఎల్లపుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి.

3. రక్త పోటు

ఇటీవల కాలంలో ఈ వ్యాధి బారిన పాడనీ వారు అదృష్టవంతులు అనే చెప్పాలి. ఈ వ్యాధి ఉండడం గుండెకు అంత మంచిది కాదు.  రక్త పోటు రావడానికి అనేక కారణాలు అందులో కడుపు మీద పేరుకున్న కొవ్వు కూడా ఒకటి.

4. క్యాన్సర్

సైటోకైన్స్ అనేవి కొన్ని రకాల చెడ్డ కొవ్వు వలన విడులవుతాయి. ఇవి ఆరోగ్యమైన కణాలలోకి ప్రవేశించి క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి. అంటే, పొట్టలో అధిక కొవ్వు ఉన్న వారు సులువుగా కిడ్నీ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ వంటి వాటికి గురవుతారు.

5. డిప్రెషన్

పొత్తి కడుపులో కొవ్వు పేరుకోవడం మూలాన శారీరక సమస్యలే కాదు ఎన్నో మానసిక సమస్యలు కూడా వస్తాయి. దాదాపు 70 శాతం పొట్ట కొవ్వు ఉన్న వారు డిప్రెషన్ బారిన పడ్డారంట. ఏపని చేయకపోవడం వలన లేకపోతే మనుషులతో బాగా కలవకపోవడం వలన కూడా జరగవచ్చు. మన శరీరాకృతి బాగాలేదు కనుక మనం ఎక్కువ సొషల్గా ఉండము. దీని వలన ఏమి తెలిసింది, పొట్ట కొవ్వు వలన మన సోషల్ లైఫ్ కూడా కొత్త వరకు నాశనం అవుతోంది.

6. ఆర్థరైటిస్

ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్ల నొప్పికి మరియు వాపుకి కారణం. సాధారణంగా ఈ వ్యాధి ఎక్కువ వయసు ఉన్న వారికి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు పొత్తి కడుపులో కొవ్వు వలన కూడా వస్తుంది. ఈ కొవ్వు కీళ్ళ మీద ఒత్తిడి తేవడంతో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

7. మతి మరపుతనం

మీరు ఏ వస్తువు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? మీకు బర్త్ డే వంటివి జ్ఞాపకం ఉండట్లేదా? అయితే మతి మరపు వ్యాధి ఉందేమో ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఆ వ్యాధి ముదరక ముందే చికిత్స తీసుకోవడం మంచిది. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం పొట్ట భాగంలో పేరుకున్న అధిక కొవ్వు వలన కూడా మతి మరపు రావచ్చు అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon