పిల్లలున్న ప్రతి తల్లితండ్రులు ఫాలో కావాల్సిన యూట్యూబ్ ఛానల్స్
ఒకప్పుడు సెలవుల్లో ఊరికి వెళితే తాతయ్య,అమ్మమ్మ చెప్పే చిట్టి చిట్టి కథలు,అనగనగా అంటూ రాజుల కథలు, నీతి కథలలను గోరు ముద్దలు తినిపిస్తూ చెప్పేవారు. అలాగే పిల్లలకు ఆరోగ్యం దృష్టా ఎటువంటి ఆహారం సరైనది? వారి ఎదుగుదలకు ఎటువంటి ఆహారం మంచిది? ఏ చిన్న జబ్బు కలిగినా ఆయుర్వేదం మూలికలతో చిటికెలో నయం చేసేవారు. కానీ ఇప్పుడు ఎలా నీతి కథలు చెప్పే పెద్దలు ఉన్నా వినే పిల్లలు కరువయ్యారు? బామ్మా గోరుముద్దలు కలిపి తినిపిస్తున్నా ఏదో చిరుతిండి తిని పడుకునే పిల్లలు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ కు అలవాటైపోయారు వాటిని విడిచి పెట్టడం లేదు. అలా పిల్లలున్న ప్రతి తల్లితండ్రులు కచ్చితంగా ఫాలో కావాల్సిన కొన్ని పిల్లల యూట్యూబ్ ఛానల్స్ మీకోసం…టైటిల్స్ లింక్ పై క్లిక్ చేయడం వలన ఆ యూట్యూబ్ ఛానల్స్ ను మీరు చూడవచ్చు.
1.Fairy Toonz Telugu
పిల్లలకు నీతి కథలు, నవ్వించే కామెడీ వీడియోస్, పిల్లలను ఆనందపరిచే రైమ్స్ ను అందిస్తోంది. పిల్లలున్న ప్రతి తల్లితండ్రులు ఈ ఛానల్ ను ఫాలో అవ్వడం వలన మీ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది.
2.Mother Goose Club
ప్రీ స్కూల్ పిల్లలకు, ఎప్పుడు ఏడుస్తూ పిల్లలకు 3D యానిమేషన్ తో రూపొందించిన రైమ్స్, డ్యాన్స్ ఈ వీడియోలు చూపించడం వలన ఆనందాన్ని పొందుతారు.
3.Turtle Interactive
ఎప్పుడు డల్ గా ఉండే పిల్లలకు తల్లితండ్రులు ఈ ఛానల్ ను ఫాలో అవడం వలన పిల్లలు ఆక్టివ్ గా ఉండటానికి తోడ్పడుతుంది. ఇందులో రైమ్స్, సాంగ్స్, ఆల్ఫబీట్ సాంగ్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా 2D లో రూపొందిస్తున్నారు.
4.Baby Health Guide
చిన్న పిల్లల ఆరోగ్యం, పుట్టిన తర్వాత పిల్లల కోసం ఆరోగ్య చిట్కాలు, పిల్లల చర్మ సంరక్షణ కొరకు, ప్రగ్నెన్సీ తో ఉన్న మహిళలు, ప్రగ్నెన్సీ తర్వాత మహిళలు ఎటువంటి హెల్త్ టిప్స్ పాటించాలో ఈ ఛానల్ లో తెలుసుకోవచ్చు.
5.KidsOne Nursery Rhymes
చక్కని సంభాషణలతో పిల్లలకు బాగా అర్థం అయ్యేలా, ఆసక్తికరమైన వీడియోలతో పిల్లలకు నచ్చే విధంగా రైమ్స్, కథలు, పిల్లల చదువుకు సంబంధించిన విషయాలను ఇంట్రెస్టింగ్ ఈ ఛానల్ లో తెలుసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లలో ఇక్కడ వీడియోలను రూపొందించడం జరిగింది.
