Link copied!
Sign in / Sign up
24
Shares

రుచికరమైన 'పొటాటో లాలీపాప్' పిల్లలకు చాలా ఇష్టం : పదే 10 నిముషాల్లో ఎలా చేసుకోవాలో చూడండి

పిల్లలకు చిరు తిండ్లు, ఆకర్షణీయంగా కనిపించే ఆహార పదార్థాలంటే బాగా ఇష్టపడతారు.  తమ పిల్లలకు బయట ఆహార పదార్థాలు తినిపించడం అంటే ఇష్టం తల్లితండ్రులు, ఇదిగో ఇలా పొటాటో లాలిపాప్ లను స్నాక్స్ గా చేసుకుని మీ పిల్లలకు తినిపించండి. ఇందులో పిల్లలకు మంచి శక్తిని అందించే ప్రోటీన్స్ మరియు  విటమిన్స్ ఉన్నాయి. మరి పొటాటో లాలిపాప్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

పొటాటో లాలిపాప్ కు కావాల్సిన పదార్థాలు :

-బంగాళాదుంపలు 3 లేదా 4

-బ్రెడ్ ముక్కల పొడి - అరకప్పు

-తరిగిన ఉల్లిపాయ ముక్కలు - ¼ కప్పు

-కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

-కారం పొడి -¼  టేబుల్ స్పూన్

-ధనియాల పొడి - చిన్న స్పూన్

-నిమ్మకాయ రసం - ½ టేబుల్ స్పూన్

-తగినంత ఉప్పు

-2 టేబుల్ స్పూన్ల మైదా పిండి

-రెండు మిరపకాయలు తరిగినవి

-నూనె

-మిరియాల పొడి -ఒక స్పూన్

-పెరుగు-ఒక కప్పు

-చక్కర

పొటాటో లాలిపాప్ ఎలా తయారు చేసుకోవాలి..?

-ముందుగా బంగాళాదుంపలను ఉడకబెట్టాలి ఉడకబెట్టిన బంగాళాదుంపలపై ఉన్న తొక్కను తీసివేసి, మెత్తగా చేసుకుని ఒక బౌల్ లోకి వేసుకోవాలి.

-బంగాళాదుంపలలోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకులు, బ్రెడ్ ముక్కల పొడి, ధనియాల పొడి, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, రుచికోసం తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

-ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టి, ఇంకో గిన్నెలో రెండు స్పూన్ల మైదాపిండిని తీసుకుని అందులో కాసిన్ని నీళ్లు వేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్ లో బ్రెడ్ ముక్కల పౌడర్ ను ఉంచుకోవాలి, ఇందులో కాస్త మసాలా పౌడర్ మరియు కారం పొడి వేసి మిక్స్ చేసుకోవాలి.

-చేతిలోకి కొంచెం ఆయిల్ వేసుకుని బంగాళాదుంపల మిశ్రమాన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ ను మైదాపిండిలో ముంచి బ్రెడ్ ముక్కల పొడిలో కలిపి మరుగుతున్న నూనెలో వేయించాలి. బాగా ఎర్రగా అయిన తర్వాత కిందకు దించుకోవాలి.

-పెరుగులో కొంచెం చక్కర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పొటాటో లాలిపాప్ లను ఉంచుకుని తింటే కలిగే రుచిని మాటల్లో చెప్పలేం.. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.

Video Credits : Foods and Flavors

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon