Link copied!
Sign in / Sign up
3
Shares

ప్రాణాలకు తెగించి తమ్ముడి ప్రాణాలు కాపాడిన అక్క : వైరల్ వీడియో

ఇంటి వరండాలో తన తమ్ముడిని చిన్న బొమ్మ కారులో కూర్చోబెట్టుకుని అటు ఇటూ తిప్పుతూ ఆడిస్తోంది అక్క ఆర్తి. ఇంతలో అక్కడికి ఓ పొగరుబోతు పరుగులు పెడుతూ వచ్చి ఈ చిన్నారులపై దాడి చేసింది. ఆ సమయంలో తన ప్రాణాలకన్నా తన తమ్ముడి ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని పెద్ద సాహసమే చేసి తమ్ముడిని కాపాడుకుంది. ఆవు కొమ్ములతో దాడి చేయడంతో ఆ అమ్మాయికి స్వల్ప గాయాలయ్యాయి.

కొమ్ములతో పొడిచిన ఆవు

Video Credits: NDTV

తన 4 ఏళ్ళ తమ్ముడు కార్తీక్ ను ఇంటి బయట బొమ్మ కారులో 8 ఏళ్ళ అక్క ఆర్తి ఆడిస్తూ ఉండగా, సడన్ గా అక్కడికి ఓ పొగరు బోతు వచ్చి కొమ్ములపై ఇద్దరినీ దాడి చేసింది. బొమ్మ కారును కొమ్ములతో ఎత్తి పడేసింది. ఆ తర్వాత తమ్ముడిని పొడవటానికి ప్రయత్నిస్తుంటే తన శరీరాన్ని అడ్డుపెట్టి తమ్ముడిని ఎత్తుకుంది. ఎలాగోలా ఆవు నుండి తమ్ముడిని కాపాడింది. కానీ ఈ చిన్నారికి స్వల్ప గాయాలయాయ్యి. కొన్ని నిముషాల తర్వాత ఇంట్లో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆవును అక్కడి నుండి అదిలించాడు. నిజంగా పెద్ద సాహసమే చేసిన ఈ చిన్నారికి సోషల్ మీడియాలో ఈ వీడియోను SHARE చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. కర్ణాటకలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ప్రమాదం వచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ వీడియో రుజువు. ఈ వీడియోను SHARE చేసి ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon