‘పొటాటో బాల్స్’ : పిల్లలకు ఇష్టమైన ఫుడ్..2నిముషాల్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోండి
పొటాటో బాల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తినే పదార్థం. విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ వీటిలో ఎక్కువశాతంలో ఉండటం వలన పిల్లలకు ఇవి ఆరోగ్యకరమే కాబట్టి ప్రతి తల్లి తప్పకుండా తెలుసుకోవాలి. 15 నిముషాలలో ఈ ఆహారాన్ని ఎలా తయారుచేసుకోవచ్చో 2 నిముషాలలో ఇక్కడ తెలుసుకోండి..
పొటాటో బాల్స్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు
1.2 లేదా 3 బంగాళాదుంపలు
2.100 గ్రాముల వెన్న
3.రెండు గుడ్ల పచ్చసొనలు
4.కొద్దిగా గోధుమ పిండి, 2 గుడ్లు మరియు బ్రెడ్డు ముక్కల పౌడర్
5. తగినంత ఉప్పు మరియు మిరియాల పొడి
6.ఆలివ్ ఆయిల్
ఎలా తయారు చేసుకోవాలి?
⇒ముందుగా ఒక బౌల్ లో బంగాళాదుంపలు మరియు నీటిని వేసి అందులో కాస్త ఉప్పు కలిపి 25 నిముషాల పాటు బాగా ఉడికించాలి.
⇒బాగా ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి చల్లని నీటిలో ఉంచి తొక్కలు తీసివేసి ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని ఇందులో వెన్న, గుడ్ల సొనలు, కాస్త మిరియాల పౌడర్ మరియు ఉప్పు కలిపి మిశ్రమంగా మెత్తగా చేసి గంట లేదా రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి.
⇒ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ఆ మిశ్రమాన్ని తీసుకుని గుండ్రని ఉండలుగా చేసుకోవాలి. ఈ గుండ్రటి ఉండలను గోధుమ పిండితో మిక్స్ చేయాలి. ఆ తర్వాత రెండు గుడ్లను పగులగొట్టి అందులో కాస్త ఉప్పు కలిపి ఉండలను ఒక్కసారి అందులో ముంచి తీయాలి.
⇒ఆ తర్వాత బ్రెడ్ ముక్కల నుండి తీసుకున్న పొడిలో ఉండలను ఉంచి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అలా మొత్తం అన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి.
⇒ఇక ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేసుకుని ఆ గుండ్రటి ఉండలను కొద్దిసేపు వేడి నూనెలో ఉంచి బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసివేయాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఇంతటితో పిల్లలకు ఇష్టమైన ‘పొటాటో బాల్స్’ రెడీ అయినట్లు.
వీటిని పిల్లలకు సాయంత్రం పూట తినిపిస్తే బాగా ఇష్టంగా తింటారు. అందరికీ SHARE చేయండి. ఈ వీడియోలో ఎలా తయారుచేసుకోవచ్చో చూడవచ్చు.
Video Credits : Food and Cooking
